కరణ్ జోహార్

భారతదేశ నటుడు. నిర్మాత, కథకుడు

కరణ్ జోహార్ (జననం 25 మే 1972), (కె జో అని కూడా పిలుస్తారు).[3] ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రచయిత, కాస్ట్యూం డిజైనర్, నటుడు, టివి ప్రముఖుడు. ప్రముఖ నిర్మాత యష్ జోహార్, హీరో జోహార్ ల కుమారుడు కరణ్.

కరణ్ జోహార్
2018లో కరణ్ జోహార్
జననం
రాహుల్ కుమార్ జోహార్[1]

(1972-05-25) 1972 మే 25 (వయసు 52)
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
విద్యాసంస్థహెచ్.ఆర్. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్
వృత్తి
  • సినీ దర్శకుడు
  • నిర్మాత
  • స్క్రీన్ రైటర్
  • కాస్ట్యూమ్ డిజైనర్
  • టెలీవిజన్ పర్సనాలిటీ
  • యాక్టర్
క్రియాశీల సంవత్సరాలు1989 - ప్రస్తుతం
పిల్లలు2
తల్లిదండ్రులు
  • యష్ జోహార్ (తండ్రి)
సన్మానాలుపద్మశ్రీ పురష్కారం(2020)[2]
సంతకం

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై(1998) సినిమాతో దర్శకునిగా కూడా పరిచయమయ్యారు కరణ్. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు అందుకున్నారు. ఆ తరువాతా ఆయన దర్శకత్వం వహించిన కభీ ఖుషీ కభీ గమ్(2001), కభీ అల్విదా నా కెహ్నా(2006) సినిమాలు కూడా పెద్ద హిట్లే. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అయాన తీసిన మై నేం ఈజ్ ఖాన్(2010) సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుని అవార్డు అందుకున్నారు ఆయన. తన తండ్రి స్థాపించిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలో ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. బాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్.

తొలినాళ్ళ జీవితం

కరణ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత యష్ జోహార్, హీరో జోహార్ లకు  ముంబైలో జన్మించారు. ముంబై లోని గ్రీన్ లాన్స్ హై స్కూల్ లోనూ,  హెచ్.ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లోనూ  చదువుకున్నారు ఆయన. ఫ్రెంచ్ భాషలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.[4] 1989లో దూరదర్శన్ లోని ఇంద్రధనుష్ సీరియల్ లో శ్రీకాంత్  పాత్రలో నటించారు కరణ్.

చిన్నప్పట్నుంచీ, సినిమాలకు ఆకర్షితుడైన కరణ్ రాజ్ కపూర్,  యష్ చోప్రా, సూరజ్ బర్జత్యాలు తన ప్రేరణలుగా చెప్పుకుంటారు  ఆయన.[5][6] కొంతకాలం న్యూమరాలజీని నమ్మిన కరణ్ కేవలం "K" అనే అక్షరంతో మొదలయ్యే పేర్లనే సినిమాలకు పెట్టేవారు. కానీ 2006లో వినోద్ చోప్రా నిర్మాణంలో వచ్చిన లగే రహో మునా భాయ్  సినిమాను చూసి, న్యూమరాలజీని నమ్మడం మానేశారు.[7]

సినిమాలు

నటునిగా
  • దూరదర్శన్ సీరియల్ ఇంద్రధనుష్(1989)లో -శ్రీకాంత్
  • దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే(1995) – రాకీ
  •  మై హూ నా(2004)
  • హోమ్ డెలివరీ:ఆప్కో..ఘర్ తక్ (2005) – స్వంత పాత్ర
  • అలగ్(2006) – స్వంత పాత్ర
  • సలామ్-ఎ-ఇష్క్ (2007) – స్వంత పాత్ర
  • ఓం శాంతి ఓం(2007) – స్వంత పాత్ర
  • C Kkompany  సి కెకొంపెనీ(2008) – గేమ్ షో హోస్ట్ పాత్ర
  • ఫ్యాషన్(2008) – స్వంత పాత్ర
  • లక్ బై చాన్స్(2009) – స్వంత పాత్ర
  • బాంబే వెల్వెట్(2015) – కైజద్ ఖంబట్టా
  • షాందార్(2015) - స్వంత పాత్ర

పురస్కారాలు

పద్మశ్రీపురస్కారం
జాతీయ పురస్కారం
జాతీయ ఫిలిం అవార్డులు
  • 1999: జాతీయ ఉత్తమ చిత్రం(దర్శకుడు)-కుచ్ కుచ్ హోతా హై
ఫిలింఫేర్ అవార్డులు

గెలిచినవి

  • 1999: ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం -కుచ్ కుచ్ హోతా హై
  • 1999: ఫిలింఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారం  – కుచ్ కుచ్ హోతా హై
  • 2002: ఫిలింఫేర్ ఉత్తమ మాటల రచయిత పురస్కారం– కభీ ఖుషీ కభీ గమ్ 
  • 2011: ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం –మై నేమ్ ఈజ్  ఖాన్ 

నామినేషన్

  • 2002: ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం– కభీ ఖుషీ కభీ గమ్
  • 2004:ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం – కల్ హో నా హో
  • 2008: ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం – కభీ అల్విదా నా కెహ్నా
  • 2009: ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం - దోస్తానా
  • 2010: ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం - వేక్ అప్ సిద్
ఐఫా అవార్డులు

గెలిచినవి

  • 2001: ఐఫా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పురస్కారం– మొహొబ్బతే
  • 2002: ఐఫా ఉత్తమ మాటల రచయిత పురస్కారం – కభీ ఖుషీ కభీ గమ్
  • 2004: ఐఫా ఉత్తమ కథ పురస్కారం  – కల్ హో నా హో
  • 2011: ఐఫా ఉత్తమ దర్శకుడు పురస్కారం - మై నేమ్ ఈజ్ ఖాన్

నామినేషన్

  • 2002: ఐఫా ఉత్తమ దర్శకుడు – కభీ ఖుషీ కభీ గమ్
  • 2008: ఐఫా ఉత్తమ దర్శకుడు – కభీ అల్విదా నా కెహ్నా
అప్సరా ఫిలిం & టివి నిర్మాతల గిల్డ్ పురస్కారాలు

గెలిచినవి

  • 2011: అప్సరా ఉత్తమ దర్శకుడు - మై నేమ్ ఈజ్ ఖాన్
  • 2013: ప్రెసిడెంట్స్ హానర్ - స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్
స్క్రీన్ అవార్డులు

గెలిచినవి

  • 1999: ఉత్తమ దర్శకునిగా స్క్రీన్ పురస్కారం – కుచ్ కుచ్ హోతా హై
  • 2004: ఉత్తమ స్క్రీన్ ప్లే స్క్రీన్ పురస్కారం – కల్ హో నా హో

నామినేషన్

  • 2002: స్టార్ స్క్రీన్ ఆవార్డు ఉత్తమ దర్శకుడు పురస్కారం –కభీ ఖుషీ కభీ గమ్
  • 2004: ఉత్తమ చిత్రం స్క్రీన్ అవార్డు – కల్ హో నా హో
జీ సినీ అవార్డులు
  • 1999: జీ సినీ ఉత్తమ దర్శకుడు పురస్కారం – కుచ్ కుచ్ హోతా హై
  • 2011: జీ సినీ ఉత్తమ దర్శకుడు పురస్కారం – మై నేమ్ ఈజ్ ఖాన్
  • 2011: జీ సినీ ఉత్తమ కథ పురస్కారం – మై నేమ్ ఈజ్ ఖాన్[11]
స్టార్ డస్ట్ అవార్డులు
  • 2013: స్టార్ డస్ట్ డ్రీం డైరక్టర్ అవార్డు - స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్
గౌరవాలు
  • 2007లో, వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2006 కరణ్ ను 250 గ్లోబల్ యంగ్ లీడర్స్ జాబితాలో ఒకరిగా చేర్చింది.[12]
  • 30 సెప్టెంబర్ 2006లో, పోలాండ్, వార్సా లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలకు జ్యూరీ మెంబర్ గా చేసిన మొట్టమొదటి భారత  సినీ నిర్మాత కరణ్.[13]
  • లండన్ ఒలింపిక్స్ కు ప్రధాని మన్మోహన్ సింగ్ కాకుండా ఆహ్వానించిబడిన ఏకైక భారతీయుడు ఆయన.[14]

మూలాలు