కన్యాకుమారి జిల్లా

తమిళనాడు లోని జిల్లా

కన్యాకుమారి జిల్లా, (కన్నియాకుమారి) భారతదేశం, తమిళనాడు రాష్ట్రం లోని ఒక జిల్లా.[1] ఇది భారత ప్రధాన భూభాగంలోని దక్షిణాది జిల్లాలకు చెందిన జిల్లా. తమిళనాడు జిల్లాలలో జన సాంద్రత పరంగా ఇది రెండవ స్థానంలో ఉంది.[2] తలసరి ఆదాయంలో రాష్ట్రంలో ఇది అత్యంత ధనిక జిల్లా. ఇది రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచిక (ఎచ్.డి.ఐ), అక్షరాస్యతలో అగ్రస్థానంలోఉంది.[3][4] జిల్లా ప్రధాన కార్యాలయం నాగర్‌కోయిల్.

Kanniyakumari district
District of Tamil Nadu
Clockwise from top:Thiruvalluvar Statue, Padmanabhapuram Palace, Nagaraja Temple, Udayagiri Fort
పటం
Kanniyakumari district
Location in Tamil Nadu
Coordinates: 8°19′N 77°20′E / 8.32°N 77.34°E / 8.32; 77.34
CountryIndia
StateTamil Nadu
DistrictKanyakumari
ముఖ్యపట్టణంNagercoil
TaluksAgastheeswaram,
Kalkulam,
Thovalai,
Vilavancode,
Killiyur,
Thiruvattar
Government
 • District CollectorM. Arvind, I.A.S
 • Superintendent of PoliceD. N. Hari Kiran Prasad, I.P.S
 • District Forest OfficerM. Ilayaraja, I.F.S
విస్తీర్ణం
 • Total1,672 కి.మీ2 (646 చ. మై)
జనాభా
 (2011)
 • Total18,70,374
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,900/చ. మై.)
Languages
 • OfficialTamil
 • MinorityMalayalam
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
629 xxx
Telephone code04652 for Nagercoil & 04651 for Marthandam
Vehicle registrationTN-74 for Nagercoil & TN-75 for Marthandam
Coastline72 కిలోమీటర్లు (45 మై.)
Sex ratioM-1000/F-1014 /
Literacy97.6%
Legislature typeElected
Current Member of ParliamentVijay Vasanth
Lok Sabha constituencyKanniyakumari
Legislative Assembly Constituencies (6) Current MembersN. Thalavai Sundaram (Kanniyakumari) M. R. Gandhi (Nagercoil) J. G. Prince (Colachel) T. Mano Thangaraj (Padmanabhapuram) S. Rajesh Kumar (Killiyoor) S. Vijayadharani (Vilavancode) District Panchayath Chairman S. Merliant Dhas
Precipitation2,382 మిల్లీమీటర్లు (93.8 అం.)
Avg. summer temperature31 °C (88 °F)
Avg. winter temperature22 °C (72 °F)
Central location:8°03′N 77°15′E / 8.050°N 77.250°E / 8.050; 77.250

చారిత్రాత్మక ప్రాంతాలు, నంజినాడ్, ఎడైనాడు, నేటి కన్యాకుమారి జిల్లాలో కలిగి ఉన్నాయి. వీటిని వివిధ తమిళ, మలయాళ రాజవంశాలు చేరాస్, / వేనాడ్ / ట్రావెన్‌కోర్ రాజవంశం, పాండ్యన్‌లు, చోజన్లు నాయకులు పరిపాలించారు. పురావస్తు త్రవ్వకాల ద్వారా కొన్ని కళాఖండాలు బయటపడ్డాయి.[5] ఇది భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు వలసరాజ్యాల కాలంలో ట్రావెన్‌కోర్ రాచరిక రాష్ట్రంలో భాగంగా ఉంది;[6] తిరువనంతపురం జిల్లా లోని ఎనిమిది తహసీల్‌లలోనాలుగింటిని పూర్వపు ట్రావెన్‌కోర్ రాజ్యం నుండి వేరు చేయుటద్వారా ఇది కొత్త జిల్లాగా ఏర్పడింది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు వాటిని మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా చేశారు. ప్రెసిడెన్సీ తరువాత తమిళనాడుగా పేరు మారింది. ఈ జిల్లా అయ్యవాళి ధార్మిక పథం జన్మస్థలం. జిల్లా, రాష్ట్రంలో అనేక చారిత్రక చిహ్నాలు ఉన్నాయి.ఇవి జిల్లాతో అగస్త్య, వ్యాస, తోల్కాప్పియార్, అవ్వయ్యర్, తిరువల్లువర్ వంటి ఋషులను అనుబంధిస్తాయి.

భౌగోళికం

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19013,59,248—    
19114,22,260+1.63%
19214,94,125+1.58%
19315,81,851+1.65%
19416,76,975+1.53%
19518,26,380+2.01%
19619,96,915+1.89%
197112,22,549+2.06%
198114,23,399+1.53%
199116,00,349+1.18%
200116,76,034+0.46%
201118,70,374+1.10%
మూలాం:[7]

కన్యాకుమారి జిల్లా 77°15' , 77°36' తూర్పు రేఖాంశం, 8°03' , 8°35' ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. జిల్లాకు ఉత్తర, ఈశాన్యంలో తిరునల్వేలి జిల్లా, తూర్పున గల్ఫ్ ఆఫ్ మన్నార్, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, పశ్చిమాన తిరువనంతపురం జిల్లా ( కేరళ) సరిహద్దులుగా ఉన్నాయి.

కన్యాకుమారి జిల్లాను రెండు ప్రాంతాలుగా విభజించారు. అవి ఈడై నాడు, నంజిల్ నాడు. విలవంకోడ్, కల్కులం తాలూకాలు, ఈడై నాడు ప్రాంతంలో పూర్తిగా విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు కలిగి ఉన్నాయి. తోవలై, అగస్తీశ్వరం తాలూకాలు నంజిల్ నాడు ప్రాంతంలో ఉన్నాయి. అరళ్వాయిమొజి పట్టణం ఈ రెండు ప్రాంతాలను వేరు చేస్తుంది. అలాగే ఈ ప్రాంతాల సరిహద్దు వాజిమలై (వేజి కొండలు).

కన్యాకుమారి జిల్లాకు మూడు వైపులా సముద్రం ఉంది. ఉత్తరం వైపు సరిహద్దుగా ఉన్న పశ్చిమ కనుమల పర్వతాలతో విభిన్నమైన స్థలాకృతిని కలిగి ఉంది. భౌగోళికంగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చినప్పుడు జిల్లా భూభాగం చాలా చిన్నది.

పరిపాలనా విభాగాలు

కన్యాకుమారి జిల్లా పరిపాలనా ప్రయోజనాలకోసం తోవలై, అగస్తీశ్వరం, కల్కులం, కిల్లియూర్, తిరువత్తర్, విలవంకోడ్ అనే ఆరు తాలూకాలుగా విభజించారు.వాటిలో అగస్తీశ్వరం, రాజక్కమంగళం, తోవలై, కురుంతన్‌కోడ్, తుక్కలే, తిరువత్తర్, కిల్లియూర్, ముంచిరై, మేల్‌పురం అనే తొమ్మిది పంచాయితీ బ్లాకులు (సమితులు) ఉన్నాయి. జిల్లాలో నాగర్‌కోయిల్ అనే ఒక నగరపాలక సంస్థ, పద్మనాభపురం, కొలచెల్, కుజితురై, కొల్లెంకోడ్ అనే నాలుగు పురపాలికలు ఉన్నాయి. [8] దిగువ స్థాయి పరిపాలనలో, 95 గ్రామ పంచాయతీలు,మరో 55 ప్రత్యేక వర్గానికి చెందిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

గణాంకాలు

2011 జనాభా లెక్కల ప్రకారం కన్నియాకుమారి జిల్లా మొత్తం జనాభా 1,870,374. వీరిలో 926,345 మంది పురుషులు కాగా, 944,029 మంది స్త్రీలు ఉన్నారు. 2011లో కన్నియాకుమారి జిల్లాలో మొత్తం 483,539 కుటుంబాలు ఉన్నాయి. కన్యాకుమారి జిల్లా సగటు లింగ నిష్పత్తి 1,019. జిల్లా మొత్తం జనాభాలో 82.3% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 17.7% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 92% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 90.8% ఉంది. అలాగే కన్యాకుమారి జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1,022 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 1,004 ఉంది.[9]

కన్నియాకుమారి జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 182350 మంది ఉన్నారు, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. 0-6 ఏళ్లలోపు మగ పిల్లలు 92835 మంది కాగా, ఆడ పిల్లలు 89515 మంది ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 964, ఇది కన్యాకుమారి జిల్లా సగటు లింగ నిష్పత్తి (1,019) కంటే తక్కువ. కన్నియాకుమారి జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 91.75%. కన్యాకుమారి జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 84.26%, స్త్రీల అక్షరాస్యత రేటు 81.37%.

జిల్లాలో ముఖ్య పట్టణాలు

  • అగస్తీశ్వరం తాలూకా: నాగర్‌కోయిల్, కన్యాకుమారి, అంజుగ్రామం, అగస్తీశ్వరం, శుచింద్రం, రాజక్కమంగళం .
  • తోవలై తాలూకా: బూతపాండి, తోవలై, అళగియాపాండియాపురం, అరళ్వైమొజి .
  • కల్కులం తాలూకా: పద్మనాభపురం, తుక్కలే, కొలచెల్, కల్కులం, తిరువితంకోడ్, ఇరానియల్, కురుంతన్‌కోడ్, తింగల్‌నగర్ .
  • తిరువత్తర్ తాలూకా: తిరువత్తర్, కులశేఖరం .
  • కిల్లియూర్ తాలూకా:కిల్లియూర్, కరుంగల్ .
  • విలవంకోడ్ తాలూకా:కుజితురై, మార్తాండం, విలవంకోడ్, కలియక్కవిలై, ముంచిరై, కొల్లెంకోడ్,
  • మంజలుమూడు :అరుమనై, మేల్పురం.

ఆసక్తికరమైన ప్రదేశాలు

తిర్పరప్పు జలపాతాలు

తిర్పరప్పు జలపాతాలు కన్నియాకుమారి జిల్లాలోని జలపాతాలు. ఇవి మహాదేవర్ ఆలయం జలపాతాలకు చాలా సమీపంలో ఉంది. ఈ జలపాతాలు కులశేఖరం నుండి 7 కిమీ (4.3 మై) దూరంలో ఉన్నాయి.వాస్తవానికి ఈ జలపాతం నాగర్‌కోయిల్‌లోని సిటీ సెంటర్ నుండి సరిగ్గా 34 కిమీ దూరంలో ఉంది.

మణిమెడై

మణిమెడై నాగర్‌కోయిల్ మధ్య భాగంలో ఉంది. మణిమెదై అంటే హై క్లాక్ అని అర్థం. ఇది నాగర్‌కోయిల్ పట్టణానికి చిహ్నం. క్లాక్ గేజ్ నిర్మాణం 1892లో ట్రావెన్‌కోర్ మహారాజుల కాలంలో ప్రారంభమైంది. నిర్మాణం తర్వాత, దీనిని ట్రావెన్‌కోర్ రాజు హిస్ హైనెస్ శ్రీ మూలం తిరునాళ్ వర్మ ప్రారంభించారు.

మాథుర్ అక్విడెక్ట్

మాథుర్ అక్విడెక్ట్‌ను రెండు పర్వతాల మధ్య సాగు నీటిని వెళ్లేందుకు నిర్మించారు. మాథుర్ అక్విడెక్ట్‌ను అరువిక్కరై, ముధాలారు మధ్య పరలియారు నదిలో నిర్మించారు. ఈ అక్విడెక్ట్‌ను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పెరుంతలైవర్ తిరు కామరాజర్ నిర్మించారు. మాథుర్ అక్విడెక్ట్ దక్షిణాసియాలో అతిపెద్ద అక్విడెక్ట్. ఆక్విడక్ట్ 1,240 అడుగులు (380 మీ) పొడవు, 101 అడుగులు (31 మీ) ఎత్తు 28 పెద్ద స్తంభాలతో ఉంది. ఇది తిరువత్తర్ నుండి 3 కిమీ (1.9 మై), నాగర్‌కోయిల్ నుండి 26 కిమీ దూరంలో ఉంది.

పద్మనాభపురం ప్యాలెస్

శతాబ్దాల క్రితం, అన్ని సౌకర్యాలు ఉన్న ఇళ్లను ప్యాలెస్‌లుగా పిలిచేవారు. రాష్ట్రాల పాలకులు, రాజులు ఇలాంటి ప్యాలెస్‌లలో ఉంటారు. పద్మనాభపురం ప్యాలెస్ ఒకప్పుడు ట్రావెన్‌కోర్ రాజుల అధికారిక నివాసం. పద్మనాభపురం ప్యాలెస్ కేరళ శైలిలో చెక్కలతో నిర్మించబడింది. ఈ ప్యాలెస్‌ను 18వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ రాజు తిరు అనిజం తిరునాల్ మార్తాండ వర్మ నిర్మించాడు. 186 ఎకరాల కోటలో 6.5 ఎకరాల్లో ఈ ప్యాలెస్ ఉంది. ప్యాలెస్ కేరళ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ ప్యాలెస్ తుక్కలే నుండి కేవలం 2 కిమీ దూరంలో ఉంది.

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట పార్వతీపురం నుండి కేవలం 10 కిమీ దూరంలో ఉంది. ఈ కోట పులియూర్‌కురిచి అనే ప్రదేశంలో 22½ హెక్టార్లలో ఉంది. ఈ కోటను తమిళనాడు ప్రభుత్వం అటవీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.

వట్టక్కోట్టై

'వట్టక్కోట్టై' అనే పదానికి సర్కిల్ కోట అని అర్థం,ఇది వృత్తాకారంలో ఉంటుంది. ఈ కోట తూర్పు తీరంలో సముద్ర తీరం వెంబడి నిర్మించబడింది. ఈ కోట 3 1/2 ఎకరాలలో 25 మీటర్ల ఎత్తుకు కాంపౌండ్ రాళ్లతో ట్రావెన్‌కోర్ ఆర్మీ చీఫ్ దిలానై నిర్మించాడు. ఈ కోట భారత ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.ఇది కన్నియాకుమారి నుండి ఉత్తరాన కేవలం 6;కిమీ దూరంలో, అంజు గ్రామం నుండి దక్షిణాన కేవలం 2 కిమీ దూరంలో ఉంది.

వివేకానంద రాక్

వివేకానంద రాక్ మెమోరియల్ కన్నియాకుమారి జిల్లాలోని వావతురైలో ఒక స్మారక చిహ్నం.ఇది వవతురై ప్రధాన భూభాగంలో కేవలం 500 మీటర్ల తూర్పున ఉంది. ఈ శిలపై జ్ఞానోదయం పొందిన స్వామి వివేకానంద గౌరవార్థం 1970లో నిర్మించారు. స్థానిక పురాణాల ప్రకారం, కుమారి దేవి ఈ శిలల్లో శివుని భక్తితో తపస్సు చేసింది.

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ