కన్నదాసన్

కన్నదాసన్ (1927 జూన్ 24  - 1981 అక్టోబరు 17) తమిళ తత్వవేత్త, కవి, చలన చిత్ర గీత రచయిత, నిర్మాత, నటుడు, సినిమా కథా రచయిత, పత్రికా సంపాదకుడు, పరోపకారి. అతను భారతదేశంలో అతి ముఖ్యమైన గీత రచయితలలో ఒకనిగా గుర్తింపబడ్డాడు. కవియరాసు ( కవి గ్రహీత ) అని తరచుగా పిలువబడే కన్నదాసన్ తమిళ చిత్రాలలో తన పాటల సాహిత్యానికి బాగా గుర్తింపబడ్డాడు. అతని రచనలలో 6000 కవితలు, 232 పుస్తకాలతో పాటు 5000 చలనచిత్ర సాహిత్యాలు ఉన్నాయి.[1] అతను రాసిన నవలలు, ఇతిహాసాలు, నాటకాలు, వ్యాసాలన్నింటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది హిందూ మతంపై 10-భాగాల మత పుస్తకం అర్థముల్లా ఇంధూ మతం ( అర్థవంతమైన హిందూ మతం ). అతను 1980 సంవత్సరంలో తన నవల చేరమాన్ కథలి కోసం సాహిత్య అకాడమీ పురసకరాన్ని పొందాడు. 1969లో కుఝతైక్కగ చిత్రం కోసం అతను రాసిన పాటలకు ఉత్తమ గీత రచయితగా ఫిలింఫేర్ పురస్కారం పొందాడు. ఇటువంటి పురస్కారం పొందిన మొదటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు.[2]

'కవివరసు' కన్నదాసన్
పుట్టిన తేదీ, స్థలంముత్తయ్య
(1927-06-24)1927 జూన్ 24
సిరుకూడల్‌పట్టి, తారైకుడి, మద్రాసు జిల్లా, బ్రిటిష్ రాజ్యం (ప్రస్తూం శివగంగ జిల్లా, తమిళనాడు)
మరణం1981 అక్టోబరు 17(1981-10-17) (వయసు 54)
చికాగో, యునైటెడ్ స్టేట్స్
కలం పేరుకళైముత్తు పుల్వార్
వనంగముడి
కనకప్రియన్
పార్వతీనాథన్
ఆరోకియసామి
వృత్తిరచయిత, నవలా రచయిత, గీతరచయిత, రాజకీయ నాయకుడు, సినిమా నిర్మాత, సాహిత్య సంపాదకుడు.
జాతీయతభారతీయుడు
పౌరసత్వం India (1927-1981; అతని మరణం)
విద్య8వ తరగతి
(తమిళపుల్వార్ కోర్సు ఉత్తీర్ణత )
విషయంకవిత్వం, సాహిత్యం
గుర్తింపునిచ్చిన రచనలుఅర్థముల్లా ఇందు మధం
యేసు కవియం
పురస్కారాలుజాతీయ పిలింఫేర్ ఉత్తమ గీత రచయిత
కుఝతక్కగల్

సాహిత్య అకాడమీ పురస్కారం
చెరమన్ కడలి
జీవిత భాగస్వామిజీవిత భాగస్వాములుపొన్నఝగి (పొన్నమ్మాల్)
(m. 1950–1981; అతని మరణం); 7 పిల్లలు
పార్వతి
(m. 1950–1981; అతని మరణం); 7 పిల్లలు
వల్లమ్మాయి
(m. 1957–1981; అతని మరణం); 1 కుమార్తె
సంతానం14)క్రిందివారితో పాటు
గాంధీ కన్నదాసన్
అన్నాదురై కన్నదాసన్
డా.కమన్ కన్నదాసన్ శ్రీమతి రేవతీ షణ్ముగం
శ్రీనివాసన్ కన్నదాసన్
శ్రీమతి కలైసెల్వి చొక్కలింగం
గోపీ కన్నదాసన్
డా.రామసామి కన్నదాసన్
శ్రీమతి వైశాలి మనోహరన్
వెంకటాచలం కన్నదాసన్
కన్మణి సుబ్బు కన్నదాసన్
కలైవణన్ కన్నదాసన్
తల్లిదండ్రులు
  • శాతప్పన్ (తండ్రి)
  • విశాలాక్షి (తల్లి)

వ్యక్తిగత జీవితం

కన్నదాసన్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కరైకుడికి సమీపంలోని గ్రామం సిరుకూడపట్టిలో సాతప్పన్, విశాలాక్షి దంపతులకు 1927లోజన్మించాడు. అతనికి బాల్యంలో "ముత్తయ్య" అనే పేరు ఉండేది. అతను తన 11మంది సహోదరులలో 8వ సంతానంగా జన్మించాడు. బాల్యంలో అతనిని పెంపకం కోసం 7000 రూపాయలిచ్చి చిగప్పి ఆచి అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు. చిగప్పి ఆచి అతనికి ప్రారంభ విద్య అందించడానికి పూర్తి బాధ్యత వహించాడు. సిరుకుదల్పట్టి, అమరావతిపుధుర్లలోని పాఠశాలల్లో అతను 8 వ తరగతి వరకు పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అతను తమిళ పత్రికలో సంపాదకీయ పదవిని చేపట్టే ముందు తిరువోటియూర్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు. అక్కడ మొదటిసారి కన్నదాసన్ అనే మారుపేరు తీసుకున్నాడు.[3]

మతపరమైన అభిప్రాయాలు

ముత్తయ్య ద్రావిడ నాస్తిక ఉద్యమంలో పనిచేస్తున్న ఉద్యమకారులలో ముఖ్యమైన ఉద్యమకారునిగా ఉన్నాడు. అతను తమిళ భాష, తమిళ సంస్కృతిపై అమితమైన ప్రేమను కలిగి ఉండేవాడు. అతను తమిళ సాహిత్యంలోని గద్య, పద్య కవిత్వం రెండింటిలో రాణించాడు. అతను ఆండాళ్ యొక్క తిరుప్పావైను పూర్తిగా చదివాడు. అందులోని అధ్బుత కవిత్వానికి అతను ఆశ్చర్యచకితుడైనాడు. ఈ సంఘటన అతనిపై ఒక లోతైన, శాశ్వత ప్రభావాన్ని కలిగించింది. చాలా ఆత్మపరిశీలన తరువాత, అతను తిరిగి సనాతన ధర్మానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను తనను తాను కన్నదాసన్ అని పేరు మార్చుకున్నాడు. కన్నదాసన్ అనగా శ్రీ కృష్ణుడి సేవకుడు అని అర్థం. తమిళ భాషలో "కన్నన్" అంటే కృష్ణుడు, సంస్కృతంలో "దాస" అంటే సేవకుడు అని అర్థం. అతను హిందూమత సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో లోతుగా శోధించి, సనాతన ధర్మంపై అర్ధముల్లా ఇంధూ మతం పేరుతో తన పుస్తకాల సంకలనాలను రాశాడు. అతను కారైకుడికి సమీపంలో ఉన్న సిరుకూదల్పట్టి గ్రామంలో జన్మించాడు. [4][5]

పాటల రచన

తమిళ చిత్ర పరిశ్రమలో పాటల రచన ద్వారా అతను విశేష గుర్తింపు పొందాడు. అతను అనేక సినిమాలకు పాటలను రాసాడు. తమిళ చిత్ర సీమకు తన పాటల ద్వారా విశేష సేవలనందించాడు. అతనికి ముందు తమిళ చిత్ర పరిశ్రమలో పాపనాశనం శివ, కంబదాసన్, వింధాన్, ఎ.మురుతకాశి, కు.మ.బాలసుబ్రహ్మణ్యం వంటి చాలా మంది గీతరచయితలు ఉండేవారు. కన్నదాసన్ చిత్ర పరిశ్రమలోకి అడుగిడిన తరువాత చిత్ర పరిశ్రమ దృశ్యం పూర్తిగా మారిపోయింది. అతను త్వరగా పరిశ్రమలో ఎక్కువ మందు కోరుకునే గీత రచయిత అయ్యాడు. అతని మరణం వరకు అలానే తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. కన్నదాసన్ ఎంత ప్రాచుర్యం పొందాడో, ఇతర సమకాలీన కవులు రాసిన కొన్ని పాటలను కూడా ప్రజలు వాటిని కన్నదాసన్ రాసినట్లు భావించేవారు. అతని మరణం తరువాత, చిత్ర సాహిత్యంలో అనేక మార్పులు జరిగినప్పటికీ చాలా మంది ఇప్పటికీ కన్నదాసన్ ను ఉత్తమ పాటల రచయితగా భావిస్తారు.  అతను సుబ్రమణ్య భారతి తరువాత గొప్ప ఆధునిక తమిళ కవిగా పరిగణించబడ్డాడు. 

భారత స్వాతంత్ర్య సంగ్రామం "మారుధు పాండైయర్స్" యొక్క మార్గదర్శకులను చిత్రీకరించిన చారిత్రాత్మక తమిళ చిత్రం శివగంగై సీమై నిర్మాత. ఆ చిత్రం నుండి వచ్చిన "సంతుపోట్టు" పాట ప్రజాదరణ పొందింది.

ఆధ్యాత్మిక పుస్తకాలు

  • అర్థముల్లా ఇందూ మతం
  • యేసు కవియం
  • బాగవత్ గీతై
  • పొన్మాజై
  • బజగోవిందం
  • శ్రీ కృష్ణ కవసం
  • శ్రీ వెంకటేశ సుప్రబాతం- అందల్ తిరుపవై
  • అంబిగై అలగు ధారిసనమ్
  • కృష్ణ అంతాతి
  • శంకర పోకిశం

గుర్తించదగిన నవలలు

  • చేరమన్ కథాలి
  • అవల్ ఓరు హిందు పెన్
  • శివపుకల్ ముక్కుత్తి
  • రథా పుష్పంగల్
  • అవలుకాక్క ఓరు పాడల్
  • స్వర్ణ సరస్వతి
  • నాదంత కథై
  • మిసా
  • సురుతి సెరత రాకంగల్
  • ముపాదు నాలమ్ పౌర్ణమి
  • అరంగముం అంతరంగమము
  • కదల్ కొండా అప్పుడునాడు
  • అయిరామ్ తివు అంకయార్కన్నీ
  • కామిని కాంచన
  • కుట్టి కథైగల్
  • ఓరు కవినాని కథై
  • వెలంగ్‌కుడి తిరువిల
  • అయిరాంకల్ మండపం
  • బిరుంధవనం
  • ఆచి
  • విలకు మాతుమా శివపు
  • ఆథనాథు ఆతిమంతి
  • అనార్కలై
  • అథైవిడ రాగసియం
  • పరిమలై కోడి
  • ఓరు నాతియిన్ కథై
  • సెంబాగథమన్ కథై
  • మనంపొల వాల్వు
  • శివకాంగై సీమై
  • సంతితేన్ సింథితేన్
  • ఓమైయిన్ కొట్టై
  • సరసువిన్ సౌందర్య లగారి

కవిత్వం

  • ముత్రుపెరాత కవియంగల్
  • శ్రీ కృష్ణ అంతాతి
  • అంబిగై అలగు ధరిసనమ్
  • మాంగని
  • పాడి కుదుత మంగళం
  • తైపావై
  • కన్నధసన్ కవితైగల్ భాగాలు 1-7

ఆత్మకథలు [6]

  • ఎనాతు సుయసరితం
  • ఎనాతు వసంత కాలంగల్
  • వనవసం
  • మానవాసం
  • నాన్ పార్థ అరసియల్

ఎంచుకున్న సినిమాలు

సాహిత్యం

  1. సింగారి
  2. ఆయిరథిల్ ఓరువన్
  3. మన్నాది మన్నన్
  4. థాయ్ సోలై తత్తాధే
  5. థాయై కాథ తానయన్
  6. పాసం
  7. కరుప్పు పనం
  8. పనాతోట్టం
  9. పావ మన్నిప్పు
  10. పెరియా ఇడాతు పెన్
  11. ధర్మం తలై కాక్కు
  12. ఆనంద జోధి
  13. నీడిక్కుప్పిన్ పాసం
  14. కుడుంబ తలైవన్
  15. కాంచి తలైవన్
  16. పారిసు
  17. వెట్టైకరన్
  18. పనకర కుడుంబం
  19. పాలమ్ పజముమ్
  20. తిరువిలయదల్
  21. సరస్వతి సబతం
  22. పట్టికడ పట్టానమ
  23. ఉరిమైకురల్
  24. ఎన్ కదమై
  25. నాడోడి
  26. తంగా పతంక్కం
  27. లక్ష్మి కళ్యాణం
  28. పాసా మలార్
  29. మూండ్రామ్ పిరై
  30. ఇరువర్ ఉల్లం
  31. దీర్ఘా సుమంగలి
  32. ఆలయం
  33. అన్నై
  34. నానుమ్ ఓరు పెన్
  35. పజని
  36. వరుమయిన్ నిరం శివప్పు
  37. బిల్లా
  38. నీవు
  39. దేవా మగన్
  40. కలతుర్ కన్నమ్మ
  41. పార్థల్ పాసి తీరం
  42. పాద కనిక్కై
  43. అన్నై వెలంకన్నీ

కవి గ్రహీత

కన్నదాసన్ మరణించేటప్పుడు తమిళనాడు ప్రభుత్వ కవి పురస్కార గ్రహీత. అతను రెండు ముఖ్యమైన ఆత్మకథలు వ్రాసాడు. వాటిలో ఒకటి వనవాసం ( అతను నాస్తికుడిగా ఉన్నప్పుడే తన గత జీవితం గురించి ఒక పుస్తకం) రెండవది డిఎంకెను విడిచిపెట్టిన తరువాత రాసిన మానవాసం. ఇందులో తన జీవితం గురించి రాసాడు.

తమిళ సాహిత్యానికి అతను చేసిన సేవ

కన్నదాసన్ గొప్ప రచయిత. అతని రచన వివిధ రకాల రూపాలను కలిగి ఉంది. వాటిలో కవితలు, నవలలు, తమిళ చిత్రాలకు సాహిత్యం, ఆధ్యాత్మికతపై పుస్తకాలు ఉన్నాయి. అర్ధముల్లా ఇంధు మతం ( అర్ధవంతమైన హిందూ మతం) అనే అతని సిరీస్ హిందూ మతం యొక్క సూత్రాలను వివరించడంలో సరళత్వానికి గుర్తింపు పొందింది. యేసు తన కవితా రూపంలో చెప్పిన కథను యేసు కవియంతో సహా తన జీవితంలో తరువాతి భాగంలో అనేక ఆధ్యాత్మిక రచనలు రాశాడు. కన్నదాసన్ రాసిన చాలా కవితలు ఫ్రెంచ్ భాషలోకి అనువదించబడ్డాయి.[7] అతను అనేక కవితల సంపుటాలను వ్రాసి ప్రచురించాడు. అతను కంబర్ యొక్క ఆరాధకుడు, కంబర్ యొక్క కళాత్మకతను ప్రశంసిస్తూ అనేక కవితలు రాశాడు, సిఎన్నన్నూరై చేసిన వ్యంగ్యానికి ("కంబరాసం") విరుద్ధంగా. అనేక కంబర్ ఉత్సవాల్లో అతను మాట్లాడాడు. అతను సీతా యొక్క నడక యొక్క అందం, రాముడి భుజాలను గూర్చి పాటలు పాడాడు;

అతను యేసుక్రీస్తు జీవితం గురించి ఒక పుస్తకం రాశాడు "యేసు కావియం" ఒక పురాతన కవితా తమిళంలో. ఇది తిరుచిరాపల్లిలో 1981 సంవత్సరంలో ప్రచురించబడింది. ఈ కార్యక్రమానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ అధ్యక్షత వహించారు. కన్నదాసన్ యొక్క చివరి సాహిత్య రచన యేసు కావియం.

మరణం

కన్నదాసన్ 1981 అక్టోబరు 17 న అమెరికాలోని చికాగోలో మరణించాడు. అక్కడ తమిళ అసోసియేషన్ ఆఫ్ చికాగో నిర్వహించిన తమిళ సమావేశంలో పాల్గొనడానికి భారతదేశం నుండి వెళ్ళాడు. మరణించేటప్పుడు అతని వయస్సు కేవలం 54 సంవత్సరాలు.[8] కొన్ని నెలల తరువాత విడుదలైన ' మూండ్రామ్ పిరై ' చిత్రం నుండి వచ్చిన "కన్నే కలైమనే" పాట అతని చివరి పాట.

వారసత్వం

కరైకుడి వద్ద తమిళనాడు ప్రభుత్వం "కవియరసర్ కన్నదాసన్ మణిమండపం"గా ఒక స్మారక మందిరాన్ని నిర్మించింది.[6] చెన్నైలోని టి.నగర్ వద్ద నటేశన్ పార్క్ వద్ద గల రోడ్డుకు ఇదివరకు "హెన్స్‌మన్ రోడ్డు" అనిపేరు ఉండేది. ఆ ప్రాంతంలో కన్నదాసన్ 1958 నుండి నివసించేవాడు. ఆ రోడ్డుకు తర్వాత "కన్నదాసన్ వీధి"గా అతని గౌరవార్థం నామకరణం చేసారు.

ఈ ఇంట్లోనే శ్రీ బక్తావత్సలం నుండి శ్రీమతి జయలలిత వరకు 7 మంది ముఖ్యమంత్రులు కన్నదాసన్‌ను సందర్శించారు. కన్నదాసన్ కు ఒకప్పుడు 14 కార్లు ఉండేవి. అవి అతని ఇంటి ముందు గల రహదారికి ఇరువైపులా ఆపి ఉంచేవారు. శ్రీ కామరాజర్ ఇచ్చిన చివరి కార్లు ఇప్పటికీ ఈ ఇంట్లో ప్రదర్శనలో ఉన్నాయి.

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ