ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ Oriental Bank of Commerce (OBC) 1943 ఫిబ్రవరి 19న లాహోర్ (ప్రస్తుతం  పాకిస్తాన్) లో స్థాపించబడినది.దేశ విభజన తరువాత, బ్యాంక్  రిజిస్టర్డ్ ఆఫీసుకు ఢిల్లీ కి  మార్చబడింది. 1980 ఏప్రిల్ 15న 307 శాఖలు, మొత్తం వ్యాపారం సుమారు రూ.4350 మిలియన్లు (అమెరికా డాలర్లు 108 మిలియన్ డాలర్లు) తో  ఈ బ్యాంకు జాతీయం చేయబడింది. బ్యాంకు వ్యాపార స్థాయిల పరంగా అసాధారణమైన పురోగతి, సరిఅయిన లాభాన్ని ప్రకటించడంలో మచ్చలేని ట్రాక్ రికార్డ్ బ్యాంకు గా ఉన్నది.[4]

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
రకంప్రభుత్వ
  • మూస:BSE was
  • మూస:NSE was
పరిశ్రమ
  • Banking
  • Financial services
స్థాపన19 ఫిబ్రవరి 1943; 81 సంవత్సరాల క్రితం (1943-02-19) in Lahore, British India
స్థాపకుడురాయ్ బహదుర్ సోహన్ లాల్
క్రియా శూన్యత1 ఏప్రిల్ 2020 (2020-04-01)
విధివిలీనంపంజాబ్ నేషనల్ బ్యాంక్
వారసులుపంజాబ్ నేషనల్ బ్యాంక్
ప్రధాన కార్యాలయం
గుర్గావ్‌
,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
కీలక వ్యక్తులు
ముకేశ్ కుమార్ జైన్(మేనేజింగ్ డైరెక్టర్ & ముఖ్య నిర్వహణ అధికారి)
ఉత్పత్తులు
  • Asset management
  • Commercial banking
  • Consumer banking
  • Credit cards
  • Investment banking
  • Mortgages
  • Pensions
  • Private banking
  • Retail banking
రెవెన్యూIncrease 17,867.69 crore (US$2.2 billion) (2019)
Operating income
Increase 3,754 crore (US$470 million) (2019)
Net income
Increase 55.00 crore (US$6.9 million) (2019)
Total assetsIncrease 2,71,909.57 crore (US$34 billion) (2019)
ఉద్యోగుల సంఖ్య
21,729 (March 2019)
మూలధన నిష్పత్తి12.73% (2019)
Footnotes / references
[1][2][3]

బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయం 19 ఫిబ్రవరి, 2012న దాని 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీ నుండి గుర్గావ్‌లోని సొంత భవనానికి మార్చబడింది.[5]

చరిత్ర

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్  వ్యవస్థాపకుడు, మొదటి ఛైర్మన్ రాయ్ బహదూర్ లాలా సోహన్ లాల్ 1943 సంవత్సరంలో లాహోర్ లో  స్థాపించాడు. బ్యాంక్ ప్రారంభమైన నాలుగు సంవత్సరాలలో దేశ విభజనను ఎదుర్కోవలసి వచ్చింది. బ్యాంకు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ లో తన శాఖలను మూసివేసి, తన రిజిస్టర్డ్ కార్యాలయాన్ని లాహోర్ నుండి అమృత్ సర్ (పంజాబ్ భారతదేశం) కు మార్చవలసి వచ్చింది. అప్పటి బ్యాంకు ఛైర్మన్ లాలా కరమ్ చంద్ థాపర్  పాకిస్తాన్ డిపాజిటర్లకు ఇచ్చిన వాగ్దానాలకు అనుసరించి, పాకిస్తాన్ దేశ  ఖాతాదారుల అందరికి వారి సొమ్మును చెల్లించాడు.[6]

అభివృద్ధి

బ్యాంక్ కార్యాలయాన్ని మార్చిన తరువాత బ్యాంకు పాకిస్తాన్ డిపాజిటర్లకు వారి డబ్బును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. 1970-76  సంవత్సరాల వరకు  బ్యాంక్ మంచి స్థాయిలో నడిచింది. బ్యాంక్ వ్యాపారం సజావుగా లేక, పెరుగుతున్న మార్జిన్ల కారణంగా బ్యాంకు అత్యల్ప స్థాయిలో ఉంది. ఆ సమయంలో చైర్మన్ అయిన లాలా కరంచంద్ థాపర్ బ్యాంకును మూసివేసే నిర్ణయానికి  దాదాపుగా వచ్చాడు. ఈ నిర్ణయంతో బ్యాంకు ఉద్యోగులు, నాయకులు బ్యాంకును కాపాడేందుకు ముందుకు వచ్చారు. దీంతో యాజమాన్యం ఉద్యోగులతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. దీనితో బ్యాంక్ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. బ్యాంక్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచింది. బ్యాంకును 1980 సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాక, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 1997 లో బారీ దోయాబ్ బ్యాంక్, పంజాబ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లను కొనుగోలు చేసింది, ఇది దేశవ్యాప్తంగా బ్యాంకు  స్థాయిని  పెంచింది.[7]

26 జులై 2004 సంవత్సరంలో సంక్షోభంలో ఉన్న  గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్‌ను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది.[8]

విలీనం

ఏప్రిల్ 2020లో, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో విలీనం చేయబడింది, ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది.[9]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ