ఎలెక్స్ హేలీ

ఎలెక్స్ హేలీ (ఆగస్టు 11, 1921 – ఫిబ్రవరి 10, 1992) అమెరికా రచయిత. ఈయన రచించిన ఆంగ్ల నవల రూట్స్ చాలా పేరొందింది.[1][2] ఇది ఏడు తరాలు పేరుతో తెలుగులోకి అనువాదం చేయబడింది.

ఎలెక్స్ హేలీ
Haley during his tenure in the U.S. Coast Guard
పుట్టిన తేదీ, స్థలంఆలెగ్జేండర్ ముర్రై పల్మేర్ హేలీ
(1921-08-11)1921 ఆగస్టు 11
ఇల్ కా, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్
మరణం1992 ఫిబ్రవరి 10(1992-02-10) (వయసు 70)
సెటిల్, వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్
వృత్తిరచయిత
పూర్వవిద్యార్థిఆల్కర్న్ స్టేట్ యూనివర్సిటీ
ఎలిజబెత్ సిటీ స్టేట్ యూనివర్సిటీ
జీవిత భాగస్వామినానీ బ్రాంచ్ (1941-1964), జూలియట్ కాలిన్స్ (1964-1972), మైరా లూయిస్ (1977-1992), సైనిక జీవితం
Military career
రాజభక్తియుఎస్
సేవలు/శాఖయునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్
సేవా కాలం1939–1959
ర్యాంకు చీఫ్ పెట్టీ ఆఫీసర్
పోరాటాలు / యుద్ధాలురెండవ ప్రపంచ యుద్ధం కౌరియన్ యుద్ధం

జననం - విద్యాభ్యాసం

ఎలెక్స్ హేలీ 1922, ఆగస్టు 11న న్యూయార్క్ లోని ఇతాకాలో జన్మించాడు. ముగ్గురు సోదరులలో పెద్దవాడైన హేలీకి ఇద్దరు తమ్ముళ్ళు (జార్జ్, జూలియస్ ), ఒక చెల్లి (తండ్రి రెండవ భార్య కూతురు) ఉన్నారు. హేలీ కుటుంబం టేనస్సీలోని హెన్నింగ్‌లో ఉండేది, ఇతనికి ఐదేళ్ళున్నప్పుడు కుటుంబం ఇతాకాకు వచ్చింది. హేలీ తండ్రి సైమన్ హేలీ అలబామా ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో వ్యవసాయ ప్రొఫెసర్ కాగా, తల్లి బెర్తా జార్జ్ హేలీ హెన్నింగ్‌ని చెందినది. ఈ కుటుంబానికి ఆఫ్రికన్, మాండింకా, చెరోకీ, స్కాటిష్, స్కాటిష్-ఐరిష్ మూలాలు ఉన్నాయి.[3][4][5][6]

తన తండ్రిలాగే, అలెక్స్ హేలీ 15వ ఏట మిస్సిస్సిప్పి లోని చారిత్రాత్మక ఆల్కార్న్ స్టేట్ యూనివర్శిటీలో చేరాడు. ఒక సంవత్సరం తరువాత, ఉత్తర కరోలినాలోని ఎలిజబెత్ సిటీ స్టేట్ కాలేజీలో చేరాడు. మరుసటి సంవత్సరం కళాశాల వదిలిపేసి తండ్రి, సవతి తల్లి వద్దకు తిరిగి వచ్చాడు. అలెక్స్ కు క్రమశిక్షణ అవసరమని భావించిన సైమన్ హేలీ, 18 ఏళ్ళ వయసులో మిలటరీలో చేరేందుకు అతనిని ఒప్పించాడు. అమెరికాలో రెండవ ప్రపంచయుద్ధం విరుచుకుపడే నాటికీ అతని వయసు 18 సంవత్సరాలు. అమెరికా తీర రక్షణాదళంలో భోజనశాలలో పనికి చేరి సృజనాత్మక రచనావ్యాసాంగం వంటపట్టించుకున్నాడు. తరువాత పత్రిక రచయితగా పేరుపొందాడు. 1939, మే 24న, అలెక్స్ హేలీ యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్‌లో 20 సంవత్సరాలు పనిచేశాడు.[7] హేలీ తన వంశపారంపర్య పరిశోధన ద్వారా, జుఫురే నగరానికి గుర్తింపు తెచ్చాడు.[8]

ఏడు తరాలు పుస్తకం

ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహాసముద్రంకి ఆవతలి ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు 1962లో నల్లజాతి అమెరికన్ రచయితగా ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఫలితంగా ఈ పుస్తకం రావడం వచ్చింది. 12 సుదీర్ఘ సంవత్సరాల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధనల ఫలితంగా ఈ పుస్తకం రూపొందింది. అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ఈ పుస్తకాన్ని 1977లో టెలివిజన్ మినిసిరీస్‌గా రూపొందించింది. దీనిని దాదాపు 130 మిలియన్ల మంది ప్రేక్షకులు చూశారు. ఈ పుస్తకం యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న నల్ల జాతీయుల చరిత్రపై ప్రజలలో అవగాహన పెంచడంతోపాటు అనేకమందికి వారివారి వంశవృక్షం, కుటుంబ చరిత్రపై ఆసక్తిని కలిగించింది.[9][10]

రచనలు

హేలీ మొట్టమొదటి పుస్తకం ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కం X 1965లో ప్రచురించబడింది. అది ఒక ముఖ్య నల్లజాతి నాయకుడు గురించిన పుస్తకం.[11][12][13]

హేలీ మరణించేనాటికి కుటుంబ చరిత్రకు సంబంధించిన రెండవ నవల రాస్తున్నాడు. ఆ నవలని పూర్తిచేయాలని స్క్రీన్ రైటర్ డేవిడ్ స్టీవెన్స్ ను హేలీ అభ్యర్థించాడు; ఆ పుస్తకం క్వీన్: ది స్టోరీ ఆఫ్ ఎ అమెరికన్ ఫ్యామిలీగా ప్రచురించబడింది. ఈ పుస్తకం ఎలెక్స్ హేలీస్ క్వీన్ అనే పేరుతో చిన్నచిన్న కథలుగా రూపొందించి 1993లో ప్రసారం చేయబడింది.

మరణం

హేలీ 1992, ఫిబ్రవరి 10న యునైటెడ్ స్టేట్స్, వాషింగ్టన్ లోని సెటిల్ లో మరణించాడు.

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ