ఎం.వి. నరసింహారావు

తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్

మాదిరెడ్డి వెంకట్ 'బాబ్జీ' నరసింహారావు, (జననం 11 ఆగస్టు 1954) తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్. 1978 నుండి 1979 వరకు 4 టెస్టుల్లో ఆడాడు.

బాబ్జీ నరసింహారావు
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1954-08-11) 1954 ఆగస్టు 11 (వయసు 69)
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
మారుపేరుబాబీ రావు
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
బౌలింగులెగ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
  • భారతీయుడు
కెరీర్ గణాంకాలు
పోటీటెస్ట్ క్రికెట్ఫస్ట్
మ్యాచ్‌లు4108
చేసిన పరుగులు464845
బ్యాటింగు సగటు9.1940.71
100లు/50లు-/-9/30
అత్యధిక స్కోరు20*160*
వేసిన బంతులు46313265
వికెట్లు3245
బౌలింగు సగటు75.6628.05
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు-15
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు-3
అత్యుత్తమ బౌలింగు2/467/21
క్యాచ్‌లు/స్టంపింగులు8/-111/-
మూలం: [1]

జననం

నరసింహారావు 1954, ఆగస్టు 11న తెలంగాణలోని సికింద్రాబాదులో జన్మించాడు.

క్రీడారంగం

1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లు ఆడటానికి నరసింహారావు ఎంపికయ్యాడు, కాని రెండు టెస్టుల ఆడిన తరువాత తొలగించబడ్డాడు. కిమ్ హ్యూస్ ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సిరీస్ కోసం తరువాతి సీజన్ లో రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టెస్టులో ఇండియా జట్టు ఓటమి నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషించాడు. చివరి రోజున భారత్ గెలవడానికి 247 అవసరమవ్వగా, 123 పరుగులకు 4 వికెట్లు తీశాడు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్, చేతన్ చౌహాన్ వంటి నలుగురు ముఖ్య బ్యాట్స్ మెన్స్ ఔటవ్వగా, నరసింహారావు అజేయంగా 85 పరుగులు చేసి యశ్‌పాల్ శర్మతో భాగస్వామ్యాన్ని అందించగా, భారత్ 4 వికెట్లకు 200 స్కోరుతో టెస్టు డ్రా గా ముగిసింది.[1] నరసింహారావు ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్ ఇది. బౌండరీ దగ్గర ఫీల్డర్‌గా ఉంటూ, ఎనిమిది క్యాచ్‌లు పట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4124 పరుగులు (సగటు 47.40) చేసి, 218 వికెట్లు (సగటు 24.20) తీసాడు. 2011 ఐసిసి ప్రపంచ కప్ కోసం ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు.

ఇతర వివరాలు

2012 డిసెంబరులో నరసింహారావు బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రతిష్టాత్మక సభ్యునిగా ఎంపికైన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ నిలిచాడు.[2] పదవీ విరమణ చేసిన తరువాత సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీని స్థాపించాడు. వివిఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, బవనక సందీప్, హనుమా విహారీ, తరుణ్ నెతులా వంటి అనేక మంది యువ క్రికెటర్లు ఈ అకాడమీలో శిక్షణ పొందారు.[3]

మూలాలు