ఉలేమా

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ఉలేమా, "ఉలమా" అని కూడా పలుకుతారు. ఏకవచనము ఆలిమ్, అరబ్బీ :عالِم , అర్థం పండితుడు లేదా ధార్మిక పండితుడు. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం ఖురాన్, షరియా, ఫిఖహ్, హదీసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, ఇస్లామీయ తత్వాన్ని తెలిసినవాడు, ఖురాన్ తఫ్సీర్, తఫ్ హీమ్ను యెరిగినవాడు.

ఇంకా విశాలంగా, 'ఉలేమా' అనగా ముస్లిం సమూహాల ధార్మిక వేత్తలు, ఉదాహరణకు ముఫ్తీ (ఫత్వాలు ఇచ్చువాడు), ఖాదీ (ఇస్లాం ధర్మాన్ని విశ్లేషించువాడు), ఫఖీహ్ (ఫిఖహ్ పండితుడు), ముహద్దిస్ (హదీసులు తెలిసిన వాడు). సమకాలీనంలో సాధారణ ముల్లాహ్ (ముల్లాలు), ఇమామ్ లు,, మౌల్వీలను కూడా 'ఉలేమాలు'గా వర్ణించడం, పిలవడం చూస్తుంటాము, ఇలా చేయడం తప్పు. ఇస్లామీయ ధార్మిక విషయాలను ఉన్నత తరహాలో అభ్యసించి, పాండిత్యం సంపాదించినవారిని మాత్రమే "ఉలేమాలు" అని సంబోధించాలి.

సమాజంలో వీరి పాత్ర

విద్య (పంతులు గా)

ఇస్లామీయ ప్రపంచం లోని మదరసాలలో ధార్మిక విద్యను బోధించుటకు వీరిని నియమిస్తారు., వీరు ధార్మిక ఉపన్యాసకులుగానూ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు.

పరిపాలనా యోగ్యతలు

షియా ఇస్లాం సంప్రదాయాలలో ఉలేమాలు అత్యంత అధికారాలు గలవారని రూఢి అయ్యింది. ఇరాన్ లోని 1979 విప్లవం, ఖోమైనీ నాయకత్వం, ఉలేమాల పటుత్వాన్ని నిరూపించింది. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ల రాజ్యంకూడా ఇది నిరూపించింది. కానీ ఇస్లామీయ ప్రపంచం లోని ఇతర రాజ్యాలలో వీరి పాత్ర ప్రాదేశిక పరమేనని కూడా చరిత్ర సాక్ష్యం చెబుతోంది.

సైనికాధికారులుగా

ఇరాన్ లో,, ఆఫ్ఘనిస్తాన్ లలోనూ, ఈ ఉలేమాలు అతి శక్తిమంతులుగా నిరూపితులయ్యారు. దీనికి మూలాలను శోధిస్తే, మహమ్మదు ప్రవక్త కాలానికి పోవలసివస్తుంది. మహమ్మదు ప్రవక్త ధార్మిక నాయకులే గాక సైన్యాధికారి గానూ విజయాలు పొందారు. ఇస్లాం, ధార్మికంగానే కాక, సామాజిక పరంగానూ ప్రభావం చేసేదని నిరూపించబడింది. వీరి కాలములోనే గాక వారి తరువాత కూడా, ధార్మిక నాయకులు, ఖలీఫాలుగా, సైనిక నాయకులు గానూ వుండుట చరిత్రలో మనం చూస్తాము.

న్యాయవిధానాలలో పాత్ర

కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఉదాహరణకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనూ, షరియా న్యాయస్థానాలు సాధారణంగా కనిపిస్తాయి. ఉలేమాలు న్యాయమూర్తులుగా వుండడం సహజం. భారతదేశంలో కూడా షరియా కోర్టులు, ప్రభుత్వ ఖాజీలు, ప్రతి జిల్లాలోనూ కానవస్తారు. ముస్లిం పర్సనల్ లా ఏర్పాటు, వాటి నిర్వహణ దాదాపు ఈ ఉలేమాల ద్వారానే జరుగుతున్నది.

సలహాదారులుగా

కొన్ని దేశాలలో, ఉదాహరణకు సౌదీ అరేబియా, ఉలేమాలు రాజుకు సలహాదారులుగానూ వుంటారు. అనేక ప్రభుత్వ విద్యాలయలలో వీరికి పదవులూ వుంటాయి.

బోధకులుగా

మస్జిద్ లలోనూ, మదరసా లలోనూ, ప్రసంగీకులు గాను, బోధకులుగానూ, శుక్రవారపు ప్రార్థనలలో ఖుత్బా (ఉపన్యాసం) ఇవ్వడానికి గానూ వీరు నియుక్తులౌతారు.కొందరు ఉలేమాలు దావాహ్ (ఇస్లాం వైపు ఆహ్వానించే కార్యక్రమం) నిర్వహించడాని తబ్లీఘీ జమాత్ యందు నిరంతరం పనిచేస్తూ దాయీ లుగా పేరొందారు.

మజ్ హబ్

ఉలేమాలు ఏదో ఒక సాంప్రదాయం (మజ్ హబ్) లో కార్యక్రమనిమగ్నులై ఉంటారు. సున్నీ ముస్లిం ల ముఖ్యమైన 'మజ్ హబ్'లు లేదా సాంప్రదాయిక పాఠశాలలు:

చరిత్ర

ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన ఒక పండితుడు.

ఇస్లామీయ ధర్మశాస్త్రాల ప్రకారం ఫిఖహ్ ఇస్లామీయ న్యాయసూత్రాల చరిత్ర ఇస్లామీయ ప్రారంభదశలోని ముస్లింల దశవరకూ పోతుంది. ఈ కాలంలో సిధ్ధాంతాల కంటే బోధనలే ఎక్కువ మహత్వాన్ని కలిగి వుండేవి.[1] ప్రారంభ ముస్లిం న్యాయసూత్ర క్రోడీకరణల స్థిరకారుడు ముహమ్మద్ ఇబ్న్ ఇద్రీస్ అష్-షఫీ (767-820), తన పుస్తకం అర్-రిసాలాలో విపులంగా, న్యాయమూలాలను చర్చించాడు, ఈ మూలాలు ఖురాన్, సున్నహ్, ఇజ్మా, ఖియాస్.[2]

ఇస్లామీయ స్వర్ణయుగంలో ఎన్నో ధార్మిక పాఠశాలలు న్యాయసూత్రాల అధ్యయనాలు చేశాయి. సాధారణ విషయాలపై న్యాయసూత్రాలు, సామాజిక విషయాలపై న్యాయసూత్రాలు క్రోడీకరింపబడినవి.[3] ఉదాహరణకు ఒక వైద్యుడు పాటించవలసిన నీతి నియమాలను,న్యాయసూత్రాలుగా స్థిరీకరించారు. వైద్యుల నీతి నియమాలు అనే న్యాయగ్రంధం ఇస్ హాఖ్ బిన్ అల్-అల్-రావి (854-931) సిరియా, రచించాడు. .[4] షరియా న్యాయం లోని వక్ఫ్, 7వ-9వ శతాబ్దాల మధ్య ట్రస్టు లకు సూచింపబడింది.[5] ఉదాహరణకు ప్రతి 'వక్ఫ్' కొరకు ఒక 'వఖీఫ్' (స్థాపకుడు), 'ముతవల్లీలు' (ట్రస్టీలు), 'ఖాదీ' (జడ్జి), లబ్ధిదారులు వుండవలెను.[6] ఈ వక్ఫ్ లను చూసే, క్రుసేడుల కాలంలో ఇంగ్లాండులో 'ట్రస్ట్ లా' ఏర్పాటు అయినది.[7][8]

ఉమ్మాహ్ లో ఉలేమాల పాత్ర

ఇస్లామీయ ప్రపంచంలో ఉమ్మాహ్ లేదా 'ఉమ్మత్' (ముస్లిం సముదాయం) ల ఏకగ్రీవాలైన ఇజ్మా కు, వీరే మార్గదర్శకులుగానూ, అధికారులుగానూ వ్యవహరిస్తుంటారు. ముస్లిం సముదాయం దీనిని ఆమోదిస్తుంది. కారణం ఈ ఇజ్మా, ఖురాన్, షరియా, హదీసులు, ఫిఖహ్ ల ఆధారంగా వుండడమే. ఈ ఇజ్మాకు మూలమగు ఇజ్తెహాద్ షరియా ప్రకారం ఉండడమే.

ఉలేమాలు రచయితలుగా

ఎందరో ఉలేమాలు, తమ జీవితమంతా ఈ విషయాల పట్లే అంకితం చేసి, ఎన్నో గ్రంథాలు రచించారు. ఒక విధంగా చూస్తే, ధార్మిక గ్రంథాలన్నీ దాదాపు ఉలేమాలే వ్రాశారు. ధార్మిక విషయాల పైన వీరికున్న పటుత్వం అలాంటిది. ఖురాన్ తర్జుమాలు, సున్నహ్ విషయాలు, హదీసులు, ఫిఖహ్, ఇజ్మా, ఖియాస్, ఇస్లామీయ చరిత్ర, సీరత్ (సీరా) వగైరా విషయాలపై వ్రాయబడ్డ పుస్తకాలలో చాలా వరకు ఉలేమాలు రచించారు. అరబ్బీ, పర్షియన్, ఉర్దూ టర్కీ లలో ఈ గ్రంథాలు అమితంగా కాన వస్తాయి.

ఇవీ చూడండి

నోట్స్

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ