ఉబర్
ఉబర్ టెక్నాలజీస్ ప్రయాణ సేవలు, ఫుడ్ డెలివరీ, సరుకు రవాణా లాంటి రంగాల్లో పనిచేసే బహుళజాతి సంస్థ.[2] దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఇది 70 దేశాలలో సుమారు 10వేలకు పైగా నగరాల్లో వ్యాపారం చేస్తుంది.
![]() | |
![]() Headquarters in Mission Bay, San Francisco | |
గతంలో | Ubercab (2009–2011) |
---|---|
రకం | పబ్లిక్ కంపెనీ |
| |
ISIN | US90353T1007 ![]() |
పరిశ్రమ |
|
స్థాపన | మార్చి 2009 |
స్థాపకుడు |
|
ప్రధాన కార్యాలయం | శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా |
సేవ చేసే ప్రాంతము | 70 దేశాలలో సుమారు 10వేలకు పైగా నగరాల్లో |
కీలక వ్యక్తులు |
|
సేవలు |
|
రెవెన్యూ | ![]() |
Operating income | ![]() |
Net income | ![]() |
Total assets | ![]() |
Total equity | ![]() |
ఉద్యోగుల సంఖ్య | 32,800 (2023) |
అనుబంధ సంస్థలు |
|
వెబ్‌సైట్ | www![]() |
Footnotes / references [1] |
చరిత్ర
2009 లో స్టంబుల్ అపాన్ సృష్టికర్తలలో ఒకడైన గ్యారెట్ క్యాంప్ సులభంగా, తక్కువధరకే లభించే ప్రయాణ సౌకర్యం కోసం ఒక ఆలోచన చేశాడు. క్యాంప్, అతని స్నేహితుడూ ట్రావిస్ క్యాలనిక్ ఇద్దరు కలిసి కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా 800 డాలర్లు పెట్టి ప్రైవేటు వాహనం మాట్లాడుకోవలసి వచ్చింది. మరోసారి క్యాంప్ ప్యారిస్ లో మంచు పడుతున్న ఒక రాత్రి క్యాబ్ ను పట్టుకోవడం కష్టమైంది.[3][4] ఇందుకోసం ఒక నమూనా మొబైల్ అప్లికేషన్ను క్యాంప్, అతని స్నేహితులు ఆస్కార్ సాలజార్, కోన్రాడ్ వెలన్ కలిసి క్యాలనిక్ ని ఒక సలహాదారుగా పెట్టుకుని తయారు చేశారు.
ఫిబ్రవరి 2010 నాటికి ర్యాన్ గ్రేవ్స్ ఉబర్ సంస్థ తొలి ఉద్యోగి అయ్యాడు. మే 2010 నాటికి గ్రేవ్స్ సియివో అయ్యాడు. డిసెంబరు 2010 కి క్యాలనిక్ సియివో అయ్యి గ్రేవ్స్ కి ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాధ్యత అప్పజెప్పాడు.[5]