మాధ్యమిక విద్య

వికీపీడియా నుండి
(ఉన్నత పాఠశాల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigationJump to search

మాధ్యమిక విద్య సమకాలీన విద్యావిధానంలో 14-18 సంవత్సరాల వయస్సుగల బాలబాలికాలు అభ్యసించే విద్య. ఈ విద్య అందరికీ తప్పనిసరి చేయబడింది. తెలుగు రాష్ట్రాలలో ఈ విద్యను పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యా మండలి వారు నిర్వహిస్తారు. పాఠశాలల నిర్వహణ, విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్,, పురపాలక సంఘం, కలుగజేస్తాయి. జిల్లాలో విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ మాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. భారత ప్రభుత్వం మాధ్యమిక శిక్ష అభియాన్ [1] ద్వారా ఈ విద్యని మెరుగుపరచటానికి కృషి చేస్తున్నది

కంప్యూటర్ విద్య

ఐసిటి@స్కూల్స్ పుస్తకపు పై పేజి

సమాచార, ప్రసార సాంకేతిక రంగం (Information and Communication Technology ICT) దేశ ప్రగతికి, సామాజిక మార్పుకి ఉత్ప్రేరకం కాబట్టి, అంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక విధానం (IT Policy) ముఖ్యోద్దేశము " సమాచార అందుబాటులో అసమానతలను తొలగించి, అన్ని ప్రభుత్వ స్థాయిలలో పౌరసేవలను మెరుగుపరచి,రాష్ట్రంలో సమాచార సాంకేతిక పెట్టుబడులను ప్రోత్సహంచి, సమాచార సాంకేతిక సాధనాలతో, మానవవనరుల అభివృద్ది చేయటం".

అందుకని కంప్యూటర్ విద్యని సెకండరీ పాఠశాల స్థాయిలో ముఖ్యమైనదిగా చేసి, దీనికోరకు పధకాలను ప్రవేశపెట్టారు.

  • 2000: క్లాస్ పధకం ( జిల్లాకి ఒక పాఠశాలను కంప్యూటరీకరించడం)
  • 2002: ఐసిటి@ 1000 పాఠశాలలు
  • 2008: ఐసిటి@ 5000 పాఠశాలలు (ఐదు సంవత్సరాలు బూట్ (BOOT) పద్ధతి)
  • ఇవేగాక, వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయంతో, కంప్యూటర్ సహాయంతో నేర్చుకోవడం పధకాలను అమలు చేస్తున్నది.
  • 2009: మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు శిక్ష ద్వారా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విద్య నేర్పెడివారికి కంప్యూటరు శిక్షణ ఇవ్వడం.

వీటివలన, 2020 నాటికి, 21 శతాబ్దపు ఒత్తిళ్లు ఎదుర్కొనే అక్షరాస్యతే కాక, జ్ఞాన సమాజాన్ని నిర్మించే దిశగా పని జరుగుతున్నది.
దీనికొరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ [2] ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది.

విమర్శలు

బూట్ (BOOT) పద్ధతిలో ధనాన్ని సేవల అమ్మకందారులపై ఖర్చు పెడతారు. వీరు అరకొర జీతాలపై కంప్యూటరు ఉపాధ్యాయులను నియమిస్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాధ్యత లేనందున, కాలపరిమితి తరువాత దీనిని కొనసాగించటం కష్టమవుతుంది. ఇలా జరిగిన కర్ణాటకలో ఫలితం సరిగా లేదని, దీనికి బదులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాధ్యత ఇచ్చిన కేరళలో ఫలితాలు బాగున్నాయని, ఐటిఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో[3] తెలిసింది.

ఇవీ చూడండి

వనరులు

మార్గదర్శకపు మెనూ