ఉత్తరాంధ్ర

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగా పరిగణిస్తారు.

ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) అనేది ఆంధ్ర రాష్ట్రం లోని ఉత్తర భాగం. ఉమ్మడిశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగా పరిగణించబడేవి.[2] ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 వలన వీటితోపాటు కొత్తగా ఏర్పడిన,పార్వతీపురం మన్యం జిల్లా ,అల్లూరి సీతారామరాజు జిల్లా ,అనకాపల్లి జిల్లా కూడా ఉత్తరాంధ్రలో భాగమే. ఈ ఆరు జిల్లాలని కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఇక్కడి భాష తెలుగు.

ఉత్తరాంధ్ర
ప్రాంతం
Nickname: 
కళింగాంధ్ర
దేశం భారతదేశం
రాష్ట్రందస్త్రం:Andhraseal.pngఆంధ్ర ప్రదేశ్
జిల్లాలు
భాషలు
 • అధికారికంతెలుగు
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)
అతిపెద్ద నగరంవిశాఖపట్నం

సంస్కృతి

భాష

తెలుగు

పుణ్యక్షేత్రాలు

సింహాచలం దేవస్థానం, రామతీర్ధం, పుణ్యగిరి, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం, కనకమహాలక్ష్మి అమ్మవారు, పద్మనాభం అనంత పద్మనాభ స్వామి దేవాలయం, విజయనగరం పైడితల్లి అమ్మవారు, రామతీర్థం ఆలయం ప్రసిద్ధ మైన పుణ్యక్షేత్రాలు

ఆహారపుటలవాట్లు

ఈ ప్రాంత ప్రజలు సాధారణ వంటలలో కూడా తీపిని ఇష్టపడతారు. రోజూ తినే పప్పులో బెల్లం వినియోగిస్తారు. దీనినే బెల్లం పప్పుగా వ్యవహరిస్తారు. ఈ పప్పుని, అన్నంలో వెన్నని కలుపుకు తింటారు.

మెంతులని ఉపయోగించి మెంతిపెట్టిన కూర, ఆవాలని ఉపయోగించి ఆవపెట్టిన కూర, నువ్వులని ఉపయోగించి నువ్వుగుండు కూర లని తయారు చేస్తారు. కూరగాయలు, మొక్కజొన్న గింజలని ఉల్లిపాయలతో కలిపి ఉల్లికారం చేస్తారు.

పూరి, పటోలిలు ఇక్కడి వారి అభిమాన అల్పాహారం. పండగలకి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసమున్న తర్వాత బియ్యపు పిండితో చేయబడే ఉప్పిండిని సేవిస్తారు. ఉప్పిండి లోనూ, అన్నం లోనూ ఇంగువ చారుని తింటారు. బియ్యపు పిండి, బెల్లం, మొక్కజొన్న గింజలు ఉల్లిపాయలతో బెల్లం పులుసుని చేస్తారు.

ఇక్కడి ఊరగాయ తయారీలో స్వల్ప తేడాలు ఉన్నాయి.. నువ్వుల నూనెలో ఉప్పు, ఆవపిండి, కారం కలిపిన మామిడి ముక్కలని నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఎండబెట్టి ఆ పై ఊరబెడతారు. దీని వలన బంగాళాఖాతం నుండి వచ్చే తేమ వలన ఊరగాయ చెడిపోకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ ప్రక్రియ వలన ఊరగాయ మరింత ముదురు రంగులోకి మారటమే కాకుండా ఊరగాయ రుచిలో తీపి పెరుగుతుంది.

వాతావరణం

నైఋతి రుతుపవనాల వలన వర్షపాతం 1000-1100 ఎంఎం వరకు నమోదౌతుంది. అత్యధిక ఉష్ణోగ్రత 33-36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల సెల్సియస్ నమోదౌతుంది. ఇక్కడి భూమి ఎర్ర రేగడి నేలలు కలిగి ఉంటుంది. వరి, వేరుశెనగ, చెరుకు, నువ్వులు, సజ్జలు ఎక్కువగా పండుతాయి.

వ్యవసాయాధారిత పరిశ్రమలు

చక్కెర, జౌళి, జీడిపప్పు, పాలు/పాల ఉత్పత్తులకై ఈ ప్రాంతంలో అనేక సహకార కార్మాగారాలు గలవు.

విద్యాసంస్థలు

  • ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
  • ఆంధ్ర వైద్య కళాశాల
  • బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
  • జే ఎన్ టి యు, విజయనగరం
  • గీతం (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్), విశాఖపట్నం
  • దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
  • ఇండియన్ మారిటైం యూనివర్సిటీ, విశాఖపట్నం
  • రాజీవ్ గాంధీ వైద్య కళాశాల, శ్రీకాకుళం
  • ఐఐఎం, విశాఖపట్నం

ప్రముఖులు

చలన చిత్ర రంగం

నేపథ్య గాయకులు

కథా రచయితలు

సహాయ నటులు

సంగీత దర్శకులు

హాస్య నటులు

గేయ రచయితలు

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ