ఈగ (సినిమా)

వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ఈగ. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6, 2012 న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

ఈగ
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాణం సాయి కొర్రపాటి
కథ ఎస్.ఎస్.రాజమౌళి
తారాగణం సుదీప్
నాని
సమంత
తాగుబోతు రమేశ్
సంగీతం ఎం.ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట గ్రాఫిక్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ

బిందు (సమంత) వాళ్ళ ఎదురింటిలో నివసిస్తూ ఉంటాడు నాని (నాని), అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచి నాని బిందుని ప్రేమిస్తూ ఉంటాడు. బిందు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ 511 అనే ఎన్జీవో సంస్థని నడుపుతూ అందులో తను కూడా ఒక సోషల్ వర్కర్ గా పనిచేస్తూ ఉంటుంది. బిందు కూడా నానిని ప్రేమిస్తుంది కానీ చెప్పకుండా తనే తెలుసుకోవాలని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో బిందు నడిపే ఎన్జీవో సంస్థకి సహాయం చేసే గొప్ప ధనికుని పాత్రలో పరిచయమైన సుదీప్ (సుదీప్) బిందుని ఇష్టపడతాడు.

సుదీప్ చాలా క్రూరమైన స్వభావం కలవాడు, తన అవసరానికి ఇతరులను చంపడానికి కూడా వెనుకాడడు. నాని బిందుని ప్రేమిస్తున్నాడని సుదీప్ కి తెలియగానే నానిని అతి కిరాతకంగా చంపేస్తాడు. చనిపోయిన నానినే మళ్ళీ ఈగగా పుడతాడు. అలా జన్మించిన ఈగ తనే నాని అని బిందుకి ఎలా తెలియజేసింది, తనను చంపిన సుదీప్ మీద ఎలా పగ తీర్చుకుందనేదే మిగిలిన చిత్రం.

తారాగణం

  • నానిగా నాని
  • బిందుగా సమంత
  • సుదీప్ గా సుదీప్
  • కళగా హంసా నందిని
  • బిందు వదినగా దేవదర్శిని
  • సుదీప్ స్నేహితుడిగా ఆదిత్య
  • మాంత్రికుడు తంత్రగా అభిరాం

నిర్మాణం

అభివృద్ధి

దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను 10 కోట్ల రూపాయల బడ్జెట్ లోపు తీయాలనుకున్నాడు. మకుట అనే గ్రాఫిక్స్ సంస్థను సంప్రదించి యానిమేషన్ ద్వారా ఈగను రూపొందించమన్నాడు. కానీ వారిచ్చిన అవుట్ పుట్ చూశాక అది చాలా కృత్రిమంగా అనిపించింది. ఒక దశలో ఇక సినిమా తీయలేమని ఆపేద్దామని అనుకున్నాడు. కానీ అప్పటికే గ్రాఫిక్స్ పనిమీద 8 కోట్ల రూపాయలు ఖర్చు కావడంతో ఎలాగైనా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

ఈగను సహజసిద్ధంగా రూపొందించాలని నిర్ణయించుకుని ప్రత్యేకమైన లెన్సుల ద్వారా నిజమైన ఈగలను వీడియో తీశారు. బ్రతికున్న వాటిని ఫోటోలు తీయడం కష్టమైన పని కాబట్టి వాటిని ఫ్రిజ్ లో ఉంచి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఫోటోలు తీసేవారు. ఆ ఫోటోల సాయంతో నిజమైన ఈగ యానిమేషన్ లో ప్రాణం పోసుకుంది. ఈగ మొహమంతా కళ్ళా ఉంటాయి కాబట్టి దానిలో భావోద్వేగాలు పలికించడం కష్టం. ఈగ బాడీ లాంగ్వేజి నాని లాగా ఉండాలి కాబట్టి ముందుగా నాని కళ్ళకు గంతలు కట్టి కొన్ని శరీరంతో కొన్ని భావాలు పలికించమన్నారు. వాటి ఆధారంగా ఈగ భావాలను సహజంగా రూపొందించారు.[1]

పురస్కారాలు

  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు[2][3][4][5]
సంవత్సరంఅవార్డువిభాగములబ్ధిదారుడుఫలితం
2012నంది పురస్కారాలు[6]ఉత్తమ చిత్రంసాయి కొర్రపాటిగెలుపు
2012నంది పురస్కారాలుఉత్తమ దర్శకుడుఎస్.ఎస్.రాజమౌళిగెలుపు
2012నంది పురస్కారాలుఉత్తమ స్క్రీన్ ప్లే రచయితఎస్.ఎస్.రాజమౌళిగెలుపు
2012నంది పురస్కారాలుఉత్తమ విలన్సుదీప్గెలుపు
2012నంది పురస్కారాలుఉత్తమ ఎడిటర్కోటగిరి వెంకటేశ్వరరావుగెలుపు
2012నంది పురస్కారాలుఉత్తమ ఛాయాగ్రహణంసెంథిల్ కుమార్గెలుపు
2012నంది పురస్కారాలుఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్పీట్ డ్రేపర్ (మకుట విఎఫ్ఎక్స్)గెలుపు

సైమా అవార్డులు

2012 సైమా అవార్డులు

  1. ఉత్తమ చిత్రం
  2. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (కె.కె. సెంథిల్ కుమార్)
  3. సైమా ఉత్తమ ప్రతినాయకుడు (సుదీప్)

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ