ఇళయరాజా

ప్రముఖ సంగీత దర్శకుడు

audio speaker iconఇళయరాజా  (జూన్ 2 1943లో జ్ఞానదేశికన్ అనే పేరుతో జన్మించారు. భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
ఇళయరాజా భారతదేశంలోని, చెన్నైలో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు.[1]
ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.
ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీల ద్వారా సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు ఈయన హంగరీలో ప్రఖ్యాత "బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా"ని వాడేవారు.1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి "సింఫనీ"ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే. జనాలకు ఈయన "మేస్ట్రో " అని సుపరిచితం.
2003లో న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.
భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015లో గోవాలో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా"లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు 2018లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మవిభూషణ్" పురస్కారంతో సత్కరిచింది. బిజెపి ప్రభుత్వం 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ చేసింది.

ఇళయరాజా
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంజ్ఞానదేశికన్
ఇతర పేర్లు
* మేస్ట్రో
* ఇసైజ్ఞాని
* రాసయ్య
* రాజా
జననంజూన్ 2, 1943
India పన్నైపురం , మధురై జిల్లా, తమిళనాడు
సంగీత శైలిచిత్ర సంగీతం, ప్రపంచ సంగీతం
వృత్తిసంగీత దర్శకుడు, కంపోసెర్, రచయత, గాయకుడు, వాయిధ్యకరుడు , నిర్మాత
వాయిద్యాలుపియానో, హార్మోనియం పెట్టె, గిటార్ , కీబోర్డ్, ట్రంపెట్ , సాక్సోఫోన్, ఎలక్ట్రిక్ వాయిధ్యాలు, గాత్రం (గానం)
క్రియాశీల కాలం1976– ప్రస్తుతం

బాల్యం, కుటుంబం

తమిళనాడు రాష్ట్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం, అతని 14వ ఏట బయటపడింది. ఆ వయసులో ఇళయరాజా తన సవతి అన్న (పావలార్ వరదరాజన్, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు) నిర్వహించే సంగీత బృందంతో కలసి ఉరూరా తిరిగేవాడు. అతను తన సోదరులతో కలసి దక్షిణ భారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందంలో సభ్యునిగా పర్యటించాడు. ఈ కాలంలోనే ఇళయరాజా తన సంగీత జ్ఞానాన్ని పరీక్షించుకున్నాడు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా వ్రాసిన దుఃఖముతో కూడిన పాటకు బాణీ కట్టాడు.[2]

సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) అడుగెడుతూనే, ఇళయరాజా ధనరాజ్ మాస్టర్ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాఁక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగజ్జాల యొక్క సంగీత శైలులు, ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేసాయి (ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం). ఇళయరాజ యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, లండన్ నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది. [3]

ఇళయరాజా సతీమణి జీవా. వారికి ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా), ఒక కుమార్తె (భవతారణి).ఈయన సోదరుడు గంగై అమరెన్ కూడా సంగీత దర్శకుడు. వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి

సినిమా జీవితం

చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీతజీవితాన్ని ప్రారంభించాడు. ఇంకా అప్పుడప్పుడు మద్రాసులో సంగీతం రికార్డు జరుపుకొనే పశ్చిమ బెంగాల్కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా,కీ బోర్డు కళాకారుడిగా పనిచేశాడు.[4][5][6] తరువాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా పనిచేశాడు.[7] ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను, ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారిచేత సాధన చేయిస్తూ అందులోని మెళుకువలను తెలుసుకొన్నాడు.[8] పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి (చిలుక) అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. ఈయనను పరిచయం చేసిన ఆ చిత్ర దర్శకులు ఎస్.దేవరాజ్, మొహన్ లతో వాళ్ళ చివరి సినిమా వరకు పనిచేసారు.

ప్రభావం

రికార్డింగ్ స్టూడియోలో ఇళయరాజా

దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది.[9][10] సినిమా దర్శకుడు మణిరత్నం మాటల ప్రకారం:

ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు."[11]

పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను, భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు.[12] ఇందు మూలంగా, వీరు చిత్రాలకు యెన్నో వైవిధ్యభరిత బాణీలను అందించగలిగారు. అంతే కాకుండా, వీరి బాణీలు, నేపథ్య సంగీతం భారతీయ ప్రేక్షకులలో ఎంతో ప్రసిద్ధిగాంచి, వీరి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేశాయి.[13]

సినిమాయేతర సంగీతం

"ది మ్యూజిక్ మెస్సయ్యా" 1997 లో భారతదేశం తరపున ఆస్కార్ కు ఎంపికయిన మలయాళ సినిమా "గురు" లోని నేపథ్య సంగీత సంపుటి.

ఇళయరాజా తొలి సినిమాయేతర ఆల్బంలు రెండూ భారతీయ, పాశ్చ్యాత్య సాంప్రదాయ సంగీత సమ్మేళనంగా సాగాయి. తొలి ఆల్బం "హౌ టు నేమ్ ఇట్" (1986) కర్నాటక సంగీతకారుడు త్యాగరాజుకు పాశ్చాత్య సంగీతకారుడు యోహాన్ సెబాస్టియన్ బాఁక్ లకు అంకితమిచ్చాడు.[14] రెండవ ఆల్బం "నథింగ్ బట్ విండ్" (1988), ప్రముఖ బాఁసురీ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా ఇంకా యాభై మందితో కూడిన వాద్య బృందంతో చేయబడింది. పేరు సూచించినట్లు సంగీతం, వీచేగాలిలా, గాలి తెమ్మెరలా అనేక రూపాల సమీరాల్లా ప్రాకృతమైనట్టిదనే భావనతో తయారుచేయబడింది.[15][16]


"ఇళయరాజా క్లాసిక్స్ ఆన్ మాండొలిన్" అనే పేరుతో కొన్ని కృతులను కర్నాటక సంప్రదాయంలో స్వరపరచారు. వీటిని ప్రముఖ మాండొలిన్ విద్వాంసుడు మాండొలిన్ శ్రీనివాస్ రికార్డు చేశారు.[17] ఇళయరాజా కొన్ని భక్తి సంగీత సంపుటాలను కూడా స్వరపరచారు. రమణమహర్షి స్ఫూర్తితో చేయబడిన "గురు రమణగీతం" (2004) సంపుటం ఒక ధ్యాన గీత గుచ్ఛం [18] "సింఫొనీ" సంపుటంలోని తిరువాసగం (పవిత్ర ఉచ్ఛారణ) తమిళ సంప్రదాయ కృతి కొంత భాగం స్టీఫెన్ ష్వార్ట్ చే ఆంగ్లీకరించబడి బుడాపెస్ట్ సింఫొనీ ఆర్కెస్ట్రాతో ప్రదర్శింపబడింది.[19][20] ఇటీవలి కాలంలో వెలువడ్డ ఇళయరాజా సంగీత సంపుటం ప్రపంచ సంగీత దృష్టితో చేయబడ్డ "ది మ్యూజిక్ మెసయ్యా" (2006).[21]

ప్రత్యక్ష ప్రదర్శనలు

అమెరికా సాన్ జోస్ లో ప్రదర్శన ఇచ్చినప్పటి ఫోటో
  • ఇళయరాజా అరుదుగా తన సంగీత ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారు. తన చివరి అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన, 25 సంవత్సరాల్లో మొదటి సారిగా 2005 అక్టోబరు 16 న చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో 4 గంటల పాటు ఇచ్చారు.[22]
  • 2004 ల ఇటలీ లోని (Teatro Comunale di Modena ) అనే ధియేటర్ లో 14వ అన్జేలికా, అంతర్జాతీయ సంగీత పండగలలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.[23]
  • ఇథు ఇళయరాజా అనే టీ.వీ కార్యక్రమం, ఇళయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి వివరిస్తూ ప్రసారం చేసారు.[24]
  • 28 డిసెంబరు 2011 న జవహర్ లాల్ నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో ఎన్రెంద్రుం రాజా అనే ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనను తమిళ ఛానల్ జయా టీ.వీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
  • 23 సెప్టెంబరు 2012 న, నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్,బెంగుళూరులో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
  • 2012 న ప్రకాష్ రాజ్ చిత్రం ధోని ఆడియో రిలీజ్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
  • 16 ఫెబ్రవరి, 2013, న ఉత్తర అమెరికాలో మొదటిసారిగా, కెనడా, టొరంటో లోని రోజేర్స్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు,[25] దీనిని స్టార్ విజయ్ టీవీ ఛానల్ లో ప్రసారం చేయగా, ఎస్.ఏ.వీ. ప్రొడక్షన్స్, పీ.ఏ+ సహకరంతో ప్రదర్శన నిర్వహించారు.
  • ఉత్తర అమెరికాలో ఇవే కాకుండా 23 ఫెబ్రవరి, 2013 న న్యూజెర్సీ ప్రోదెన్షిఅల్ సెంటర్ లో,, 2013 మార్చి 1 న సాన్ జోస్ లోని హెచ్.పీ పెవిలియన్ సెంటర్లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు.
  • తన ఉత్తర అమరికా ప్రదర్శనల తర్వాత, 2013 ఆగస్టు 24 న ఇళయరాజా, తన కొడుకులు, సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, ప్రముఖ నటుడు కమల్ హాసన్తో కలిసి లండన్ లోని O2 అరేనాలో సంగీత ప్రదర్శన ఇచ్చారు.[26]

ఇళయరాజా సంగీత ప్రస్థానం

గౌరవాలు , అవార్డులు

అవార్డులు, నామినేషన్ల పట్టిక
మొత్తం
Totals2427
  • 1988 లో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఇళయరాజా గారికి 'ఇసైజ్ఞాని' (సంగీత జ్ఞాని) బిరుదు ఇచ్చారు. ఇప్పటికి అభిమానులు ఆయనను ఇసైజ్ఞాని అనే పిలుస్తారు. దానితో పాటు అదే తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిస్థాత్మక కళైమామణి పురస్కారం అందుకున్నారు.[27]
  • 2010 లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరిచింది.
  • 2018 లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మవిభూషణ్" పురస్కారంతో సత్కరిచింది.[28]
  • భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో గోవాలో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా"లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు .
  • 1984 లో "సాగరసంగమం" సినిమా కు, 1986 లో "'సింధుభైరవి'" సినిమా కు, 1989 లో "రుద్రవీణ" సినిమాకు , 2010 లో కేరళ సినిమా పజ్హస్సి రాజా కు 4 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు.[29]
    1980 లలో 3 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకోవటం విశేషం.[30]
  • 2004 లో యన్.టి.ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇవి కాకుండా తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు (1994, 1995, 1998) లో అందుకున్నారు.
  • 2005 లో ఎం.ఎస్. విశ్వనాథన్ తో కలిసి స్వరపరచిన తమిళ సినిమా విశ్వ తులసి కి వరల్డ్ ఫెస్ట్ -హౌస్టన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ సంగీతం కింద గోల్డెన్ రేమి అవార్డు వచ్చింది.
  • దీనితోపాటు సంగీతంలో ఆయన కనపరచిన ప్రతిభకు మధ్యప్రదేశ్ వారు ఇచ్చే లతా మంగేష్కర్ అవార్డు ను 1998 లో అందుకున్నారు , 2010 లో ఒరిస్సా ప్రభుత్వం వారు ఇచ్చేఅక్షయ సమ్మాన్ అఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.[31]
  • జనవరి 2012 న సృజనాత్మక సంగీతానికికి చేసిన కృషి గాను సచిన్ దేవ్ బర్మన్ అంతర్జాతీయ అవార్డు అందజేశారు.
  • ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తలపతి (తెలుగులో "దళపతి") చిత్రంలోని రక్కమ్మ కైయు తట్టు (తెలుగులో "'చిలకమ్మా చిటికెయ్యంగ"') పాట బి.బి.సి. వారి 10 అత్యుత్తమ పాటల్లో ఒకటిగా ఎంపికైంది.[32]
  • టైమ్ మ్యాగజైన్ వారి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపికైన నాయకుడు (1987) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
  • 1994 లో అన్నామలై విశ్వవిద్యాలయం (డిగ్రీ అఫ్ డాక్టర్ అఫ్ లెటర్ (హోనోరిస్ కౌస)), 1996 లో మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం (డిగ్రీ అఫ్ డాక్టర్ అఫ్ లెటర్స్), ఈయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు,
  • ఏప్రిల్ 1994 లో ది వరల్డ్ యూనివర్సిటీ రౌండ్ టేబుల్, ఆరిజోనా, యూ.ఎస్.ఏ (అమెరికా) వారు ఇచ్చిన (కల్చరల్ డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ అఫ్ మ్యూజిక్ ) డాక్టరేట్ ఇచ్చారు.
  • 1994 లో నార్త్ అమెరికా తమిళ సంఘం వారు ఇచ్చిన గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
  • అమరికా న్యూజెర్సీ లోని టీనెక్ టౌన్ షిప్ మేయర్ జోహన్ అబ్రహం గౌరవ పౌరసత్వం కింద టౌన్ షిప్ తాళాలు అందజేసారు.
  • నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ సంగీత దర్శకుడు (ఎటో వెళ్ళిపోయింది మనసు)[33][34][35][36]
  • ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఆంగ్ల చిత్రం ఏ బ్యూటిఫుల్‌ బ్రేక్‌ అప్‌కి బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విభాగంలో ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు 2022లో అందించింది.[37]

మూలాలు

మరికొంత సమాచారం

బయట లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
సాధారణ సంప్రదింపులు

Discographies


🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ