ఇల్లినాయిస్

ఇల్లినాయిస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికాలో చేరిన 21వ రాష్ట్రం. ఇల్లినాయిస్ అమెరికాలో అయిదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇల్లినాయిస్ నది మీదుగా మిస్సిస్సిప్పి నదిని మహా సరస్సులతో కలిపే కీలకమయిన ప్రాంతంలో ఉన్న కారణాన ఈ రాష్ట్రం రవాణా వ్యవస్థకు నెలవైంది.

అమెరికా విప్లవ సమయానికి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 మంది స్థానిక ఆదివాసీలు కొద్దిమంది ఫ్రెంచి గ్రామస్థులు నివాసముండేవారు. అమెరికా వాసులు కెంటకీ నుండి 1810లో వలస రానారంభించారు. అటు మీదట యాంకీలు వచ్చారు. భవిష్యత్తులో చికాగోగా పిలువబడే నగరాన్ని స్థాపించింది వారే. 1850 లలో ఏర్పడిన రైలు రవాణా వ్యవస్థ అత్యంత లాభదాయకమైన వ్యాపారానికి దారి తీసింది. ఇది జెర్మనీ, స్వీడన్ వాసులను ఆకర్షించింది. 1900 కల్లా అనేక కర్మాగారాలు ఇక్కడ స్థాపించబడ్డాయి. దక్షిణ, మధ్య ప్రాంతాలలో అనేకమైన బొగ్గు గనులు కూడా బయటపడ్డాయి. ఈ పారిశ్రామికీకరణ తూర్పు దక్షిణ ఐరోపా దేశాలనుండి అనేకమందిని వలస రావడానికి ప్రేరేపించింది. అమెరికా అంతర్యుద్ధంలో ఈ రాష్ట్రం తమ రాష్ట్రానికే చెందిన అబ్రహాం లింకన్, యులిసిస్ గ్రాంట్లకు మద్దతు ఇచ్చింది. ప్రపంచ యుద్ధాలలో ఇక్కడి ఆయుధ కర్మాగారాలు అమెరికాకు ముఖ్య ఆయుధ ఉత్పత్తిదారులుగా నిలిచాయి. యూరోపియన్ వలసదారులతో పాటు దక్షిణాది నుండి పారిపోయి చికాగో వచ్చిన నల్లజాతివారి సంస్కృతుల మేళవింపువలన ప్రపంచ ప్రసిద్ధమయిన జాజ్ సంగీత సంస్కృతి ఆవిర్భవించింది.

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ