ఇందుపల్లి గోవిందరావు

ఇందుపల్లి గోవిందరావు (ఆగస్టు 12, 1897 - సెప్టెంబరు 8, 1969) రంగస్థల నటుడు, స్త్రీ పాత్రధారి. రంగభూషణం బిరుదాంకితుడు.[1]

ఇందుపల్లి గోవిందరావు
జననంఆగస్టు 12, 1897
మరణంసెప్టెంబరు 8, 1969
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, స్త్రీ పాత్రధారి
తల్లిదండ్రులుకృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ

జననం

గోవిందరావు 1897, ఆగస్టు 12న కృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించాడు.

నాటకరంగ ప్రస్థానం

చిన్నతనంలోనే నటన, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించుకున్న గోవిందరావు, తారాశశాంకంలో రెండవ చంద్రుడు పాత్ర ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టాడు. అప్పటినుండి అనేక నాటకాల్లో నటించి, పేరు, డబ్బు సంపాదించాడు. కొంతకాలం నే జీతం మీద బందరు రాయల్ థియేటర్, రామమోహన్ థియేటర్లలో స్త్రీ, పురుష పాత్రలను పోషించేవాడు. పింగళి లక్ష్మీకాంతం, బుర్రా రాఘవాచారి, మాదిరెడ్డి సుబ్బారావు, పింగళి వీరయ్య, పింగళి నర్సయ్య, కలపటపు రాజేశ్వరరావు, శ్రవణం తాతయ్య, పెదసింగు రంగయ్య, ఆమాను సుబ్బారావు వంటి ప్రముఖ నటులతో కలిసి వందలాది నాటకాలను అద్భుతంగా ప్రదర్శించాడు. 1920-21లలో విజయవాడలో జరిగిన చింతామణి నాటక పోటీలలో రాధ పాత్రకు సువర్ణ పతకం గెల్చుకోవడంతోపాటు, చిత్రరేఖ, సత్యభామ, చంద్రమతి పాత్రలకు సువర్ణ పతకాలు గెల్చుకున్నాడు. అంతేకాకుండా, గోవిందరావు ధరించిన నటనకు ముగ్దులై ప్రేక్షకులంతా రంగస్థలం మీదకు పతకాలు విసిరేసేవారు.

నటించిన పాత్రలు

మరణం

చివరిదశలో పేదరికాన్ని అనుభవించిన గోవిందరావు 1969, సెప్టెంబరు 8న మరణించాడు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ