ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు

ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్, వేల్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 1997 నుండి దీన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) పాలిస్తోంది. అంతకు మునుపు,1903 నుండి మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) పాలనలో ఉండేది. వ్యవస్థాపక దేశంగా ఇంగ్లాండుకు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో (ICC) టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి20) హోదాలతో పూర్తి సభ్యత్వం ఉంది. 1990 ల వరకు, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలు ICC లో సభ్యులు కానందున ఆ దేశాల ఆటగాళ్ళు కూడా ఇంగ్లండ్ తరపున ఆడేవారు.

ఇంగ్లండ్
దస్త్రం:England cricket team logo.svg
అసోసియేషన్ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు
వ్యక్తిగత సమాచారం
టెస్టు కెప్టెన్బెన్ స్టోక్స్
ఒన్ డే కెప్టెన్జోస్ బట్లర్
Tట్వంటీ I కెప్టెన్జోస్ బట్లర్
కోచ్టెస్ట్ - బ్రెండన్ మెక్‌కలమ్
ODI - మాథ్యూ మోట్
T20I - మాథ్యూ మోట్
చరిత్ర
టెస్టు హోదా పొందినది1877
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాపూర్తి సభ్యత్వం (1909)
ICC ప్రాంతంయూరోప్
ఐసిసి ర్యాంకులుప్రస్తుత[1]అత్యుత్తమ
టెస్టులు3వ1వ (1 జూన్ 1955)
వన్‌డే6వ1వ (1 జనవరి 1981)
టి20ఐ2వ1వ (24 అక్టోబర్ 2011)
టెస్టులు
మొదటి టెస్టుv.  ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ వద్ద ; 15–19 మార్చి 1877
చివరి టెస్టుv.  ఆస్ట్రేలియా ది ఓవల్, లండన్ వద్ద; 27–31 జూలై 2023
టెస్టులుఆడినవిగెలిచినవి/ఓడినవి
మొత్తం[2]1,066391/320
(355 డ్రాలు)
ఈ ఏడు[3]84/3
(1 డ్రా)
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పోటీ2 (first in 2019–2021)
అత్యుత్తమ ఫలితంనాల్గవ స్థానం (2019–2021 & 2021-2023)
వన్‌డేలు
తొలి వన్‌డేv.  ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్వద్ద; 5 జనవరి 1971
చివరి వన్‌డేv.  పాకిస్తాన్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా వద్ద; 11 నవంబర్ 2023
వన్‌డేలుఆడినవిగెలిచినవి/ఓడినవి
మొత్తం[4]794399/355
(9 టైలు, 31 ఫలితం తేలలేదు )
ఈ ఏడు[5]2110/10
(0 టైలు, 1 ఫలితం తేలలేదు )
పాల్గొన్న ప్రపంచ కప్‌లు13 (first in 1975)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2019)
ట్వంటీ20లు
తొలి టి20ఐv.  ఆస్ట్రేలియా ఏజియాస్ బౌల్, సౌతాంప్టన్ వద్ద; 13 జూన్ 2005
చివరి టి20ఐv.  న్యూజీలాండ్ ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ వద్ద; 5 సెప్టెంబర్ 2023
టి20ఐలుఆడినవిగెలిచినవి/ఓడినవి
మొత్తం[6]17792/77
(2 టైలు, 6 ఫలితం తేలలేదు )
ఈ ఏడు[7]72/5
(0 టైలు, 0 ఫలితం తేలలేదు )
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ8 (first in 2007)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2010, 2022)

Test kit

ODI kit

T20I kit

As of 11 November 2023

ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచపు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన జట్లు (1877 మార్చి 15-19). దక్షిణాఫ్రికాతో కలిసి, ఈ రెండు దేశాలు 1909 జూన్ 15 న ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌ను (నేటి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్వజ సంస్థ) ఏర్పాటు చేశాయి. 1971 జనవరి 5 న మొదటి వన్‌డే ఆడింది కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలే. ఇంగ్లాండ్ తన మొదటి టి2005 ని 20 జూన్ 13 న ఆస్ట్రేలియాతో ఆడింది.

టోర్నమెంట్ల చరిత్ర

ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుని ఓ జట్టు ఆడిన మొదటి ఆట 1739 జూలై 9 న జరిగింది. కెంట్ మినహాయించి ఇంగ్లండ్‌లోని మిగతా ప్రాంతానికి చెందిన 11 మంది పెద్దమనుషులతో కూడిన "ఆల్-ఇంగ్లండ్" జట్టు కెంట్‌లోని "ది అన్‌కాంకరబుల్ కౌంటీ"తో ఆడి, చాలా కొద్ది తేడాతో ఓడిపోయింది. [8] ఇటువంటి మ్యాచ్‌లు ఓ శతాబ్దం పైగానే అనేక సందర్భాల్లో జరిగాయి.

1846లో విలియం క్లార్క్ ఆల్-ఇంగ్లండ్ ఎలెవెన్‌ని స్థాపించాడు. ఈ జట్టు చివరికి 1847, 1856 మధ్య జరిగే వార్షిక మ్యాచ్‌లలో యునైటెడ్ ఆల్-ఇంగ్లాండ్ ఎలెవెన్‌తో పోటీ పడింది. ఆటగాళ్ల నాణ్యత ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లు ఇంగ్లీష్ సీజన్‌లో అత్యంత ముఖ్యమైన పోటీలని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ప్రారంభ పర్యటనలు

ఉత్తర అమెరికాకు వెళ్ళిన 1859 నాటి ఇంగ్లీష్ జట్టు.

1859 సెప్టెంబరులో ఇంగ్లాండ్, ఉత్తర అమెరికాలో చేసిన పర్యటన మొట్టమొదటి విదేశీ పర్యటన. ఈ జట్టులో ఆల్-ఇంగ్లండ్ ఎలెవన్ నుండి ఆరుగురు ఆటగాళ్లు, యునైటెడ్ ఆల్-ఇంగ్లండ్ ఎలెవెన్ నుండి ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. జార్జ్ పార్ దానికి కెప్టెన్‌.

అమెరికాలో అంతర్యుద్ధం మొదలవడంతో, క్రికెట్ దృష్టి మరోవైపు మళ్లింది. మెల్‌బోర్న్ లోని రెస్టారెంట్లైన మెస్సర్స్ స్పియర్స్ అండ్ పాండ్, వాణిజ్యపరమైన కార్యక్రమంగా నిర్వహించిన సీరీస్‌లో ఇంగ్లాండు ఆటగాళ్ళు 1861-62లో ఆస్ట్రేలియాలో పర్యటించారు. 1877కి ముందు పర్యటనల సమయంలో ఆడిన చాలా మ్యాచ్‌లలో జట్లు "సమ ఉజ్జీలుగా" ఉండేవి కావు. ప్రత్యర్థి జట్టు 11 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను ఫీల్డింగ్ చేయించి పోటీని సమం చేసేవారు.[9] ఈ మొదటి ఆస్ట్రేలియా పర్యటనలో 11 మందికి గాను 18 మంది వరకు ఆడేవాళ్ళు.

1861-62లో దక్షిణ ఆస్ట్రేలియాలో పర్యటించిన మొదటి ఇంగ్లాండ్ జట్టు

ఆ పర్యటన ఎంతలా విజయవంతమైందంటే, మళ్ళీ 1863-64లో పార్ నాయకత్వంలో రెండవ పర్యటన జరిగింది. జేమ్స్ లిల్లీవైట్ నాయకత్వంలో తదుపరి ఇంగ్లాండ్ జట్టు 1876 సెప్టెంబరు 21 న P&O స్టీమ్‌షిప్ పూనాలో ఆస్ట్రేలియా వెళ్ళింది. వారు సంయుక్త ఆస్ట్రేలియా XIతో ఆడారు. ఈసారి ఇరుజట్లూ 11 మంది ఆటగాళ్ళతో ఆడాయి. 1877 మార్చి 15న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను తొట్టతొలి టెస్ట్ మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ బ్యానర్‌మాన్ చేసిన తొలి టెస్టు సెంచరీతో ఈ టెస్టు మ్యాచ్‌లో సంయుక్త ఆస్ట్రేలియా XI 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ సమయంలో, మ్యాచ్ జేమ్స్ లిల్లీవైట్స్ XI v కంబైన్డ్ విక్టోరియా అండ్ న్యూ సౌత్ వేల్స్‌గా ప్రచారం పొందింది. [9] ఆ జట్లే 1877 ఈస్టర్‌ లోని అదే మైదానంలో మళ్ళీ మ్యాచ్ ఆడాయి. ఈసారి లిల్లీవైట్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచి తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ గడ్డపై 1880లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచింది; ఇంగ్లాండ్‌కు పూర్తిగా ప్రాతినిధ్యం వహించిన తొలి జట్టు ఇది. ఈ జట్టు లోనే WG గ్రేస్‌ తొలి ఆట ఆడాడు. [10]

1880లు

ది స్పోర్టింగ్ టైమ్స్ వార్తాపత్రికలో ప్రచురించిన "మరణ వార్త". యాషెస్ అనే మాటను తొలుత వాడినది ఇక్కడే

1882లో ఇంగ్లండ్, తన మొదటి స్వదేశీ సిరీస్‌ను 1-0తో కోల్పోయింది. ది స్పోర్టింగ్ టైమ్స్ పత్రిక ఇంగ్లీష్ క్రికెట్‌ మరణించిందంటూ సంస్మరణను ముద్రించింది:

In Affectionate Remembrance

OF
ENGLISH CRICKET,
WHICH DIED AT THE OVAL
ON
29th AUGUST, 1882,
Deeply lamented by a large circle of sorrowing
friends and acquaintances.
R. I. P.

N.B.—The body will be cremated and the
ashes taken to Australia.[11]

ఈ ఓటమి ఫలితంగా, 1882-83 పర్యటనను ఇంగ్లండ్ కెప్టెన్ ఐవో బ్లైగ్ "చితా భస్మాన్ని (యాషెస్) తిరిగి పొందాలనే తృష్ణ"గా పేర్కొన్నాడు. ఔత్సాహికులు, నిపుణుల మిశ్రమంతో కూడిన ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది.[12] బ్లైగ్‌కు కొంత బూడిద ఉన్న ఒక పాత్రను అందించారు. ఆ బూడిద బెయిలుదని, బంతిదనీ, ఓ స్త్రీ ముసుగు దనీ చెప్పుకున్నారు. ఆ విధంగా యాషెస్ పుట్టింది. ఆ తర్వాత జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ను యాషెస్ సిరీస్‌లో భాగంగా పరిగణించలేదు.[13][14] 1884, 1898 మధ్య ఇంగ్లండ్ 10 సార్లు యాషెస్ సిరీస్‌ను గెలుచుకోవడంతో ఈ ప్రారంభ పోటీలలో చాలా వరకు ఇంగ్లాండే ఆధిపత్యం చెలాయించింది.[15] ఈ సమయంలో ఇంగ్లాండ్ 1889 లో పోర్ట్ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికాతో కూడా తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది..[16]

1890లు

1890 యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-0తో గెలుచుకుంది, సిరీస్‌లోని మూడవ మ్యాచ్ రద్దైంది. చరిత్రలో రద్దైన మొట్ట మొదటి టెస్ట్ మ్యాచ్ అది. 1891-92 సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఓడిపోయింది. అయితే ఆ తర్వాతి సంవత్సరం ఇంగ్లండ్ తిరిగి యాషెస్‌ను సాధించింది. ఇంగ్లండ్ మళ్లీ 1894-95 సిరీస్‌ను ఆండ్రూ స్టోడార్ట్ నాయకత్వంలో 3-2తో గెలిచింది. 1895-96లో, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాతో ఆడి, సిరీస్‌లోని అన్ని టెస్టులను గెలుచుకుంది. 1899 యాషెస్ సిరీస్‌లో జట్టు సభ్యులను MCC, కౌంటీలు కలిసి ఒక ఎంపిక కమిటీని నియమించిన మొదటి పర్యటన. ముగ్గురు క్రియాశీల ఆటగాళ్ళు ఉన్నారు: గ్రేస్, లార్డ్ హాక్, వార్విక్‌షైర్ కెప్టెన్ హెర్బర్ట్ బైన్‌బ్రిడ్జ్. దీనికి ముందు, స్వదేశంలో జరిగే టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్లను మ్యాచ్ ఎవరి మైదానంలో ఆడాలో క్లబ్ ఎంపిక చేసింది. ఇంగ్లండ్ 1899 యాషెస్ సిరీస్‌ను 1-0తో కోల్పోయింది, సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో గ్రేస్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో కనిపించాడు.

పాలక సంస్థ

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అనేది ఇంగ్లండులో క్రికెట్‌కు, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకూ పాలకమండలి. బోర్డు 1997 జనవరి 1 నుండి పనిచేస్తోంది. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రధానంగా ఇంగ్లండ్ జట్టుకు సంబంధించి టిక్కెట్ల విక్రయం, స్పాన్సర్‌షిప్, ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా ECB బాధ్యత వహిస్తుంది. 2006 క్యాలెండర్ సంవత్సరంలో ECB ఆదాయం £7.7 కోట్లు. [17]

1997కి ముందు, టెస్ట్ అండ్ కౌంటీ క్రికెట్ బోర్డు (TCCB) ఇంగ్లీష్ జట్టుకు పాలకమండలిగా ఉండేది. టెస్ట్ మ్యాచ్‌ల లోనే కాకుండా, 1976-77 ఆస్ట్రేలియా పర్యటన వరకు విదేశాల్లో పర్యటించినప్పుడు ఇంగ్లాండ్ జట్టు, అధికారికంగా MCC పేరుతో ఆడింది. ఇది పర్యటన జట్టును ఎంపిక చేయడంలో MCC బాధ్యత వహించిన కాలానికి ఇది అవశేషం. ఇంగ్లాండ్ పర్యటన బృందం MCC గుర్తులను చివరిసారిగా 1996-97 న్యూజిలాండ్ పర్యటనలో ధరించింది.

వేల్స్ స్థితి

చారిత్రికంగా, ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో యావత్తు గ్రేట్ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది, స్కాటిష్ లేదా వెల్ష్ జాతీయ జట్లు అప్పుడప్పుడు ఆడుతూండేవి. ఈ రెండు దేశాల ఆటగాళ్లు అప్పుడప్పుడు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించేవారు కూడా. 1994లో స్కాట్లాండ్ ICCలో స్వతంత్ర సభ్యునిగా చేరింది. అంతకు రెండేళ్ల ముందే దానికి TCCBతో సంబంధాలు తెగిపోయాయి. [18] [19] [20] [21]

సైమన్, గెరైంట్ జోన్స్ వంటి వెల్ష్ ఆటగాళ్లను ఓవైపున [21] [20] ఉపయోగించుకుంటూనే జట్టు పేరులో మాత్రం "ఇంగ్లాండ్" ఒక్కటే ఉంచడంపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వచ్చాయి. వెల్ష్ ఆటగాళ్ళు ఇంగ్లండ్ జట్టు తోనే అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నందున వేల్స్, ICCలో స్వతంత్ర సభ్యురాలిగా మారాలని లేదా వెల్ష్ జాతీయ జట్టుకు మరిన్ని మ్యాచ్‌లను ఇవ్వాలనీ అనేక పిలుపులు వచ్చాయి. [22] అయితే, క్రికెట్ వేల్స్, గ్లామోర్గాన్ కౌంటీ క్రికెట్ క్లబ్ లు రెండూ ECBకి నిరంతరం మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఇంగ్లీష్ వ్యవస్థలో భాగంగా ఉంటే వెల్ష్ కౌంటీకి కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి గ్లామోర్గాన్ వాదించగా, "ECBలో ప్రధాన పాత్రను కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని క్రికెట్ వేల్స్ చెప్పింది." [23] [24] [25]

వేల్స్‌కు స్వంత క్రికెట్ జట్టు లేకపోవడం పట్ల వెల్ష్ సెనెడ్‌లో కూడా అనేక చర్చలు జరిగాయి. 2013 లో జరిగిన ఒక చర్చలో కన్జర్వేటివ్, లేబర్ సభ్యులు ఇద్దరూ స్వతంత్ర వెల్ష్ జట్టు స్థాపనకు మద్దతు పలికారు.[26]

2015లో, వెల్ష్ నేషనల్ అసెంబ్లీ లోని పిటిషన్ల కమిటీ రూపొందించిన నివేదిక, ఈ సమస్యపై జరుగుతున్న ఉద్వేగభరితమైన చర్చను ప్రతిబింబిస్తుంది. హెరిటేజ్, కల్చర్, స్పోర్ట్, బ్రాడ్‌కాస్టింగ్‌పై ప్లాయిడ్ సైమ్రు ప్రతినిధి, పిటిషన్‌ల కమిటీ సభ్యుడూ అయిన బేతన్ జెంకిన్స్, వేల్స్‌కు స్వంతంగా అంతర్జాతీయ జట్టు ఉండాలని, ECB నుండి వైదొలగాలనీ వాదించాడు. 64 లక్షల జనాభా 6,000 మంది క్లబ్ ప్లేయర్‌లు ఉన్న ఉన్న ఐర్లాండుకు ICC సభ్యత్వం ఉండగా, 30 లక్షల జనాభా, 7,500 మంది ఆటగాళ్ళూ ఉన్న వేల్స్‌కు లేదని జెంకిన్స్ అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: "క్రికెట్ వేల్స్, గ్లామోర్గాన్ CCC లు వెల్ష్ జాతీయ క్రికెట్ జట్టు అనే ఆలోచన 'ఉద్వేగభరితమైన అంశం' అని చెపుతున్నాయి. ఔను మరి, జాతీయ జట్టును కలిగి ఉండటం భావావేశపూరితమైనదే, జాతీయ జట్టు ఆడే సమయంలో స్టాండ్‌లను చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. ఇది సహజం కాదన్నట్లుగా చేసే ఏ వాదనైనా తప్పుదారి పట్టించే వాదన అవుతుంది." [27] [28] [29] [30] [31] [32]

2017లో, వేల్స్ మొదటి మంత్రి కార్విన్ జోన్స్, వేల్స్ తన వన్డే జట్టును తిరిగి ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చాడు: "ఓ పక్కన ఐర్లాండ్, స్కాట్‌లాండ్ లు అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో ఆడుతోంటే వేల్స్‌ ఆడకపోవడం వింతగా ఉంది." అని అతను అన్నాడు. [33] [34]

క్రికెట్ మైదానాలు

బ్రిస్టల్
టాంటన్
ఎడ్జ్‌బాస్టన్
హెడింగ్లీ
ది ఓవల్
ఓల్డ్ ట్రాఫోర్డ్
రివర్‌సైడ్
సోఫియా గార్డెన్స్
రోస్ బౌల్
ట్రెంట్ బ్రిడ్జ్
ఇంగ్లాండ్, వేల్స్ లలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు
వేదికనగరంకౌంటీ జట్టుసామర్థ్యంఆడిన సంవత్సరాలుటి20
ప్రస్తుత వేదికలు
ది ఓవల్లండన్సర్రే26,0001880–1027416
ఓల్డ్ ట్రాఫోర్డుమాంచెస్టర్లాంక్షైర్26,0001884–825510
లార్డ్స్లండన్మిడిల్‌సెక్స్28,0001884–1406710
ట్రెంట్ బ్రిడ్జ్నాటింగ్‌హామ్నాటింగ్‌హామ్‌షైర్17,5001899–634912
హెడ్డింగ్లీలీడ్స్యార్క్‌షైర్17,5001899–78451
ఎడ్జ్‌బాస్టన్బర్మింగ్‌హామ్వార్విక్షైర్25,0001902–53645
రివర్‌సైడ్ గ్రౌండ్చెస్టర్-లీ-స్ట్రీట్డర్హం19,0001999–6203
సోఫియా గార్డెన్స్కార్డిఫ్గ్లామోర్గాన్15,5001999–3298
రోజ్ బౌల్సౌతాంప్టన్హాంప్‌షైర్25,0002003–7319
కౌంటీ గ్రౌండ్టౌంటన్సోమర్సెట్12,5001983–61
కౌంటీ గ్రౌండ్బ్రిస్టల్గ్లౌసెస్టర్‌షైర్17,5001983–193
పూర్వ వేదికలు
బ్రామల్ లేన్షెఫీల్డ్యార్క్‌షైర్32,00019021
సెయింట్ హెలెన్స్స్వాన్సీగ్లామోర్గాన్4,5001973–19832
నార్త్ మెరైన్ రోడ్ గ్రౌండ్స్కార్‌బరోయార్క్‌షైర్11,5001976–19782
గ్రేస్ రోడ్లీసెస్టర్లీసెస్టర్‌షైర్12,0001983–19993
న్యూ రోడ్వోర్సెస్టర్వోర్సెస్టర్‌షైర్5,5001983–19993
కౌంటీ గ్రౌండ్సౌతాంప్టన్హాంప్‌షైర్7,0001983–19993
కౌంటీ గ్రౌండ్డెర్బీడెర్బీషైర్9,5001983–19992
నెవిల్ గ్రౌండ్టన్‌బ్రిడ్జ్ వెల్స్కెంట్6,00019831
కౌంటీ గ్రౌండ్చెమ్స్‌ఫోర్డ్ఎసెక్స్6,5001983–19993
సెయింట్ లారెన్స్ గ్రౌండ్కాంటర్బరీకెంట్15,0001999–20054
కౌంటీ గ్రౌండ్నార్తాంప్టన్నార్తాంప్టన్‌షైర్6,50019992
2021 జూలై 18 నాటికి[35]

టోర్నమెంట్ చరిత్ర

సూచిక
ఛాంపియన్స్
రన్నర్స్-అప్
మూడో స్థానం
నాల్గవ స్థానం

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రికార్డు
సంవత్సరంలీగ్ వేదికఫైనల్ హోస్ట్చివరితుది స్థానం
Posమ్యాచ్‌లుDedPCPtsPCT
PWLDT
2019–21 [36]4/92111730072044261.4రోజ్ బౌల్, ఇంగ్లాండ్DNQ4వ
2021–23 [37]4/922108401226412447ది ఓవల్, ఇంగ్లాండ్DNQ4వ

క్రికెట్ ప్రపంచ కప్

ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ రికార్డు
సంవత్సరంరౌండుస్థానంగ్రూగెటైఫ.తేWin %
1975సెమీ ఫైనల్3/84310075.00
1979రన్నర్స్-అప్2/85410080.00
1983సెమీ ఫైనల్3/87520071.43
1987రన్నర్స్-అప్2/88530062.50
19922/910630166.67
1996క్వార్టర్ ఫైనల్8/126240033.33
1999పూల్ దశ5320060.00
2003పూల్ దశ9/146330050.00
2007సూపర్ 85/169540055.55
2011క్వార్టర్ ఫైనల్7/147331050.00
2015పూల్ దశ10/146240033.33
2019Champions1/1011830068.18
2023Qualified
Total1 title12/128449331158.33
*విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు
సంవత్సరంరౌండుస్థానంగ్రూగెటైఫ.తేగెలుపు %
2007సూపర్ 87/125140020.00
20096/125230040.00
2010ఛాంపియన్స్1/127510183.33
2012సూపర్ 86/125230040.00
2014సూపర్ 107/164130025.00
2016రన్నర్స్-అప్2/166420066.67
2021సెమీ ఫైనల్4/166420066.67
2022ఛాంపియన్స్1/167510183.33
2024అర్హత సాధించారు
మొత్తం2 శీర్షికలు8/84525190255.55
*విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.

ICC ఛాంపియన్స్ ట్రోఫీ

ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డు
సంవత్సరంరౌండుస్థానంగ్రూగెటైఫ.తేగెలుపు %
1998క్వార్టర్-ఫైనల్5/9101000.00
20007/11101000.00
2002పూల్ దశ6/122110050.00
2004రన్నర్స్-అప్2/124310075.00
2006పూల్ దశ7/103120033.33
2009సెమీ ఫైనల్4/84220050.00
2013రన్నర్స్-అప్2/85320060.00
2017సెమీ ఫైనల్3/84310075.00
2025
మొత్తం0 టైటిళ్ళు8/82413110054.17
*విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.

గుర్తింపులు

  • ప్రపంచ కప్ :
    • ఛాంపియన్స్ (1): 2019
    • రన్నర్స్-అప్ (3): 1979, 1987, 1992
  • టి20 ప్రపంచ కప్ :
    • ఛాంపియన్స్ (2): 2010, 2022
    • రన్నరప్ (1): 2016
  • ఛాంపియన్స్ ట్రోఫీ :
    • రన్నర్స్-అప్ (2): 2004, 2013

రికార్డులు

టెస్ట్ మ్యాచ్‌లు

టెస్టు జట్టు రికార్డులు

  • అత్యధిక జట్టు స్కోరు: 903–7 డిసెంబరు., 1938లో ఓవల్‌లో ఆస్ట్రేలియాతో
  • అత్యల్ప జట్టు స్కోరు: 45, 1886/87లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో
  • టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో 100 విజయాలు సాధించిన ఏకైక జట్టు ఇంగ్లండ్.

టెస్టులలో వ్యక్తిగత రికార్డులు

టెస్టులలో బ్యాటింగ్ రికార్డులు

టెస్ట్ బౌలింగ్ రికార్డులు

  • అత్యధిక వికెట్లు: 685 - జేమ్స్ ఆండర్సన్
  • అత్యుత్తమ సగటు: 10.75 - జార్జ్ లోమాన్
  • అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్: 10/53 - జిమ్ లేకర్, 1956లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో
  • బెస్ట్ మ్యాచ్ బౌలింగ్: 19/90 - జిమ్ లేకర్, 1956లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో
  • అత్యుత్తమ స్ట్రైక్ రేట్ : 34.1 - జార్జ్ లోమాన్
  • అత్యుత్తమ ఎకానమీ రేటు: 1.31 - విలియం అట్టేవెల్
  • ఐదుగురు ఇంగ్లండ్ బౌలర్లు ఒక ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టారు, వీటిలో మూడు హెడింగ్లీలో ఉన్నాయి. వారు
    • మారిస్ అల్లోమ్, 1929-30లో క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో,
    • కెన్నెత్ క్రాన్స్టన్, 1947లో దక్షిణాఫ్రికాతో హెడ్డింగ్లీలో,
    • ఫ్రెడ్ టిట్మస్, 1965లో హెడ్డింగ్లీలో న్యూజిలాండ్‌తో,
    • క్రిస్ ఓల్డ్, 1978లో ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్థాన్‌తో,
    • ఆండీ కాడిక్, 2000లో హెడ్డింగ్లీలో వెస్టిండీస్‌తో

టెస్ట్ ఫీల్డింగ్ రికార్డులు

  • ఔట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 175 - అలస్టర్ కుక్
  • వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 269 - అలాన్ నాట్
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక అవుట్‌లు: 7 - బాబ్ టేలర్, 1979/80లో బొంబాయిలో భారతదేశంతో
  • ఒక మ్యాచ్‌లో అత్యధిక అవుట్‌లు: 11 - జాక్ రస్సెల్, 1995/96లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో

వివిధ దేశాలతో ఆడిన టెస్టుల రికార్డు

ప్రత్యర్థిమ్యాగెటైడ్రాగెలుపు %తొలి గెలుపు
 ఆస్ట్రేలియా36011115209730.831877 ఏప్రిల్ 4
 దక్షిణాఫ్రికా156663505542.311889 మార్చి 13
 వెస్ట్ ఇండీస్163515905331.291928 జూన్ 26
 న్యూజీలాండ్112521304646.431930 జనవరి 13
 భారతదేశం131503105038.161932 జూన్ 28
 పాకిస్తాన్89292103932.581954 జూలై 5
 శ్రీలంక3617801147.221982 ఫిబ్రవరి 21
 జింబాబ్వే6300350.002000 మే 21
 ఐర్లాండ్22000100.002019 జూలై 26
 బంగ్లాదేశ్10910090.002003 అక్టోబరు 25
 ఆఫ్ఘనిస్తాన్ఇంకా ఆడాలి
రికార్డ్‌లు టెస్ట్ #2512 వరకు. చివరిగా నవీకరించబడింది: 2023 జూలై 23. [42]

వన్ డే ఇంటర్నేషనల్స్

వన్డే జట్టు రికార్డులు

  • అత్యధిక జట్టు స్కోరు: 498/4 (50 ఓవర్లు), 2022లో VRA క్రికెట్ గ్రౌండ్‌లో నెదర్లాండ్స్‌తో
  • అత్యల్ప జట్టు స్కోరు: 86 (32.4 ఓవర్లు), 2001లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద ఆస్ట్రేలియాతో

వన్డే వ్యక్తిగత రికార్డులు

  • అత్యధిక మ్యాచ్‌లు: 225 - ఇయాన్ మోర్గాన్
  • సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన: 126 మ్యాచ్‌లు – ఇయాన్ మోర్గాన్ [43]

వన్డే బ్యాటింగ్ రికార్డులు

  • అత్యధిక పరుగులు: 6,957 - ఇయాన్ మోర్గాన్
  • అత్యుత్తమ సగటు: 51.25 - జోనాథన్ ట్రాట్
  • అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 117.97 - జోస్ బట్లర్
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 180 - జాసన్ రాయ్, 2018లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో
  • రికార్డ్ భాగస్వామ్యం: 256* - అలెక్స్ హేల్స్, జాసన్ రాయ్, 2016లో ఎడ్జ్‌బాస్టన్‌లో శ్రీలంకతో
  • అత్యధిక శతాబ్దాలు: 16 - జో రూట్
  • అత్యధిక డకౌట్లు: 15 - ఇయాన్ మోర్గాన్

వన్డే బౌలింగ్ రికార్డులు

  • అత్యధిక వికెట్లు: 269 - జేమ్స్ ఆండర్సన్
  • అత్యుత్తమ సగటు: 19.45 - మైక్ హెండ్రిక్
  • అత్యుత్తమ బౌలింగ్: 6/31 – పాల్ కాలింగ్‌వుడ్, 2005లో ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద బంగ్లాదేశ్‌తో
  • అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 30.6 - లియామ్ ప్లంకెట్
  • అత్యుత్తమ ఎకానమీ రేటు: 3.27 - మైక్ హెండ్రిక్

వన్డే ఫీల్డింగ్ రికార్డులు

  • ఔట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 108 - పాల్ కాలింగ్‌వుడ్
  • వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 238 - జోస్ బట్లర్
  • ఒక మ్యాచ్‌లో అత్యధిక అవుట్‌లు: 6 - అలెక్ స్టీవర్ట్, 2000లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వద్ద జింబాబ్వే ; మాట్ ప్రియర్, 2008లో ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద దక్షిణాఫ్రికా ; జోస్ బట్లర్, 2013లో ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో

వివిధ దేశాలతో ఆడిన వన్డేల రికార్డు

ప్రత్యర్థిమ్యాగెటైఫ.తేగెలుపు %తొలి గెలుపు
v. Test nations
 ఆఫ్ఘనిస్తాన్22000100.002015 మార్చి 13
 ఆస్ట్రేలియా15563872340.641972 ఆగస్టు 24
 బంగ్లాదేశ్241950079.172000 అక్టోబరు 5
 భారతదేశం10644572343.681974 జూలై 13
 ఐర్లాండ్131020183.332006 జూన్ 13
 న్యూజీలాండ్9141433448.831973 జూలై 18
 పాకిస్తాన్9156320363.631977 డిసెంబరు 23
 దక్షిణాఫ్రికా6930331547.651992 మార్చి 12
 శ్రీలంక7838361350.671982 ఫిబ్రవరి 13
 వెస్ట్ ఇండీస్10252440654.161973 సెప్టెంబరు 5
 జింబాబ్వే302180172.411995 జనవరి 7
v. అసోసియేట్ సభ్యులు
 కెనడా22000100.001979 జూన్ 13
East Africa11000100.001975 జూన్ 14
 కెన్యా22000100.001999 మే 18
 నమీబియా11000100.002003 ఫిబ్రవరి 19
 నెదర్లాండ్స్66000100.001996 ఫిబ్రవరి 22
 స్కాట్‌లాండ్5310175.002010 జూన్ 19
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్11000100.001996 ఫిబ్రవరి 18
చివరిగా తాజాకరించినది 2023 మార్చి 6. విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది..[44]

టి20 ఇంటర్నేషనల్ పోటీలు

గణాంకాలలో 2022 నవంబరు 13 వరకు గేమ్‌లు ఉన్నాయి.

టి20 జట్టు రికార్డులు

  • అత్యధిక జట్టు స్కోరు: 241/3, 2019లో మెక్లీన్ పార్క్ వద్ద న్యూజిలాండ్‌తో
  • అత్యల్ప జట్టు స్కోరు: 80, 2012లో కొలంబో (RPS) వద్ద భారతదేశంతో

టి20 వ్యక్తిగత రికార్డులు

  • అత్యధిక మ్యాచ్‌లు: 115 - ఇయాన్ మోర్గాన్
  • ఎక్కువ కాలం కెప్టెన్‌గా పనిచేసిన: 72 మ్యాచ్‌లు - ఇయాన్ మోర్గాన్

టి20 బ్యాటింగ్ రికార్డులు

  • అత్యధిక పరుగులు: 2,713 - జోస్ బట్లర్
  • అత్యుత్తమ సగటు: 37.93 - కెవిన్ పీటర్సన్
  • అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 147.90 - లియామ్ లివింగ్‌స్టోన్
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 116* - అలెక్స్ హేల్స్, 2014లో చిట్టగాంగ్‌లో శ్రీలంకతో
  • రికార్డ్ భాగస్వామ్యం: 182 – డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్, 2019లో మెక్లీన్ పార్క్ వద్ద న్యూజిలాండ్‌తో
  • అత్యధిక శతాబ్దాలు: 1 - అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్
  • అత్యధిక డకౌట్లు: 9 - ల్యూక్ రైట్, మోయిన్ అలీ

టి20 బౌలింగ్ రికార్డులు

  • అత్యధిక వికెట్లు: 96 – క్రిస్ జోర్డాన్
  • అత్యుత్తమ సగటు: 16.84 – గ్రేమ్ స్వాన్
  • అత్యుత్తమ బౌలింగ్: 5/10 – 2022లో పెర్త్‌లో సామ్ కర్రాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో
  • అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 13.2 – మార్క్ వుడ్
  • అత్యుత్తమ ఎకానమీ రేటు: 6.36 – గ్రేమ్ స్వాన్

టి20 ఫీల్డింగ్ రికార్డులు

  • అవుట్ ఫీల్డర్ ద్వారా అత్యధిక క్యాచ్‌లు: 46 - ఇయాన్ మోర్గాన్
  • వికెట్ కీపర్‌గా అత్యధిక అవుట్‌లు: 64 – జోస్ బట్లర్ [a]
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక అవుట్‌లు: 4 – మాట్ ప్రియర్, 2007లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో

వివిధ దేశాలతో ఆడిన టి20 ల రికార్డు

ప్రత్యర్థిమ్యాగెటై+గెటై+ఓఫ.తేగెలుపు %తొలి గెలుపు
v. టెస్టు దేశాలు
 ఆఫ్ఘనిస్తాన్330000100.002012 సెప్టెంబరు 21
 ఆస్ట్రేలియా23111000247.822005 జూన్ 13
 బంగ్లాదేశ్41300025.002021 అక్టోబరు 27
 భారతదేశం23111200047.822009 జూన్ 14
 ఐర్లాండ్2010010.00
 న్యూజీలాండ్2313810156.522008 ఫిబ్రవరి 5
 పాకిస్తాన్2918910166.072009 జూన్ 7
 దక్షిణాఫ్రికా25121200150.002009 నవంబరు 13
 శ్రీలంక1410400071.432010 మే 13
 వెస్ట్ ఇండీస్24101400041.672007 జూన్ 29
 జింబాబ్వే110000100.002007 సెప్టెంబరు 13
v. అసోసియేట్ సభ్యులు
 నెదర్లాండ్స్2020000.00
రికార్డ్‌లు టి20 #2026, 2023 మార్చి 14 వరకు. T+W ,T+L టైబ్రేకర్‌లో (సూపర్ ఓవర్ వంటివి) టై అయిన మ్యాచ్‌లు, వాటిలో గెలిచినవి ఓడిపోయినవీ సూచిస్తాయి. విజయం శాతంలో ఫలితం తేలని మ్యాచ్‌లను పరిగణించలేదు. టైలను సగం గెలుపుగా గణిస్తుంది.[45]

ఇంగ్లాండ్ జట్టులో ఎక్కువసార్లు ఆడిన ఆటగాళ్ళు

ఈ జాబితాల్లో ఆట ప్రతి రూపంలోనూ ఇంగ్లండ్ తరపున అత్యధికంగా ఆడిన ఐదుగురు ఆటగాళ్లను చూడవచ్చు. ఇవి 2023 మార్చి 14 వరకు సరైనవి.

  • = ఎంపిక కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్లు, గత 12 నెలల్లో ఇంగ్లండ్‌కు ఫార్మాట్‌లో ప్రాతినిధ్యం వహించినవాళ్ళు.
అత్యధిక టెస్టులు [46]
179జేమ్స్ ఆండర్సన్
161అలస్టర్ కుక్
161స్టూవర్ట్ బ్రాడ్
133అలెక్ స్టీవర్ట్
129జో రూట్
అత్యధిక వన్‌డేలు [47]
225ఇయాన్ మోర్గాన్
197పాల్ కాలింగ్‌వుడ్
194జేమ్స్ ఆండర్సన్
170అలెక్ స్టీవర్ట్
165జోస్ బట్లర్
అత్యధిక టి20లు [48]
115ఇయాన్ మోర్గాన్
106జోస్ బట్లర్
95ఆదిల్ రషీద్
87క్రిస్ జోర్డాన్
75అలెక్స్ హేల్స్ †

ప్రస్తుత జట్టు

ఇది గత సంవత్సరం (2022 జూలై 11 నుండి) ఇంగ్లండ్ తరపున ఆడిన యాక్టివ్ ప్లేయర్‌లందరి జాబితా ఇది.

ECB ప్రతి సంవత్సరం సెప్టెంబరులో, ఇంగ్లండ్ ఆటగాళ్లలో జట్టులో ప్రధానంగా ఉండాలని సెలెక్టర్లు భావించేవారికి సెంట్రల్ కాంట్రాక్టులను అందజేస్తుంది.[49] సంవత్సరంలో తగినన్ని ఆటలు ఆడే ఇతర ఆటగాళ్ళకు ఇంక్రిమెంటల్ కాంట్రాక్టులు ఇస్తారు. ప్రతిభ ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ల కోసం పేస్ బౌలింగ్ అభివృద్ధి ఒప్పందాలు కూడా ఉన్నాయి. [50]

పేరువయసుబ్యాటింగు శైలిబౌలింగు శైలిదేశీయ జట్టుC/TరకాలుS/Nకెప్టెన్సీచివరి టెస్టుచివరి వన్‌డేచివరి టి20
బ్యాట్స్‌మన్లు
హ్యారీ బ్రూక్25కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ మీడియం పేస్యార్క్‌షైర్Iటెస్టులు, వన్‌డే, టి2088 2023 2023 2022
జాక్ క్రాలే26కుడిచేతి వాటంకెంట్Cటెస్టులు6 2023 2021
బెన్ డకెట్29ఎడమచేతి వాటంనాటింగ్‌హ్యామ్‌షైర్టెస్టులు, వన్‌డే, టి2017 2023 2023 2023
అలెక్స్ హేల్స్35కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ మీడియం పేస్నాటింగ్‌హ్యామ్‌షైర్టి2010 2016 2019 2022
విల్ జాక్స్25కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ బ్రేక్సర్రీటెస్టులు, వన్‌డే, టి2085 2022 2023 2022
డాన్ లారెన్స్27కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ బ్రేక్ఎసెక్స్టెస్టులు68 2022
డేవిడ్ మలన్36ఎడమచేతి వాటంకుడిచేతి లెగ్ స్పిన్యార్క్‌షైర్Iవన్‌డే, టి2029 2022 2023 2023
ఒల్లీ పోప్26కుడిచేతి వాటంసర్రీCటెస్టులు80టెస్టులు (VC) 2023
జో రూట్33కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ బ్రేక్/leg spinయార్క్‌షైర్Cటెస్టులు66 2023 2022 2019
జాసన్ రాయ్33కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ మీడియం పేస్సర్రీIవన్‌డే20 2019 2023 2022
జేమ్స్ విన్స్33కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ మీడియం పేస్హ్యాంప్‌షైర్వన్‌డే14 2018 2023 2022
ఆల్ రౌండర్లు
రెహాన్ అహ్మద్19కుడిచేతి వాటంకుడిచేతి లెగ్ స్పిన్లీస్టషైర్టెస్టులు, వన్‌డే, టి2053 2022 2023 2023
మొయిన్ అలీ37ఎడమచేతి వాటంకుడిచేతి ఆఫ్ బ్రేక్వార్విక్‌షైర్Cటెస్టులు, వన్‌డే, టి2018వన్‌డే, టి20 (VC) 2023 2023 2023
సామ్ కర్రాన్26ఎడమచేతి వాటంఎడమచేతి మీడియం ఫాస్ట్సర్రీCవన్‌డే, టి2058 2021 2023 2023
లియామ్ డాసన్34కుడిచేతి వాటంస్లో ఎడమచేతి ఆర్థడాక్స్హ్యాంప్‌షైర్వన్‌డే, టి2083 2017 2022 2022
లియామ్ లివింగ్‌స్టోన్30కుడిచేతి వాటంకుడిచేతి లెగ్ స్పిన్/ఆఫ్ బ్రేక్లాంకషైర్Cటెస్టులు, టి2023 2022 2022 2022
క్రెయిగ్ ఓవర్టన్30కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ మీడియం పేస్-ఫాస్ట్సోమర్‌సెట్P32 2022 2022
జామీ ఓవర్టన్30కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్సర్రీP75 2022
బెన్ స్టోక్స్33ఎడమచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్డర్‌హ్యామ్Cటెస్టులు, టి2055టెస్టులు (C) 2023 2022 2022
డేవిడ్ విల్లీ34ఎడమచేతి వాటంఎడమచేతి ఫాస్ట్ మీడియమ్నార్తాంప్టన్‌షైర్Iవన్‌డే, టి2015 2023 2022
క్రిస్ వోక్స్35కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్వార్విక్‌షైర్Cటెస్టులు, వన్‌డే, టి2019 2023 2023 2023
ల్యూక్ వుడ్28ఎడమచేతి వాటంఎడమచేతి ఫాస్ట్ మీడియమ్లాంకషైర్వన్‌డే, టి2077 2022 2022
వికెట్ కీపర్లు
జానీ బెయిర్‌స్టో34కుడిచేతి వాటంయార్క్‌షైర్Cటెస్టులు51 2023 2022 2022
సామ్ బిల్లింగ్స్33కుడిచేతి వాటంకెంట్వన్‌డే7 2022 2022 2022
జోస్ బట్లర్33కుడిచేతి వాటంలాంకషైర్Cవన్‌డే, టి2063వన్‌డే, టి20I (కె) 2022 2023 2023
బెన్ ఫోక్స్31కుడిచేతి వాటంసర్రీCటెస్టులు50 2023 2019 2019
ఫిల్ సాల్ట్27కుడిచేతి వాటంలాంకషైర్వన్‌డే, టి2061 2023 2023
పేస్ బౌలర్లు
జేమ్స్ ఆండర్సన్41ఎడమచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్లాంకషైర్Cటెస్టులు9 2023 2015 2009
జోఫ్రా ఆర్చర్29కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్ససెక్స్Cవన్‌డే, టి2022 2021 2023 2023
స్టువర్ట్ బ్రాడ్38ఎడమచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్నాటింగ్‌హ్యామ్‌షైర్Cటెస్టులు8 2023 2016 2014
బ్రైడన్ కార్సే28కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్డర్‌హ్యామ్P92 2022
రిచర్డ్ గ్లీసన్36కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్లాంకషైర్టి2071 2022
క్రిస్ జోర్డాన్35కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్సర్రీవన్‌డే, టి2034 2015 2022 2023
సాకిబ్ మహమూద్27కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్లాంకషైర్Pవన్‌డే25 2022 2023 2022
మాథ్యూ పాట్స్25కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్డర్‌హ్యామ్Iటెస్టులు35 2023 2022
ఆలీ రాబిన్సన్30కుడిచేతి వాటంకుడిచేతి ఆఫ్ మీడియం పేస్-ఫాస్ట్ససెక్స్Cటెస్టులు57 2023
ఆలీ స్టోన్30కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్నాటింగ్‌హ్యామ్‌షైర్Pవన్‌డే, టి2026 2021 2023 2022
జోష్ టంగ్26కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్-మీడియమ్వోర్సెస్టర్‌షైర్టెస్టులు56 2023
రీస్ టోప్లీ30కుడిచేతి వాటంఎడమచేతి ఫాస్ట్ మీడియమ్సర్రీIవన్‌డే, టి2038 2023 2022
మార్క్ వుడ్34కుడిచేతి వాటంకుడిచేతి ఫాస్ట్డర్‌హ్యామ్Cటెస్టులు, వన్‌డే, టి2033 2023 2023 2023
స్పిన్ బౌలర్లు
జాక్ లీచ్33ఎడమచేతి వాటంస్లో ఎడమచేతి ఆర్థడాక్స్సోమర్‌సెట్Cటెస్టులు77 2023
ఆదిల్ రషీద్36కుడిచేతి వాటంకుడిచేతి లెగ్ స్పిన్యార్క్‌షైర్Cవన్‌డే, టి2095 2019 2023 2023

కోచింగ్ సిబ్బంది

స్థానంపేరు
మేనేజింగ్ డైరెక్టర్రాబర్ట్ కీ
ప్రదర్శన దర్శకుడుమో బోబాట్
సెలెక్టర్ల్యూక్ రైట్

టెస్టులు

స్థానంపేరు
ప్రధాన కోచ్బ్రెండన్ మెకల్లమ్
అసిస్టెంట్ కోచ్పాల్ కాలింగ్‌వుడ్
అసిస్టెంట్ కోచ్మార్కస్ ట్రెస్కోథిక్
స్పిన్ బౌలింగ్ కోచ్జీతన్ పటేల్
పేస్ బౌలింగ్ కోచ్నీల్ కిలీన్

పరిమిత ఓవర్లు

స్థానంపేరు
ప్రధాన కోచ్మాథ్యూ మోట్
అసిస్టెంట్ కోచ్రిచర్డ్ డాసన్
అసిస్టెంట్ కోచ్డేవిడ్ సాకర్
అసిస్టెంట్ కోచ్కార్ల్ హాప్కిన్సన్

ఇంగ్లండ్ పురుష క్రికెటర్ ఆఫ్ ద ఇయర్

ప్రతి సీజన్ ప్రారంభంలో ECB ఇంగ్లండ్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేస్తుంది, "గత సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తించి", [51] క్రికెట్ మీడియా సభ్యులు ఓటు వేశారు. [52]

ఈ అవార్డును గతంలో గెలుచుకున్న వారు:

  • 2006/07: ఆండ్రూ ఫ్లింటాఫ్ [53]
  • 2007/08: ఇయాన్ బెల్
  • 2008/09: కెవిన్ పీటర్సన్
  • 2009/10: గ్రేమ్ స్వాన్ [54]
  • 2010/11: జోనాథన్ ట్రాట్ [55]
  • 2011/12: జేమ్స్ ఆండర్సన్ [56]
  • 2012/13: మాట్ ప్రయర్ [57]
  • 2013/14: ఇయాన్ బెల్ [51]
  • 2014/15: జో రూట్ [58]
  • 2015/16: జో రూట్ [59]

ఇవి కూడా చూడండి

నోట్స్

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ