ఆశ్రిత దగ్గుబాటి

ఆశ్రిత దగ్గుబాటి భారతీయ ప్రొఫెషనల్ బేకర్. సోషల్ మీడియాలో 'ఇన్ఫినిటీ ప్లాటర్' అనే తన స్వంత బ్రాండ్‌తో ప్రసిద్ధి చెందింది.[1] ఆమె తెలుగు సినిమా కథానాయకుడు విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె. ఆమె హోప‌ర్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో చోటు ద‌క్కించుకుంది.[2]

ఆశ్రిత దగ్గుబాటి
జననం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
గుర్తించదగిన సేవలు
ప్రొఫెషనల్ బేకర్, యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్
తల్లిదండ్రులు
బంధువులుదగ్గుబాటి రామానాయుడు (తాతయ్య), రాజ్యలక్ష్మి (నాయనమ్మ)
దగ్గుబాటి సురేష్ బాబు (పెదనాన్న)
రానా దగ్గుబాటి, అభిరామ్, మాళవిక (కజిన్స్)
నాగ చైతన్య (అత్త కొడుకు)

జననం, విద్య

ఆశ్రిత 1990లో దగ్గుబాటి వెంకటేష్, నీరజ దంపతులకు మొదటి సంతానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కారంచేడులో జన్మించింది. ఆమెకు చెల్లెల్లు హయవాహిని, భావన, అరుణ్ అనే తమ్ముడు ఉన్నారు. మాస్టర్స్ డిగ్రీ యూకే లో పూర్తిచేసింది.

కెరీర్

సినీ పరిశ్రమ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు. ఆమె ఒక శిక్షణ పొందిన బేకర్. ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ ను స్థాపించి రామానాయుడు స్టూడియోలో బేకరీ స్టాల్స్‌ను ప్రారంభించింది. యూట్యూబర్, కంటెంట్ సృష్టికర్త కూడా అయిన ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ల‌క్ష‌కుపైగా ఫాలోవ‌ర్లతో హోప‌ర్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో పేరు నమోదు చేసుకున్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా, అలాగే యూట్యూబర్ గా ఆదాయం సంపాదిస్తోంది.

ఇన్‌స్టాగ్రాంలో అధికంగా సంపాదిస్తున్న వారి జాబితాను హోపర్‌డాట్‌కాం అనే సంస్థ విడుదల చేసిన జాబితాలో ఆశ్రిత దగ్గుబాటి అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది.

వ్యక్తిగతం

ఆశ్రిత తన చిన్ననాటి స్నేహితుడు వినాయక్ రెడ్డిని 2019 మార్చి 24న వివాహం చేసుకుంది.[3]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ