ఆమ్‌స్టర్‌డ్యామ్

నెదెర్లాండ్స్ రాజధాని
(ఆమ్‌స్టర్‌డామ్ నుండి దారిమార్పు చెందింది)

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్ రాజధాని. 872,680 జనాభాతో [1]ఇది ఆ దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 24,10,960. నగరంలో ఉన్న అనేక కాలువల కారణంగా దీన్ని ఉత్తరాది వెనిస్ గా దీన్ని పేర్కొంటారు. ఈ కాలువలను యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.

ఆమ్‌స్టర్‌డ్యాం, నార్త్‌ సీ కాలువల ఉపగ్రహ చిత్రం

ఆమ్‌స్టెల్ అనే నది పైన కట్టిన డ్యాము వద్ద ఉన్న నగరంగా దీనికి ఆ పేరు వచ్చింది. [2] 12 వ శతాబ్దిలో చేపల పట్టే వారి పల్లెగా ఇది వెలసింది. 17 వ శతాబ్దిలో ఒక ముఖ్యమైన రేవుపట్టణంగా, వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది.[3] 19, 20 శతాబ్దాల్లో నగరం బాగా విస్తరించింది.

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్‌కు వాణిజ్య రాజధని. సాంస్కృతిక రాజధాని కూడా.[4] ఫిలిప్స్, అక్జోనోబెల్, టోంటోం, ఐఎన్‌జి వంటి అనేక సంస్థల కేంద్ర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి.[5] ఉబర్, నెట్‌ఫ్లిక్స్, టెస్లా వంటి విదేశీ సంస్థల ఐరోపా కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.[6] 2012 లో, ఐరోపా లోని అత్యంత జీవనానుకూలమైన నగరాల్లో రెండవదిగా ఆమ్‌స్టర్‌డ్యామ్ ఎంపికైంది. [7] జీవన నాణ్యతలో ప్రపంచంలో 12 వ అత్యుత్తమ నగరంగా మెర్సర్ ఎంపిక చేసింది.[8] అత్యుత్తమ సాంకేతిక కేంద్రాల్లో ప్రపంచంలో 4 వ స్థానంలోను, ఐరోపాలో రెండవ స్థానం లోనూ నిలిచింది. [9] ఆమ్‌స్టర్‌డ్యామ్ ఐరోపాలో ఐదవ అతి పెద్ద రేవుపట్టణం.[10] ఆమ్‌స్టర్‌డ్యామ్ లోని షిఫోల్ విమానాశ్రయం ప్రయాణీకుల రద్దీలో ఐరోపా లోకెల్లా మూడవ స్థానంలో ఉంది. ఆమ్‌స్టర్‌డ్యామ్ పౌరుల్లో ప్రముఖులు రెంబ్రాంట్, వాన్ గాఫ్.

భౌగోళికం

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్ పశ్చిమ భాగంలో నార్త్ హాలండ్ ప్రావిన్సులో ఉంది.అంస్టెల్ నది నగరం మధ్య వరకూ ప్రవహించి ఆగిపోతుంది. అక్కడి నుండి అనేక కాలువలుగా చీలి పోతుంది. ఆమ్‌స్టర్‌డ్యామ్ సముద్ర మట్టానికి 2 మీటర్ల దిగువన ఉంటుంది.[11] నగర విస్తీర్ణం 219.4 చ.కి.మీ. ఇందులో పార్కులు, ప్రకృతి వనాలు 12% భాగాన్ని ఆక్రమిస్తాయి..[12]

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ