ఆడమ్ గిల్‌క్రిస్ట్

ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ ఆటగాడు
(ఆడం గిల్‌క్రిస్ట్ నుండి దారిమార్పు చెందింది)

ఆడమ్ క్రెయిగ్ గిల్‌క్రిస్ట్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రస్తుత ఆస్ట్రేలియన్ క్రికెట్ వ్యాఖ్యాత.[2] అతను ఎడమచేతి వాటం అటాకింగ్ బ్యాట్స్‌మన్, రికార్డ్-బ్రేకింగ్ వికెట్ కీపర్, దూకుడుగా సాగే తన బ్యాటింగ్ ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టు ధోరణిని పునర్నిర్వచించాడు. క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా అతనిని పరిగణిస్తారు.[3][4] వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డు 2015లో కుమార సంగక్కర అధిగమించేవరకూ గిల్‌క్రిస్ట్ పేరిటే ఉంది.[5][6] టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ రికార్డు ఇప్పటికీ గిల్‌క్రిస్ట్ పేరిటే ఉంది.1999 క్రికెట్ ప్రపంచ కప్, 2003 క్రికెట్ ప్రపంచ కప్, 2007 క్రికెట్ ప్రపంచ కప్ - ఇలా వరుసగా మూడు ప్రపంచ టైటిళ్లను, దానితో పాటుగా 2006 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో గిల్‌క్రిస్ట్ సభ్యుడు.

ఆడమ్ గిల్‌క్రిస్ట్
2010లో గిల్‌క్రిస్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆడమ్ క్రెయిగ్ గిల్‌క్రిస్ట్
పుట్టిన తేదీ (1971-11-14) 1971 నవంబరు 14 (వయసు 52)
బెల్లింగన్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
మారుపేరుగిల్లీ, చర్చ్, వింగ్‌నట్[1]
ఎత్తు186 సెంటీమీటర్లు
బ్యాటింగుఎడమ చేతివాటం
పాత్రవికెట్ కీపర్-బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 381)1999 నవంబరు 5 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2008 జనవరి 24 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 129)1996 అక్టోబర్ 25 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2008 మార్చి 4 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.12, 18
తొలి T20I (క్యాప్ 2)2005 ఫిబ్రవరి 17 - న్యూజీలాండ్ తో
చివరి T20I2008 ఫిబ్రవరి 1 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992/93–1993/94న్యూ సౌత్ వేల్స్
1994/95–2007/08పశ్చిమ ఆస్ట్రేలియా
2008–2010డెక్కన్ ఛార్జర్స్
2010మిడిల్‌సెక్స్
2011–2013కింగ్స్ XI పంజాబ్
కెరీర్ గణాంకాలు
పోటీటెస్ట్వన్డే ఇంటర్నేషనల్ఫస్ట్ క్లాస్ క్రికెట్లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు96287190356
చేసిన పరుగులు5,5709,61910,33411,326
బ్యాటింగు సగటు47.6035.8944.1634.95
100లు/50లు17/2616/5530/4318/63
అత్యుత్తమ స్కోరు204*172204*172
క్యాచ్‌లు/స్టంపింగులు379/37417/55756/55526/65
మూలం: CricInfo, 2013 డిసెంబరు 4

అంతర్జాతీయ వన్డే చరిత్రలోనూ, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనూ అత్యధిక స్ట్రైక్‌రేట్ సాధించిన ఆటగాళ్ళలో అతనొకడు; 2006 డిసెంబరులో పెర్త్‌లో ఇంగ్లండ్‌పై అతను 57 బంతుల్లో కొట్టిన సెంచరీ మొత్తం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాల్గవ వేగవంతమైన సెంచరీ.[7] టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడు ఇతనే.[8] టెస్టుల్లో 17 సెంచరీలు, వన్డేల్లో 16 సెంచరీలతో అత్యధిక సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ల జాబితాలో సంగక్కర తర్వాత రెండవ స్థానంలో గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. వరుసగా మూడు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో (1999, 2003, 2007లో) కనీసం 50 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ రికార్డును కలిగి ఉన్నాడు.[9] 2007 ప్రపంచ కప్ ఫైనల్‌లో శ్రీలంకపై అతను ఆడిన 104 బంతుల్లో 149 పరుగుల ఇన్నింగ్స్ ఆల్ టైమ్ గ్రేట్ ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా పరిగణిస్తారు.[10][11] మూడు ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకున్న ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచంలో అతనితో సహా ముగ్గురే ఉన్నారు.[12]

2005లో షేన్‌ వార్న్ బౌలింగ్‌లో స్టాండింగ్ అప్ పొజిషన్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న గిల్‌క్రిస్ట్. బ్యాట్స్‌మ్యాన్ ఆండ్రూ స్ట్రాస్.

గిల్‌క్రిస్ట్ తనను తాను ఔట్‌ అయ్యానని భావించినప్పుడు, కొన్నిసార్లు అంపైర్ నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉన్నా క్రీజ్ విడిచి నడిచివెళ్ళిపోవడం అతని ప్రత్యేకతల్లో ఒకటి.[13][14]అతను 1992లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు, 1996లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో అతని మొదటిసారి వన్డే ఇంటర్నేషనల్లో అడుగుపెట్టగా, 1999లో అతని టెస్టు అరంగేట్రం జరిగింది.[2] తన కెరీర్‌లో, అతను ఆస్ట్రేలియా తరపున 96 టెస్ట్ మ్యాచ్‌లు, 270కి పైగా వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[2] అతను టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ కూడా ఆస్ట్రేలియాకు రెగ్యులర్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించేవాడు[15][16], రెగ్యులర్ కెప్టెన్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్ అందుబాటులో లేనప్పుడు జట్టుకు కెప్టెన్‌గా కూడా పనిచేశాడు.[17][18][19][20] గిల్‌క్రిస్ట్ 2008 మార్చిలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు,[21][22] అయినా అతను 2013 వరకు ఐపీఎల్ వంటి దేశీయ టోర్నమెంట్లలో ఆడటం కొనసాగించాడు.[23]

ఇవి కూడా చూడండి

మూలాలు

పుస్తక ఆకరాలు

  • Cashman, Richard; Franks, Warwick; Maxwell, Jim; Sainsbury, Erica; Stoddart, Brian; Weaver, Amanda; Webster, Ray (1997). The A–Z of Australian cricketers. Melbourne, Victoria: Oxford University Press. ISBN 978-0-9756746-1-1.
  • Haigh, Gideon; Frith, David (2007). Inside story:unlocking Australian cricket's archives. Southbank, Victoria: News Custom Publishing. ISBN 978-1-921116-00-1.
  • Harte, Chris; Whimpress, Bernard (2003). The Penguin History of Australian Cricket. Camberwell, Victoria: Penguin Books Australia. ISBN 978-0-670-04133-6.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ