ఆచంట శరత్ కమల్
Jump to navigationJump to search
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d1/XIX_Commonwealth_Games-2010_Delhi_%28Men%E2%80%99s_Double_Table_Tennis_Final%29_Achanta_Sarath_Kamal_%26_Subhajit_Saha_of_India_won_the_Gold_medal%2C_at_Yamuna_Sports_Complex%2C_in_Delhi_on_October_13%2C_2010.jpg/220px-thumbnail.jpg)
ఆచంట శరత్ కమల్ (జననం: జులై 12, 1982) ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినవాడు. చెన్నై లయోలా కళాశాలలో చదివాడు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఉద్యోగి.[1]
2022 ఆగస్టు నాటికి ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో కమల్ ది 39వ స్థానం.
విజయములు, పురస్కారాలు
- 2004 లో కౌలాలంపూర్లో జరిగిన 16వ కామన్ వెల్త్ క్రీడలలో బంగారు పతకము సాధించాడు.
- 2004 లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారముతో సన్మానించింది.
- 2006 లో కొలంబోలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలలో నాలుగు పతకములు గెలిచాడు.
- 2006 లో మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకములు సాధించాడు
- 2007 లో ఉత్తర కొరియా లోని ప్యోంగ్ యాంగ్ అంతర్జాతీయ టూర్నమెంట్ గెలిచాడు.
- 2008 లో నాలుగవ సారి జాతీయ ఛాంపియన్ గా ఎన్నుకొనబడ్డాడు.
- 2010 లో గౌహతిలో జరిగిన 71వ జాతీయ ఛాంపియన్ గా గెలిచాడు.
- 2019 లో పద్మశ్రీ పురస్కారం లభించింది.