అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మంత్రి. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 నుండి తెలంగాణ దేవాదాయ, న్యాయ, అటవీ శాఖల మంత్రిగా ఉన్నాడు. 2014 జనరల్ ఎన్నికల్లో బి.ఎస్.పి. అభ్యర్థిగా నిర్మల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 10వ, 14వ లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశాడు.[1][2][3]

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి


దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ, అటవీశాఖ
తెలంగాణ ప్రభుత్వం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 ఫిబ్రవరి 2019 - 3 డిసెంబర్ 2023
నియోజకవర్గంనిర్మల్ శాసనసభ నియోజకవర్గం

దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ
తెలంగాణ ప్రభుత్వం
పదవీ కాలం
2014 – 2018
నియోజకవర్గంనిర్మల్ శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
2014 – 3 డిసెంబర్ 2023
ముందుఏలేటి మహేశ్వర్ రెడ్డి
తరువాతసముద్రాల వేణుగోపాలాచారి
నియోజకవర్గంఆదిలాబాద్

పార్లమెంట్ సభ్యుడు, 14వ లోక్‌సభ
పదవీ కాలం
2008 – మే 2009
ముందుటి. మధుసూధన్ రెడ్డి
తరువాతరమేష్ రాథోడ్

పదవీ కాలం
2004 – 2008
ముందుఇంద్రకరణ్
తరువాతఏలేటి మహేశ్వర్ రెడ్డి
నియోజకవర్గంనిర్మల్ శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
1999 – 2004
ముందునల్ల ఇంద్రకరణ్ రెడ్డి
తరువాతనల్ల ఇంద్రకరణ్ రెడ్డి
నియోజకవర్గంనిర్మల్ శాసనసభ నియోజకవర్గం

పార్లమెంట్ సభ్యుడు, 10వ లోక్‌సభ
పదవీ కాలం
జూన్ 1991 – మే 1996
ముందుపి. నర్సారెడ్డి
తరువాతసముద్రాల వేణుగోపాలాచారి
నియోజకవర్గంఆదిలాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-02-16) 1949 ఫిబ్రవరి 16 (వయసు 75)
ఎల్లపల్లి, నిర్మల్, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీకాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలుతెలంగాణ రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులునారాయణరెడ్డి (తండ్రి)
జీవిత భాగస్వామివిజయలక్ష్మీ
సంతానంగౌతమ్
నివాసంనిర్మల్, ఆదిలాబాద్
పూర్వ విద్యార్థిఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తివ్యవసాయదారుడు, సామాజిక కార్యకర్త

జననం - చదువు

ఇంద్రకరణ్ నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలం ఎల్లపల్లిలో 1949 ఫిబ్రవరి 16న జన్మించాడు.[4] ఈయన తండ్రి నారాయణరెడ్డి. ఇంద్రకరణ్ నిజామాబాదులోని గిరిజ ప్రభుత్వ కళాశాలలో బి.కాం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి చదివాడు.[5]

వివాహం

1975 మే 4న విజయలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు.

వృత్తి

ఉపాధ్యాయుడు, వ్యవసాయదారుడు.

రాజకీయరంగం

1980ల ప్రారంభం నుండి క్రియాశీల రాజకీయాలలో ఉన్న ఇంద్రకరణ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కూడా పనిచేశాడు. 1999 నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున నిర్మల్ శాసనసభ నియోజకవర్గం సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2008లో ఉపఎన్నికల తర్వాత 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][6] 10వ లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నాడు. 2018లో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8][9][10]

ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ నుండి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 18738 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[11][12] అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మే 01న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[13][14]

పదవులు

భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 10వ లోక్ సభ (1991-96),2008లో 14వ లోక్ సభ ఉపఎన్నికలలో ఎన్నికయ్యాడు.[15][16]

క్రమసంఖ్యనుండివరకుస్థానంవ్యాఖ్యలు
0119911996సభ్యుడు, 10 వ లోక్ సభ
0219992004సభ్యుడు, 11 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ
0320042008సభ్యుడు, 12 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ
0420082009సభ్యుడు, 14 వ లోక్‌సభఉప ఎన్నికల్లో ఎన్నికయ్యాడు
0520142018సభ్యుడు, 1 వ తెలంగాణ శాసనసభ
0620182023 డిసెంబరు 32 వ తెలంగాణ శాసనసభ సభ్యుడు

సందర్శన

హాంకాంగ్, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలు సందర్శించాడు.

ఇతరములు

  • సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు.

వనరులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ