అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం

అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) యాజమాన్యంలో, వారి నిర్వహణలోనే ఉన్న క్రికెట్ స్టేడియం. ఇది ఢిల్లీ లోని బహదూర్ షా జఫర్ మార్గ్‌లో ఉంది.[2][3] దీన్ని 1883 లో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరుతో నిర్మించారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ తర్వాత ఇది భారతదేశంలోని రెండవ అత్యంత పురాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. 2019 అక్టోబరు 25 నాటికి ఇక్కడ 34 టెస్టులు, 25 ODIలు, 6 T20Iలు ఆడారు.

అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం
పటం
Former namesఫిరోజ్ షా కోట్లా స్టేడియం
Locationబహదూర్ షా జఫర్ మార్గ్, ఢిల్లీ గేట్ వద్ద, ఢిల్లీ
Ownerఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్
Operatorఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్
Capacity41,842[1]
Surfaceపచ్చిక (ఓవల్)
Construction
Opened1883
Construction cost₹114.5 కోట్లు
మైదాన సమాచారం
ప్రదేశంBahadur Shah Zafar Marg, Delhi
భౌగోళికాంశాలు28°38′16″N 77°14′35″E / 28.63778°N 77.24306°E / 28.63778; 77.24306
స్థాపితం1882
యజమానిUtpal Kant
వాడుతున్నవారుభారత క్రికెట్ జట్టు
ఢిల్లీ క్రికెట్ జట్టు
ఢ్జిల్లీ కాపిటల్స్
ఎండ్‌ల పేర్లు
స్టేడియం ఎండ్
పెవిలియన్ ఎండ్
అంతర్జాతీయ సమాచారం
మొదటి టెస్టు1948 10–14 November:
 India v  వెస్ట్ ఇండీస్
చివరి టెస్టు2023 17–19 February:
 India v  ఆస్ట్రేలియా
మొదటి ODI1982 15 September:
 India v  శ్రీలంక
చివరి ODI202211 October:
 India v  దక్షిణాఫ్రికా
మొదటి T20I2016 23 March:
 ఆఫ్ఘనిస్తాన్ v  ఇంగ్లాండు
చివరి T20I2022 9 June:
 India v  దక్షిణాఫ్రికా
మొదటి మహిళా టెస్టు1976 12–14 November:
 India v  వెస్ట్ ఇండీస్
చివరి మహిళా టెస్టు1984 21–24 January:
 India v  ఆస్ట్రేలియా
మొదటి WODI1985 19 February:
 India v  న్యూజీలాండ్
చివరి WODI1997 9 December:
 India v  శ్రీలంక
మొదటి WT20I2016 15 March:
 న్యూజీలాండ్ v  శ్రీలంక
చివరి WT20I2016 30 March:
 న్యూజీలాండ్ v  ఇంగ్లాండు
2023 19 February నాటికి
Source: CricInfo

2017 సన్మాన కార్యక్రమంలో, డిడిసిఎ స్టేడియంలోని నాలుగు స్టాండ్‌లకు భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ, భారత మాజీ ఆల్ రౌండర్ మొహిందర్ అమర్‌నాథ్, మాజీ భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ ల పేర్లు పెట్టారు. హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌కి రమణ్ లాంబా పేరు, బయట డ్రెస్సింగ్ రూమ్‌కి ప్రకాష్ భండారి పేరు పెట్టారు.[4]

2019 సెప్టెంబరు 12 న, డిడిసిఎ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జ్ఞాపకార్థం స్టేడియం పేరును మార్చారు.[5] అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టేడియంలో ఆధునిక సౌకర్యాలుగా మార్చడం, దాని సీటింగ్ సామర్థ్యాన్ని పెంచడం, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలను నిర్మించడం వంటి పనులు చేసారు. స్టేడియంలోని ఒక స్టాండ్‌కు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. ఈ పేరు మార్పును భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ విమర్శించాడు.[6] పేరు మార్పును ప్రకటించిన తర్వాత, తాము స్టేడియం పేరును మాత్రమే మార్చామనీ, ఇక్కడి మైదానం పేరు ఫిరోజ్ షా కోట్లా మైదానం అనే ఉంటుందనీ స్పష్టం చేసింది.

2017 నాటికి, భారత జాతీయ క్రికెట్ జట్టు ఈ మైదానంలో 28 సంవత్సరాలుగా టెస్ట్ మ్యాచ్‌లలోను, 10 సంవత్సరాలకు పైగా ODI మ్యాచ్‌లలోనూ అజేయంగా ఉంది.[7]

చరిత్ర

ఈ వేదికపై మొదటి టెస్ట్ మ్యాచ్ 1948 నవంబరు 10న వెస్టిండీస్‌తో భారత్‌తో ఆడింది.

రికార్డులు

1952లో, పాకిస్థాన్‌తో ఆడుతున్నప్పుడు, హేమూ అధికారి, గులాం అహ్మద్‌లు పదో వికెట్‌కు 111 పరుగుల రికార్డు భాగస్వామ్యం సాధించారు. ఈ రికార్డు ఇప్పటికీ నిలిచి ఉంది. 1965 లో, S వెంకటరాఘవన్, తన తొలి సిరీస్‌లో, 72 పరుగులకు 8 వికెట్లు, 80 పరుగులకు 4 వికెట్లు అనే గణాంకాలతో న్యూజిలాండ్ లైనప్‌ను పడగొట్టాడు. 1969-70లో, బిషెన్ సింగ్ బేడీ, ఎరపల్లి ప్రసన్నలు స్పిన్ జాలంతో భారత్‌ ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల విజయం సాధించడంలో దోహదపడ్డారు. వీరిద్దరూ కలిసి 18 వికెట్లు సాధించారు.[8] 1981లో జియోఫ్ బాయ్‌కాట్, గ్యారీ సోబర్స్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల ప్రపంచ టెస్ట్ రికార్డును ఇక్కడే అధిగమించాడు.

1983లో, సునీల్ గవాస్కర్ ఈ మైదానంలో తన 29వ టెస్టు శతకం కొట్టి, డాన్ బ్రాడ్‌మాన్ 29 సెంచరీల రికార్డును సమం చేశాడు.[9]

1999లో, అనిల్ కుంబ్లే పాకిస్తాన్‌పై ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు, జిమ్ లేకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ బౌలరతడు.[10]

2005 డిసెంబరులో సచిన్ టెండూల్కర్ శ్రీలంకపై తన 35వ టెస్ట్ సెంచరీని సాధించి సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.[11]

సంవత్సరం పాటు నిషేధం

2009 డిసెంబరు 27 న, పిచ్ పరిస్థితులు మ్యాచ్‌ ఆడేందుకు తగినట్లుగా లేనందున భారత, శ్రీలంకల మధ్య జరిగాల్సిన ODI మ్యాచ్‌ను రద్దు చేసారు. మ్యాచ్ రిఫరీ నివేదిక ఆధారంగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 12 నెలల పాటు ఈ మైదానంలో టెస్టులు ఆడకుండా నిషేధించింది. 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా ఆమోదం పొందింది.[12]

ఇండియన్ ప్రీమియర్ లీగ్

2008 నుండి ఈ స్టేడియం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) కి నిలయంగా ఉంది.

2017 పొగతో కూడిన మంచు సంఘటన

ఢిల్లీలో 2017-18లో భారత శ్రీలంకల మూడవ టెస్టు రెండో రోజు సందర్భంగా, పొగతో కూడిన మంచు కారణంగా శ్రీలంక క్రికెటర్లు ఆటను ఆపి కాలుష్య నిరోధక మాస్క్‌లు ధరించవలసి వచ్చింది. ఆటకు కలిగిన అంతరాయాల పరంగా ఇది అరుదైన దృశ్యం. క్రికెటర్ లహిరు గమగే తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పాడు.[13] ఢిల్లీ మైదానంలో తీవ్రమైన కాలుష్యం కారణంగా క్రికెటర్ సురంగ లక్మల్‌కు వాంతులు అవుతున్నాయని శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్ నిక్ పోథాస్ నివేదించారు. మధ్యాహ్నం 12:32 నుంచి 12:49 గంటల వరకు ఆట నిలిచిపోయింది. దీంతో భారత కోచ్ రవిశాస్త్రి మైదానంలోని అంపైర్‌లతో సంప్రదించేందుకు బయటకు వచ్చాశు.[14] భారత ప్రేక్షకులు శ్రీలంక జట్టును "మెలోడ్రామటిక్" అని గేలి చేస్తూండగా, శ్రీలంక జట్టు రచ్చ చేస్తోందని బిసిసిఐ అధ్యక్షుడు సికె ఖన్నా ఆరోపించాడు.[15] 4వ రోజున, భారత ఆటగాడు మహ్మద్ షమీ కూడా మైదానంలో వాంతులు చేసుకుంటూ కనిపించాడు.[16]

మ్యాచ్ అయ్యాత, అధిక కాలుష్యం ఉన్న ఢిల్లీలో టెస్టు ఆడేందుకు ఎంపిక చేయడాన్ని రెండు దేశాలు విమర్శించాయి.[17] శ్రీలంక మేనేజరు ఆశాంక గురుసిన్హా మాట్లాడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఇరు జట్లు తమ డ్రెస్సింగ్ రూమ్‌లలో ఆక్సిజన్ సిలిండర్‌లను ఉపయోగిస్తున్నాయని, [17] భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌లలో గాలి-నాణ్యత మీటర్లను ఉపయోగించాలని సూచించాడు.[17] ఇటువంటి పరిస్థితుల్లో ఆడటం వల్ల ఊపిరితిత్తులు, గుండెలకు జబ్బులు వస్తాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెకె అగర్వాల్ అన్నాడు. మ్యాచ్‌ జరపాలో లేదో వేసే అంచనా ప్రమాణాలలో వాతావరణ కాలుష్యాన్ని ఒక అంశంగా చేర్చాలని సిఫార్సు చేశాడు.[17]

గణాంకాలు

2016లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్

ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టు ఇక్కడ టెస్టు మ్యాచ్‌లలో 18 మ్యాచిల్లో ఫలితం తేలగా వాటిలో 10 టెస్టు మ్యాచ్‌లు గెలిచింది.

  • మొత్తం మీద అత్యంత విజయవంతమైన జట్టు:- భారత్ - 10 విజయాలు
  • అత్యంత విజయవంతమైన సందర్శన జట్టు:- ఇంగ్లాండ్ - 3 విజయాలు
  • అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు : 1959 ఫిబ్రవరి 6న వెస్టిండీస్ చేత 644/8 [18]
  • అత్యల్ప ఇన్నింగ్స్ స్కోరు : 1987 నవంబరు 25న భారత్ చేతిలో 75 ఆలౌట్ [19]
  • మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచినది : 5
  • మొదట బౌలింగ్‌ చేసిన జట్టు గెలిచినది: 13
  • సగటు ఇన్నింగ్స్ స్కోరు:285
  • అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ (759 పరుగులు)
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 2017 డిసెంబరు 3 న విరాట్ కోహ్లీ v శ్రీలంకపై 243
  • అత్యంత విజయవంతమైన బౌలర్: అనిల్ కుంబ్లే (58 వికెట్లు)

వివిధ ఫార్మాట్లలో రికార్డులు

టెస్ట్ రికార్డు

ఈ మైదానంలో అత్యధిక టెస్ట్ స్కోరు వెస్టిండీస్ చేసింది. ఆ జట్టు 1959లో 644–8, 1948లో 631 పరుగులు చేసింది. 2008లో భారతదేశం 613–7 స్కోరు చేసి తదుపరి అత్యధిక స్కోరు సాధించింది. ఇక్కడ అత్యధిక పరుగులు దిలీప్ వెంగ్‌సర్కార్ (673 పరుగులు) చేయగా, తర్వాతి స్థానాల్లో సునీల్ గవాస్కర్ (668 పరుగులు), సచిన్ టెండూల్కర్ (643 పరుగులు) ఉన్నారు. ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన వారిలో అనిల్ కుంబ్లే (58 వికెట్లు), తర్వాతి స్థానాల్లో కపిల్ దేవ్ (32 వికెట్లు), ఆర్ అశ్విన్ (27 వికెట్లు) ఉన్నారు.

వన్డే రికార్డు

  • ఒక ఇన్నింగ్స్‌లో 300+ పరుగులు చేసినది రెండు సార్లు
  • ఈ మైదానంలో అత్యధిక ODI స్కోరు 330/8. 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్‌పై వెస్టిండీస్ ఈ స్కోరు చేసింది.[20]
  • రాయ్ డయాస్ (శ్రీలంక), సచిన్ టెండూల్కర్ (భారత్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), నిక్ నైట్ (ఇంగ్లండ్), ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), విరాట్ కోహ్లీ (భారతదేశం), కేన్ విలియమ్సన్ (న్యూజీలాండ్), ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) - 8 మంది బ్యాట్స్‌మెన్లు వన్డే సెంచరీలు సాధించారు.
  • వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) 1989లో భారత్‌పై 6 వికెట్లు తీశాడు.

ODI క్రికెట్ ప్రపంచ కప్

1987, 1996, 2011 లో క్రికెట్ ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఈ స్టేడియం వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.

ట్వంటీ20 ఇంటర్నేషనల్స్

2016 ICC వరల్డ్ ట్వంటీ20

2016 ICC వరల్డ్ ట్వంటీ20 లో కొన్ని మ్యాచ్‌లను ఈ మైదానంలో జరిపారు. గ్రూప్ A నుండి ఇక్కడ మూడు మ్యాచ్‌లు, అలాగే ఒక సెమీ-ఫైనల్ ఆడారు. ఈ మైదానంలో జరిగిన మొట్టమొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్ గ్రూప్ A మ్యాచ్ ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య జరిగింది.

భారత క్రికెట్ జట్టు మ్యాచ్‌లు

ఈ మైదానంలో మొట్టమొదటి భారత అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్, 2017 నవంబరు 1 న భారతదేశం న్యూజిలాండ్‌ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఆశిష్ నెహ్రాకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా. అతనికి వీడ్కోలుగా DDCA, ఆ ఒక్కరోజున ఫిరోజ్ షా కోట్లా మైదానం లోని ఒక ఎండ్‌ పేరును "ఆశిష్ నెహ్రా ఎండ్" అని మార్చింది. క్రికెట్ చరిత్రలో తన పేరిట ఉన్న ఎండ్ నుండి తానే బౌలింగు చేసిన ఆటగాళ్ళలో జేమ్స్ ఆండర్సన్ తర్వాత నెహ్రా నిలిచాడు.

2019–20లో బంగ్లాదేశ్ టూర్‌లో 2019 నవంబరు 3 న ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్, 1,000 వ పురుషుల ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్.[21] ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి, ఈ ఫార్మాట్‌లో భారత్‌పై తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.[22]

రవాణా సౌలభ్యం

రోడ్డు : బహదూర్ షా జాఫర్ మార్గ్ బస్ స్టాప్‌లు : అంబేద్కర్ స్టేడియం బస్ స్టాప్, ఢిల్లీ గేట్ బస్ స్టాప్, సహీద్ పార్క్ బస్ స్టాప్, అంబేద్కర్ స్టేడియం టెర్మినల్, దర్యా గంజ్, దర్యా గంజ్ గోల్చా సినిమా

ఢిల్లీ మెట్రో : ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్

భారతీయ రైల్వేలు: తిలక్ వంతెన రైల్వే స్టేషన్ (TKJ)

వైమానిక: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

ఇవి కూడా చూడండి

  • టెస్ట్ క్రికెట్ మైదానాల జాబితా

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ