అమెరికా ఆదిమ వాసులు

అమెరికా ఖండాన్ని కొలంబస్ కనుగొనడానికి పూర్వమే అక్కడ అనేక తెగల ఆదిమ వాసులు నివసించే వారు. భారత దేశాన్ని చేరడం కోసం యూరోపు నుండి కొత్తగా పశ్చిమ ప్రయాణం మొదలుపెట్టిన కొలంబస్ ఈ భూమినే ఇండియా అనుకొని, ఈ తెగలవారిని 'ఇండియన్స్' అని పిలిచాడు. అందువల్ల వీరిని ఎర్ర భారతీయులు (రెడ్ ఇండియన్స్) అని కూడా వ్యవహరించేవారు.

Indigenous peoples of the Americas
Quechua women in Peru
Total population
Approximately 60.5 million
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 Mexico14.7 million[1][2]
 Peru13.8 million[3]
 Bolivia6.0 million[4]
 Guatemala5.8 million[5]
 Ecuador3.4 million
 United States2.9 - 5 million[6]
 Chile1.8 million[7]
 Colombia1.4 million[8]
 Canada1.4 million[9]
 Argentina955,032[10]
 Brazil817,963[11]
 Venezuela524,000[12]
 Honduras520,000[13]
 Nicaragua443,847[14]
 Panama204,000[15]
 Paraguay95,235[16]
 El Salvador~70,000[17]
 Costa Rica~114,000[18]
 Guyana~60,000[19]
 Greenland~51,000[20]
 Belize~24,501 (Maya)[21]
 French Guiana~19,000[22]
 Suriname~12,000–24,000
భాషలు
Indigenous languages of the Americas, English, Spanish, Portuguese, French, Dutch
మతం
Inuit religion
Native American religion
Christianity

వీరిలో అనేకులు ఐరోపా దేశస్థుల సాంగత్యం వలన, వారి నుంచి సోకిన కొత్త వ్యాధుల వలన చనిపోయారు. కొన్ని తెగలు యుద్ధంలో దాదాపు పూర్తిగా నశించాయి. మరి కొందరు యుద్ధాలలో ఓడి బానిసలుగా ఐరోపా వారి దగ్గర లొంగిపోయారు. కుదిరినప్పుడు యుద్ధాలు, లేనప్పుడు ఒప్పందాల మూలంగా ఐరోపా దేశస్థులు (ముఖ్యంగా ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, స్పెయిన్ వారు) ఈ జాతులను తెగలను, క్రమంగా మొత్తం అమెరికా ఖండ భూభాగాన్నంతా సా.శ. 15 వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం లోపల పూర్తిగా ఆక్రమించు కున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం, అమెరికా, కెనడా లలో కలిపి మొత్తం దాదాపు 30 లక్షల మంది ఆదిమ వాసుల అను వంశీకులుంటారు. వీరి పూర్వీకులు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి అమెరికాకు వచ్చి చేరారని (బహుశా అలాస్కా ఆసియాతో కలిసి ఒకే భూ భాగంగా ఉండేటప్పుడు ), మానవ శాస్త్ర పరిశోధనల్లో తేలింది.

ఆదిమ ఉత్తర అమెరికన్లలో కొన్ని ముఖ్య తెగలు = చెరోకీ, మాయా/యుకాటెక్, అజ్ టెక్, నవాజో, స్యూ మొదలయినవి. ఈ తెగల పేర్లే భాషలకి కూడా వర్తిస్తూంటారు.

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ