అభినవ్ బింద్రా

భారతీయ వ్యాపారవేత్త

1982, సెప్టెంబర్ 28న పంజాబ్ లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో (ఛండీగఢ్ పక్కన) జన్మించిన అభినవ్ బింద్రా (ఆంగ్లము: Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న ఇద్దరు భారతీయులలో అతను మెుదటివాడు. బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం సాధించి 112 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా[2]భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. 1980 నుండి 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో[3] మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.

అభినవ్ బింద్రా
జననం (1982-09-28) 1982 సెప్టెంబరు 28 (వయసు 41)[1]
డెహ్రాడూన్, భారత్భారతదేశం
నివాస ప్రాంతంఛండీగఢ్, భారత్భారతదేశం
వృత్తిక్రీడాకారుడు షూటర్,
సి.ఈ.ఓ అభినవ్‌ ఫ్యూచరిస్టిక్స్‌
ఎత్తు5 అడుగుల 8 అంగుళాలు
బరువు65.5 కిలోలు
మతంహిందూ
తండ్రిడాక్టర్ ఎ.ఎస్.బింద్రా
తల్లిబబ్లీ బింద్రా

బాల్యం

1982లో మొహాలీ జిల్లా జీరక్‌‌పూర్‌లో సంపన్నమైన సిక్కు కుటుంబంలో[4] డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు[5] జన్మించాడు. డెహ్రాడూన్ లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి ఛండీగర్‌లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు. ఎం.బీ.ఏ. కొలరాడో (అమెరికా) లో చేసాడు [2]

క్రీడా జీవితం

బింద్రా ప్రతిభను మొదట గుర్తించినది అతడి తొలి కోచ్ జె.ఎస్.థిల్లాన్.[6] 2000 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న పిన్న భారతీయుడు బింద్రానే.[7] అర్హత రౌండులో 590 పాయింట్లు నమోదుచేసి 13వ స్థానంలో నిలిచాడు. దానితో ఫైనల్లో (తుది ఎనిమిది మందిలో) స్థానం పొందలేకపోయాడు.[8]

అంతర్జాతీయ ప్రతిభ

2001లోనే బింద్రా అంతర్జాతీయ పోటిలలో ఆరు స్వర్ణాలు సాధించాడు. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో ప్పెయిర్స్ విభాగంలో స్వర్ణాన్ని, వ్యక్తిగత విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. 2004 ఒలింపిక్ క్రీడలలో 597 పాయింట్లతో ప్రాథమిక రౌండులో మూడో స్థానాన్ని పొందినాడు. ఫైనల్లో కేవలం 97.6 పాయింట్లు మాత్రమే సాధించడంతో చివరికి 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.[9] 2006లో మెల్బోర్న్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అభినవ్ బింద్రా మరోసారి గత క్రీడలలో సాధించిన విధంగా పెయిర్స్ విభాగంలో స్వర్ణాన్ని, వ్యక్తిగత విభాగంలో రజతాన్ని పొందినాడు. అదే ఏడాది దోహాలో జరిగిన ఆసియా క్రీడలలో వెన్నునొప్పి కారణంగా బింద్రా తప్పుకున్నాడు.

2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలు

2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పాల్గొన్న అభినవ్ బింద్రా తన చిరకాల వాంఛ నెరవేర్చుకొనడమే కాకుండా క్రీడా భారతావనికి కూడా పేరు తెచ్చాడు. ఇంతవరకు ఏ భారతీయ క్రీడాకారుడు సాధించని వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణపతకం సాధించి తన పేరిట ఒక కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ అంతగా పేరుప్రఖ్యాతలు పొందని బింద్రా తన తండ్రి ఐదేళ్ళ వయస్సులోనే చెప్పిన సైలెంట్ కిల్లర్ భావనను నిజం చేశాడు. ప్రాథమిక రౌండులో 596 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉన్న బింద్రా ఫైనల్లో 104.5 పాయింట్లు సాధించి మొత్తం 700.5 పాయింట్లతో లక్ష్యాన్ని సాధించి స్వర్ణ పతకాన్ని పొందాడు.

సాధించిన అవార్డులు

పుస్తకాలు

వీడియోలు

పురస్కారాలు

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు నగదు ఇతర బహుమతుల్ని ప్రకటించాయి.

  • పంజాబ్‌ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి
  • భారత క్రీడాశాఖ మరో రూ.30 లక్షల పారితోషికం
  • విదేశాల్లో శిక్షణకు కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయంగా రూ.35 లక్షలు ఇచ్చింది
  • బీసీసీఐ రూ.25 లక్షలు
  • హర్యానా ప్రభుత్వం రూ.25 లక్షలు
  • కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ రూ.5 లక్షలు
  • మహారాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు
  • మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రూ.5 లక్షలు
  • స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.5 లక్షలు
  • ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం లక్ష రూపాయలు
  • అభినవ్‌కు భారత రైల్వే జీవిత కాలపు ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించింది.

విశేషాలు

  • అభినవ్‌ బింద్రాకు చండీగఢ్‌ శివార్లలోని తమ సొంత ఫామ్‌ హౌస్‌లోనే తన తండ్రి సమకూర్చిన అత్యంత ఆధునికమైన వసతులతో స్వంత ఎయిర్‌ కండిషన్డ్‌ షూటింగ్‌ రేంజ్‌ ఉంది
  • 112 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశం వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని (అభినవ్‌ బింద్రా) సాధించింది

బయటి లింకులు

అధికారిక వెబ్‌సైట్లు

మూలాలు

ఇవికూడా చూడండి

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ