అబ్దుల్ ఆజీం దఢాఖ

అబ్దుల్ ఆజీం దఢాఖ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు. తెలుగులో దాదాపు 238కి పైగా కీర్తనలు, హిందీలో 114 కీర్తనలను రచించాడు.[1]

అబ్దుల్ ఆజీం దఢాఖ
జననం1869
అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ
మరణం1965
మతంముస్లీం
తండ్రిమహమ్మద్ అబ్దుల్ రహమాన్
తల్లిదఢాఖ

జీవిత విశేషాలు

అబ్దుల్ ఆజీం దఢాఖ 1869లో మహమ్మద్ అబ్దుల్ రహమాన్, దఢాఖ దంపతులకు జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ గ్రామంలో జన్మించాడు.[1] బాల్యం నుండే సంగీతం, సాహిత్యంలో ఆసక్తిని అబ్దుల్ ఆజీం దఢాఖ గానంలో, హార్మోనియం, తబలా వాయించడంలో తన ప్రతిభను కనబరచాడు. హిందు ధర్మంపట్ల ఆకర్షితుడైన ఈయన శ్రీ కుమారస్వామి వద్ద ఉపదేశం పొందాడు. తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం సర్దార్‌నగర్ గ్రామంలో ఉంటూ బాల బాలికలకు విద్యను నేర్పాడు.

రచనాప్రస్థానం

సంగమేశ్వర స్వామిని పూజిస్తూ తన కీర్తనల రచనను ప్రారంభించాడు. ముందుగా త్రివేణి సంగమ మంగళ తరంగిణి అనే అజీం భజనమాల రాశాడు. అందులోని ప్రథమభాగంలో 114 కీర్తనలు, 3మంగళ హారతులు రాయగా, ద్వితీయ భాగములో 26 హిందీ కీర్తనలు రాశాడు. ఈయన షర్రాఫ్ అమృతదాసుతో కలిసి శ్రీహరి హర భజనామృత గాన తరంగిణి అనే అజీం అఖండమాలలో 124 కీర్తనలు, 4 మంగళ హారతులు రాసి, శిష్యులకు నేర్పించాడు.[2]

మరణం

ఈయన 1965లో మరణించాడు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ