అపరశక్తి ఖురానా

అపరశక్తి ఖురానా (జననం 1987 నవంబరు 18) ఒక భారతీయ నటుడు, రేడియో జాకీ, హాస్యనటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, టెలివిజన్ హోస్ట్. అంతేకాకుండా, ఆయన హర్యానా U-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన మాజీ భారతీయ క్రికెటర్.[1] ఆయన నటుడు ఆయుష్మాన్ ఖురానాకు తమ్ముడు.[2]

అపరశక్తి ఖురానా
2018లో అపరశక్తి ఖురానా
జననం (1987-11-18) 1987 నవంబరు 18 (వయసు 36)
వృత్తి
  • నటుడు
  • టెలివిజన్ హోస్ట్
  • రేడియో జాకీ
  • హాస్యనటుడు
  • గాయకుడు
  • సంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అకృతి అహుజా ఖురానా
(m. 2014)
పిల్లలు1
బంధువులుఆయుష్మాన్ ఖురానా (సోదరుడు)

అపరశక్తి ఖురానా మొట్టమొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ బయోపిక్ దంగల్ (2016). ఇది అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అతనికి అనేక ప్రశంసలను సంపాదించిపెట్టింది. అతను తదనంతరం బద్రీనాథ్ కి దుల్హనియా (2017), స్త్రీ (2018), లుకా చుప్పి (2019), పతి పత్నీ ఔర్ వో (2019) వంటి అనేక ఇతర వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు. 2021లో, అతను సోలో లీడ్‌గా తన మొదటి చిత్రం హెల్మెట్‌లో నటించాడు.

ప్రారంభ జీవితం

ఆయన 1987 నవంబరు 18న చండీగఢ్‌లో జన్మించాడు. అతని తండ్రి పి. ఖురానా జ్యోతిష్యుడు, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన రచయిత, అయితే అతని తల్లి పూనమ్ సగం బర్మీస్ సంతతికి చెందిన గృహిణి.

చండీగఢ్‌లో పాఠశాల విద్య, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ ఆయన పూర్తి చేశాడు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలలో చురుకుగా ఉండే ఆయన హర్యానా U-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా అయ్యాడు. అతను ఢిల్లీలోని ఐఐఎంసి నుండి మాస్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు.

వ్యక్తిగత జీవితం

అతను 2014 సెప్టెంబరు 7న వ్యాపారవేత్త, ఐఎస్బీ గ్రాడ్యుయేట్ అయిన ఆకృతి అహుజాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2021న ఆగస్టు 27న అర్జోయ్ ఎ ఖురానా అనే పాప జన్మించింది.

ఫిల్మోగ్రఫీ

సంవత్సరంటైటిల్పాత్రమూలాలు
2016దంగల్ఓంకార్ సింగ్ ఫోగట్[3]
సాత్ ఉచక్కీఖప్పే[4]
2017బద్రీనాథ్ కీ దుల్హనియాభూషణ్ మిశ్రా[5]
2018హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీఅమన్ సింగ్ వాధ్వా[6]
స్త్రీబిట్టు[7]
రాజ్మా చావల్బల్జీత్[8]
2019లుకా చుప్పిఅబ్బాస్ షేక్[9]
జబరియా జోడిసంతోష్ పాఠక్[10]
కాన్పురియేజైతాన్ మిశ్రా[11]
బాలాఅర్జున్ సింగ్[12]
పతి పత్నీ ఔర్ వోఫాహిమ్ రిజ్వీ[13]
2020స్ట్రీట్ డ్యాన్సర్ 3డిఅమరీందర్[14]
2021హెల్మెట్లక్కీ[15]
హమ్ దో హమారే దోసందీప్ "షంటీ" సచ్‌దేవా[16]
2022ధోఖా: రౌండ్ డి కార్నర్హక్ రియాజ్ గుల్[17]
భేదియాబిట్టు[17]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ