అనుమోలు సుశాంత్

అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. ఆయన ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. అక్కినేని నాగార్జునకు మేనల్లుడు. ఆయన ప్రముఖ తెలుగు సినిమా నటులైన యార్లగడ్డ సుమంత్ కుమార్, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ యొక్క బంధువు. ఆయన తండ్రితరపున తాతయ్య అయిన ఎ.వి.సుబ్బారావు కూడా చిత్రపరిశ్రమకు చెందినవాడు. ఎ.వి.సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై సుమారు 25 చిత్రాలకు 1970 నుండి 1980 వరకు నిర్మాతగా ఉన్నారు.

సుశాంత్
జననం
అనుమోలు సుశాఅంత్

(1986-03-18) 1986 మార్చి 18 (వయసు 38)[1]
భారతదేశం
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
తల్లిదండ్రులుఅనుమోలు సత్యభూషణరావు
అక్కినేని నాగసుశీల
బంధువులుఅక్కినేని నాగేశ్వరరావు (తల్లిపరపున తాత)
అక్కినేని నాగార్జున (లల్లి తరపున మామయ్య)
యార్లగడ్డ సుమంత్ కుమార్
అక్కినేని నాగచైతన్య
అక్కినేని అఖిల్
అక్కినేని అమల

ప్రారంభ జీవితం

సుశాంత్ హైదరాబాదుకు తీసుకొని రాబడినాడు. ఆయన అనుమోలు సత్య భూషణరావు, అక్కినేని నాగసుశీలలకు జన్మించాడు. హైదరాబాదులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసాడు. ఇంటర్మీడియట్ విద్యను గౌతమి జూనియర్ కళాశాలలో పూర్తిచేసాడు. ఆయన ఉర్బానా-చాంపైన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో బి.ఎస్. పూర్తిచేసాడు. ఆయన యునైటెడ్ టెక్నాలజీస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా నటునిగా ప్రవేశించక ముందు ఉద్యోగం చేసాడు. ఆయన తన కజిన్ అయిన నాగచైతన్యతో పాటుగా ముంబై లోని క్రియేటింగ్ కారెక్టర్స్ ట్రైనింగ్ స్కూలులో నటనపై శిక్షణ పొందాడు.[2]

నటించిన చిత్రాలు

సుశాంత్ 2008 లో కాళిదాసు చిత్రం ద్వారా చిత్రరంగంలోకి అడుగు పెట్టాడు. ఈ చిత్రం శ్రీనివాస్ చింతలపూడి, నాగసుశీల చే శ్రీనాగ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మించబడింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టుడియోస్ సమర్పించింది. ఈ చిత్రంలో సుశాంత్ తమన్నాతో జంటగా నటించాడు. ఈ చిత్రానికి జి.రవిచరణ్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.

తరువాతి చిత్రం పేమకథతో కూడిన కరెంట్ 2009 లో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తే స్నేహా ఉల్లాల్ కథానాయకిగా నటించారు. ఈ రెండు చిత్రాలలో సుశాంత్ నాట్య, ఫైటింగ్ నైపుణ్యాలలో అభినందించబడ్డాడు.

సుశాంత్ మూడవ సినిమా అడ్డా వినోదాత్మక చిత్రం. ఈ చిత్రాన్ని జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తే అనోప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయనకు సహ నటిగా లవ్‌లీ చిత్రంతో రంగప్రవేశం చేసిన నటి శాన్వీ శ్రీవాస్తవ నటించింది. ఈ చిత్రాన్ని మొట్టమొదటిసారిగా నాగార్జున 2013 మార్చి 18న విడుదల చేసాడు.[3] ఈ చిత్రం యొక్క టైటిల్ సాంగ్ ను 2013 ఏప్రిల్ 7 న హైదరాబాదులో ఐ.పి.ఎల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో చిత్రీకరించారు.[4] ప్రచార వీడియోలను తరువాత ప్రారంభించారు. అత్యధిక అంచనాలతో అడ్డా విడుదలైనా అనుకున్న స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయింది. కాని సుశాంత్ నటనా నైపుణ్యానికి అభినందించబడ్డాడు.

సినిమాల జాబితా

సంవత్సరంసినిమా పేరుపాత్రగమనికలుమూలాలు
2008కాళిదాసుకాళిదాసు[5]
2009ప్రస్తుతసుశాంత్[6]
2013అడ్డాఅభి
2015దొంగాటఅతనే"బ్రేక్ అప్ అంటూ" పాటలో
2016ఆటాడుకుందాం రాకార్తీక్
2018చి ల సౌఅర్జున్[7]
2020అలా వైకుంఠపురములోరాజ్ మనోహర్
2021ఇచట వాహనములు నిలుపరాదుఅరుణ్[8]
2023రావణాసురరామ్[9]
భోలా శంకర్చిత్రీకరణ[10]

వెబ్ సిరీస్

సంవత్సరంపేరుపాత్రఇతర విషయాలుమూలాలు
2022మా నీళ్ల ట్యాంక్వంశి[11]

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ