అనుమానాస్పదం

2007 సినిమా

అనుమానాస్పదం 2007 లో వంశీ దర్శకత్వంలో విడుదలైన ఒక ఉత్కంఠభరిత చలనచిత్రం. ఇందులో ఆర్యన్ రాజేష్, హంసా నందిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.[1]

అనుమానాస్పదం
దర్శకత్వంవంశీ
రచనఆకెళ్ళ వంశీకృష్ణ (సంభాషణలు), వేటూరి సుందరరామ్మూర్తి (పాటలు)
నిర్మాతసతీష్‌ తాటి, జై ఆర్నాల
తారాగణంఆర్యన్‌ రాజేష్,
హంసా నందిని,
వనితా రెడ్డి,
తనికెళ్ల భరణి,
జయప్రకాష్‌ రెడ్డి,
జీవా,
సుభాష్,
మూలవిరాట్,
దేవీచరణ్,
బి. వి. చంద్రశేఖర్
ఛాయాగ్రహణంపీ.జి. విందా
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
‌‌ఇ.ఎ.పి.టి.
విడుదల తేదీs
ఫిబ్రవరి 9, 2007
భాషతెలుగు

కథాగమనం

విఠల్ దాసు అనే వ్యక్తికి నిత్యమంగళం అడవుల్లో వీరప్పన్ దాచిన నిధి గురించి తెలుస్తుంది. అతడు కొంతమందికి డబ్బు ఇచ్చి ఆ నిధిని వెతికేందుకు పంపిస్తాడు. వారిలో బాసు అనబడే బావరాజు సూర్యనారాయణ (ఆర్యన్ రాజేష్), ఒక లేడీ డాక్టర్ (హంసానందిని), ఒక మాజీ ఫారెస్టు ఆఫీసర్ తంగవేలు (జయప్రకాష్ రెడ్డి), బాంబులు డిటెక్ట్ చేసే వ్యక్తి, బాంబులను నిర్వీర్యం చేసేందుకు కామిని అనే ఆమె, వేస్ట్ అని పిలువబడే వంటవాడు, రాబర్ట్ అనే వ్యక్తి, రాజు అనే డ్రైవర్ ఉంటారు. వీళ్ళంతా నిత్యమంగళం అడవికి చేరే దారిలో వీరప్పన్లా మీసాలు పెంచిన వ్యక్తి లిఫ్ట్ అడుగుతాడు. ప్రయాణంలో వీరప్పన్ చావలేదనీ బ్రతికే ఉన్నాడనీ అతడు వీళ్ళకు చెపుతాడు. ఎలాగోలా తిప్పలు పడి మొత్తానికి నిధిని సాధించి వెనుకకు బయలుదేరుతారు. తిరుగు ప్రయాణంలో ఒక్కొక్కరుగా అందరూ చనిపోతుంటారు. వీరప్పనే అందరినీ చంపుతున్నాడని అనుకుంటుంటారు. చివరకు బాసు, లేడీ డాక్టర్, కామిని మిగులుతారు. తమ వాళ్ళను చంపిన వ్యక్తి బాసుకు దొరుకుతాడు వాళ్ళిద్దరూ కొట్టుకొనే సమయంలో కామిని వాడిని చంపేస్తుంది. హంతకుడిని చంపేసాని ఆనందపడుతుంటే కామినిని చంపేస్తారెవరో. తరువాత బాసును డాక్టరును చంపేందుకు వచ్చిన వాడిని పట్టుకొంటాడు బాసు. అప్పుడే తెలుస్తుంది వాడు వాళ్ళ గ్రూపులో మొదటగా హతమైన రాబర్ట్ అని. కామినిని ప్రేమించి అందరినీ చంపి డబ్బుతో పారిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. వాడిని చంపి డాక్టరుతో బాసు వెనుకకు వచ్చేస్తాడు.

పాటలు

  • కుయ్ లాలో కుయ్ లాలో చిలక చిలక (రచన : వేటురి; గానం : శ్రేయా గోషాల్)
  • నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు (రచన : వేటూరి; గానం :శ్రేయా గోషాల్, విజయ్ జేసుదాసు)
  • ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా (రచన : వంశీ; గానం : ఉన్నికృష్ణన్, శ్రేయా గోషాల్)
  • మల్లెల్లో ఇల్లేసే చందమామ వెన్నెల్లు చల్లేసే చందమామ (రచన : వేటూరి; గానం : హరిహరన్, సాధనా సర్గమ్)
  • రా రా రా గుమ్మా రా తుళ్ళే కొమ్మ (రచన : వేటురి; గానం : సోనూ నిగమ్, ఇళయరాజా)
  • రేలా రేలా రేలా రెక్కి రెక్కి రేలా (రచన : వేటూరి; గానం : టిప్పు, భవతరంగిణి)

విశేషాలు

ఈ సినిమా ఆర్థికంగా పెద్ద విజయం సాధించలేక పోయింది. బాక్సాఫీసు వద్ద సగటు చిత్రంగా నిలిచింది.[1]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ