అనంతుల మదన్ మోహన్

అనంతుల మదన్ మోహన్ (నవంబర్ 16, 1932 - నవంబర్ 1, 2004) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1970 నుండి 1983 మధ్యకాలంలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[1][2]

అనంతుల మదన్ మోహన్

పదవీ కాలం
1970 – 1985
ముందువి.బి.రాజు
తరువాతకె.చంద్రశేఖర రావు

వ్యక్తిగత వివరాలు

జననం(1932-11-16)1932 నవంబరు 16
మైలారం, వరంగల్ జిల్లా
మరణం2004 నవంబరు 1(2004-11-01) (వయసు 71)
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నివాసంకొండపాక, గజ్వేల్, సిద్ధిపేట జిల్లా

జననం - విద్యాభ్యాసం

అనంతుల మదన్ మోహన్ 1932, నవంబర్ 16న వరంగల్ జిల్లా, మైలారం లోని తన అమ్మమ్మ గారింట్లో జన్మించాడు. ఈయన తండ్రి చక్రపాణి నిజాం కాలములో కరీంనగర్ జిల్లాలో నాయబ్ తహసిల్దారుగా (డిప్యూటీ ఎమ్మార్వో) పనిచేసేవాడు. కొండపాకలో ప్రాథమిక విద్యాభ్యాసాన్నిపూర్తి చేసిన మదన్ మోహన్, హైస్కూల్, మెట్రిక్యూలేషన్ చదువుని వరంగల్లులో, హైదరాబాదులోని నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు. 1955 నుండి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యేసరికి జనగాం, వరంగల్లులో, హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసుచేస్తూ సమకాలీన రాజకీయాలను పరిశీలిస్తూ, అధ్యయనము చేస్తుండేవాడు.

రాజకీయరంగం

1956, నవంబర్ 1న హైదారాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రములో కలుపగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణా ప్రజల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేధావులు, యువకులు, సామాజిక కార్యకర్తల కలయికతో బషీర్‌ బాగ్ ప్రెస్ క్లబ్ లో 1969, ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ఏర్పడింది. యువకుడు, విద్యావంతుడు, మేధావి, న్యాయవాదైన అనంతుల మదన్ మోహన్ తెలంగాణా ప్రజా సమితికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.అతను 1970లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందాడు. తరువాత 1972, 1978, 1983 ఎన్నికలలో సిద్దిపేట స్థానంనుండి గెలుపొంది శాసనసభ్యునిగా తన సేవలనందించాడు.[3][4]

మరణం

మదన్ మోహన్ 2004, నవంబర్ 1న హైదరాబాద్లో మరణించాడు. 2008లో కొండపాక గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డిచే మదన్ మోహన్ విగ్రహం ఆవిష్కరించబడింది.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ