అక్షత్ రెడ్డి

తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు

ప్రొదుటూరి అక్షత్ రెడ్డి, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. హైదరాబాదు జట్టు తరపున దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన అక్షత్ రెడ్డి, 78 ఫస్ట్-క్లాస్ (5,233 పరుగులు), 59 లిస్టు-ఎ (1,959 పరుగులు), 69 ట్వంటీ20 (1,468 పరుగులు) మ్యాచులు ఆడాడు.

అక్షత్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1991-02-11) 1991 ఫిబ్రవరి 11 (వయసు 33)
హైదరాబాదు, తెలంగాణ
బ్యాటింగుకుడి చేతివాటం
బౌలింగుకుడి చేయి లెగ్ బ్రేక్
పాత్రబ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–ప్రస్తుతంహైదరాబాదు క్రికెట్ జట్టు
2012డెక్కన్ చార్జర్స్
2013సన్ రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీఫస్ట్-క్లాస్లిస్టు-ఎట్వంటీ 20
మ్యాచ్‌లు785969
చేసిన పరుగులు5,2331,9591,468
బ్యాటింగు సగటు44.3433.7724.06
100s/50s15/224/111/5
అత్యధిక స్కోరు250154105 నాటౌట్
వేసిన బంతులు3612412
వికెట్లు000
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు44/–13/–16/–
మూలం: ESPNCricinfo, 2020 మే 6

జననం

అక్షత్ రెడ్డి 1991 ఫిబ్రవరి 11 తెలంగాణ రాజధాని హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం

2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం డెక్కన్ ఛార్జర్స్ తరపున రాజస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. తరువాత హైదరాబాద్ ఫ్రాంచైజీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త యజమానులతో ఐపిఎల్ 2013 సీజన్‌లో భాగమయ్యాడు.

కూచ్ బెహార్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 51 సగటుతో 359 పరుగులు చేశాడు. 2008-09 సీజన్‌లో అండర్-22 సికె నాయుడు ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో 316 పరుగులు చేశాడు. 2010 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్‌తో జరిగిన అండర్-19 జట్టులో ఎంపికయ్యాడు. అక్షత్ తండ్రి, మాజీ వాలీబాల్ క్రీడాకారుడు.

2018 నవంబరులో 2018–19 రంజీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన హైదరాబాద్ మ్యాచ్‌లో, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు.[2] ఎనిమిది మ్యాచ్‌ల్లో 797 పరుగులతో టోర్నమెంట్‌లో హైదరాబాదు జట్టులో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[3]

2019 ఆగస్టులో, 2019–20 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా గ్రీన్ టీమ్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[4][5]

ఉత్తమ స్కోరు

అక్షత్ రెడ్డి ఫస్ట్-క్లాస్ క్రికిట్ లో 250, లిస్టు-ఎలో 154, ట్వంటీ20లో 105 (నాటౌట్) వ్యక్తిగత సోర్కు సాధించాడు.

మూలాలు

బయటి లింకులు