అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం

ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన నిర్వహించబడుతుంది

అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (వాలంటీర్స్ దినోత్సవం) ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలకు మద్దతుగా వాలంటీరిజాన్ని మెరుగుపరచడంతోపాటు...[1] కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారందరి సేవను గుర్తించుకునేందుకు ఈ దినోత్సవం జరుపబడుతుంది.[2]

అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం
జరుపుకొనే రోజుడిసెంబరు 5
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ప్రారంభం

తను తయారుచేసిన దాన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం రోజున ప్రదర్శిస్తున్న పాఠశాల విద్యార్థిని

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1985, డిసెంబర్ 17 తేదీన చేసిన 40/212 తీర్మానంలో ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన స్వచ్ఛంద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.[3] ఐక్యరాజ్య సమితి ఇందులో కీలకపాత్ర పోషిస్తుండగా, రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, వంటి అనేక ఎన్‌జిఒ సంస్థలు ఈ స్వచ్ఛంద సేవకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి.

దాదాపు 130 దేశాల్లో 86 ఫీల్డ్‌యూనిట్లతో ఐక్యరాజ్య సమితి వాలంటీర్ల సంఘం ఏర్పాటయింది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 7700 మంది వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్ళి సేవలను అందిస్తారు. అంతేకాకుండా 2000వ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ఆన్‌లైన్ వాలంటీర్ల విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీషు భాషల్లో ఆన్‌లైన్‌లో సేవలందించే వాలంటీర్లు పనిచేస్తారు.[4]

కార్యక్రమాలు

  1. ఐక్యరాజ్య సమితి 1997, నవంబరు 20వ తేదీన జరిపిన జనరల్ అసెంబ్లీలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కు జపాన్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు 52/17 తీర్మానంతో 2001వ సంవత్సరం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవంగా ప్రకటించబడింది.[5][6]

చిత్రమాలిక

మూలాలు

ఇతర లంకెలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ