అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (ఆంగ్లం International Astronomical Union-IAU), ప్రపంచంలోని వివిధ జాతీయ ఖగోళ సంఘాల సమాఖ్య. ఇది అంతర్జాతీయ సైన్సు కౌన్సిల్ సభ్యత కలిగినది. ఇది అంతర్జాతీయంగా అధికారికంగా గుర్తింపబడింది. దీని కేంద్రము ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో ఉంది. దీని పని, విశ్వంలోని శరీరాలైన నక్షత్రాలను, గ్రహాలను, ఆస్టెరాయిడ్ లను అధ్యయనం చేయడం. వీటికి సరైన పేర్లు పెట్టడం.

సమాఖ్య చిహ్నం

చరిత్ర

అ.ఖ.స. (IAU) 1919లో యేర్పడినది.

సమాఖ్య

అ.ఖ.స. (IAU) లో 9,785 వ్యక్తిగత సభ్యులు గలరు. వీరందరూ పి.హెచ్.డి డాక్టరేట్లు కలిగి ఉన్నారు. ఉద్యోగరీత్యా ఖగోళశాస్త్రజ్ఞులు. వీరేగాక 63 జాతీయ సభ్యులు, వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారున్నారు. 87% వ్యక్తిగత సభ్యులు పురుషులు, 13% స్త్రీలు. ఈ సమాఖ్యకు ప్రస్తుత ఛైర్మన్ క్యాథరిన్ జె.సెరాస్కీ

సాధారణ సభలు

అ.ఖ.స. (IAU), ప్రతి మూడేండ్లకొకసారి సమావేశమౌతుంది. (రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ఇది సమావేశం కాలేదు.)

  • 27వ సాధారణ సభ, 2009 బ్రెజిల్ లోని రియో డీ జెనీరో సమావేశమగుటకు నిశ్చయింపబడింది.
  • 28వ సాధారణ సభ, చైనా లోని బీజింగ్లో 2012 లో సమావేశమగుటకు నిశ్చయింపబడింది.

క్రితం సమావేశాల పట్టిక :

సమావేశంసంవత్సరంప్రదేశం
26వ అ.ఖ.స. సాధారణ సభ2006ప్రేగ్, చెక్ రిపబ్లిక్
25వ అ.ఖ.స. సాధారణ సభ2003సిడ్నీ, ఆస్ట్రేలియా
24వ అ.ఖ.స. సాధారణ సభ2000మాంచెస్టర్, యునైటెడ్ కింగ్ డం
23వ అ.ఖ.స. సాధారణ సభ1997క్యోటో, జపాన్
22వ అ.ఖ.స. సాధారణ సభ1994హేగ్, నెదర్లాండ్
21వ అ.ఖ.స. సాధారణ సభ1991బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
20వ అ.ఖ.స. సాధారణ సభ1988బాల్టిమోర్, మేరీల్యాండ్, అమెరికా
19వ అ.ఖ.స. సాధారణ సభ1985న్యూఢిల్లీ, భారతదేశం
18వ అ.ఖ.స. సాధారణ సభ1982పత్రాస్, గ్రీసు
17వ అ.ఖ.స. సాధారణ సభ1979మాంట్రియల్, క్యుబెక్, కెనడా
16వ అ.ఖ.స. సాధారణ సభ1976గ్రినోబుల్, ఫ్రాన్స్
ప్రత్యేక సభ, అ.ఖ.స. సాధారణ సభ1973
500వ జయంతి
నికోలస్ కోపర్నికస్ [1]
వార్సా, పోలండు
15వ అ.ఖ.స. సాధారణ సభ1973సిడ్నీ, ఆస్ట్రేలియా
14వ అ.ఖ.స. సాధారణ సభ1970బ్రైటన్, యునైటెడ్ కింగ్ డం
13వ అ.ఖ.స. సాధారణ సభ1967ప్రేగ్, చెకోస్లోవేకియా
12వ అ.ఖ.స. సాధారణ సభ1964హాంబర్గ్, పశ్చిమ జర్మనీ
11వ అ.ఖ.స. సాధారణ సభ1961బర్కిలీ, కాలిఫోర్నియా, అమెరికా
10వ అ.ఖ.స. సాధారణ సభ1958మాస్కో, సోవియట్ యూనియన్
9వ అ.ఖ.స. సాధారణ సభ1955డబ్లిన్, ఐర్లాండు
8వ అ.ఖ.స. సాధారణ సభ1952రోమ్, ఇటలీ
7వ అ.ఖ.స. సాధారణ సభ1948జ్యూరిచ్, స్విట్జర్లాండ్
6వ అ.ఖ.స. సాధారణ సభ1938స్టాక్ హోమ్, స్వీడెన్
5వ అ.ఖ.స. సాధారణ సభ1935పారిస్, ఫ్రాన్స్
4వ అ.ఖ.స. సాధారణ సభ1932కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, అమెరికా
3వ అ.ఖ.స. సాధారణ సభ1928లీడెన్, నెదర్లాండ్
2వ అ.ఖ.స. సాధారణ సభ1925కేంబ్రిడ్జ్, యునైటెడ్ కింగ్ డం
మొదటి వ అ.ఖ.స. సాధారణ సభ1922రోమ్, ఇటలీ

26వ సాధారణ సభ , 'గ్రహం' నిర్వచనము

26వ సాధారణ సభ 2006 ఆగస్టు 14 నుండి ఆగస్టు 25 వరకు చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్లో సమావేశమైనది. ఈ సమావేశములలో గ్రహం నిర్వచనాన్ని రూపొందించారు. ప్లూటో గ్రహాన్ని దాని హోదానుండి తొలగించారు. మరుగుజ్జు గ్రహాల గూర్చి చర్చించి, ఇవి 3 కలవని నిర్ధారించారు. అవి సెరిస్, ప్లూటో, ఎరిస్.[1] అ.ఖ.స. పని విధానాలను రూపొందించారు.[2] ఈ సమావేశం 12 రోజులు జరిగింది. ఇందులో 2412 మది పాల్గొన్నారు,[3]

ఇవీ చూడండి

బయటి లింకులు

మూలాలు

  • Statutes of the IAU, VII: General Assembly, ss. 13-15
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ