అంజలి (నటి)

సినీ నటి

అంజలి (English: Anjali) తమిళ సినిమాలలో నటిస్తున్న ఒక భారతదేశ నటీమణి, మోడల్. అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో 1986 సెప్టెంబరు 11న జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది.[1]

అంజలి
జననం
అంజలి

(1986-09-11) 1986 సెప్టెంబరు 11 (వయసు 37)
వృత్తినటీమణి, మోడల్.
క్రియాశీల సంవత్సరాలు2006–ఇప్పటి వరకు

సినీ ప్రస్థానం

  • మ్యాథ్స్‌లో డిగ్రీ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించేది. అవే సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా మారాయి. అలా తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అదే తెలుగులో వచ్చిన 'డేర్'.
  • తర్వాత 2006లో 'ఫొటో' సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 2007లో 'ప్రేమలేఖ రాశా'.. సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన 'షాపింగ్‌మాల్' సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ 'జర్నీ'లో అవకాశం ఇచ్చారు.
  • 2011లో విడుదలైన 'జర్నీ' సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్‌తో అందరికీ గుర్తుండిపోయింది.
  • 2013లో మళ్లీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు.
  • తర్వాత 'బలుపు' సినిమాలో శృతిహాసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని, రవితేజతో ఆడిపాడింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. సింగం-2 తమిళ వెర్షన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి.
  • ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా ముందుకు సాగిపోతోంది.
  • తమిళచిత్రం 'ఎంగేయం ఎప్పోదం' (తెలుగులో జర్నీ)లో తన అద్భుతమైన నటనకు గాను 'సౌత్ ఫిల్మ్‌ఫేర్-2012', 'విజయ్' అవార్డులు సొంతం చేసుకుంది.

ఈమె నటించిన పాత్రల్లో రెండు చిన్న తెలుగు సినిమాలో నటించిన సమయంలో 2007 సంవత్సరంలో కట్రదు తమిళ్ అనే తమిళ సినిమాతో పరిచయమైయ్యారు. ఆనంది అనే పాత్రలో చాలా అద్భుతంగా నటించడంతో ఉత్తమ నూతన నటిగా దక్షిణ ప్రాంత ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2010లో అంగాడితెరు అనే సినిమాలో కనిగా నటించి ఆ సంవత్సరంలోని ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల తరువాత అత్యుత్తమ యువ నటిగా తమిళ సినిమా ప్రపంచంలో గుర్తింపు పొందారు,[2] ప్రదర్శన ఆధారిత పాత్రలలో నటిస్తు ప్రసిద్ధి చెందుతున్నారు.[3][4][5]

సినిమాలు

సంవత్సరంసినిమాపాత్రభాషగమనికలు
2006ఫోటోస్వప్నతెలుగు
2007ప్రేమలేఖ రససంద్యతెలుగు
కత్తరదు తమిళ్ఆనందితమిళం
2008హొంగనాసుఇంపానాకన్నడ
ఆయుధం సీవోంమీనాక్షితమిళం
2010అంగడి తేరుసెర్మక్కనితమిళం
రెట్టైసుజిసుశీలతమిళం
మాగిజ్చికుజాలీతమిళం
2011పయ్యన్స్సీమమలయాళం
తూంగా నగరంకలైవాణి (రాధ/తేరు త్రిష)తమిళం
కరుంగళిఅముధానిల గుణశేఖరన్తమిళం
కోఅంజలితమిళం"ఆగ నాగ" పాటలో ప్రత్యేక పాత్ర
మంకథసుచిత్ర సుమంత్తమిళం
ఎంగేయుమ్ ఎప్పోతుమ్మణిమేగలై రామసామితమిళం
తంబి వెట్టోటి సుందరంలార్డ్ మేరీతమిళం
మహారాజాప్రియాతమిళం
2012అరవాన్వాంచితమిళంఅతిధి పాత్ర
కలకలప్పుమాధవితమిళం
2013సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుసీతతెలుగు
వాటికూచిలీనాతమిళం
సెట్టైశక్తితమిళం
బలుపుడా. అంజలితెలుగు
సింగం IIఅంజలితమిళం"వాలే వాలే" పాటలో ప్రత్యేక ప్రదర్శన[1]
మసాలాసానియా / సరిత / సావిత్రి (చిత్రం)తెలుగు
2014గీతాంజలిగీతాంజలి / ఉషాంజలి (ద్వంద్వ పాత్రలు)తెలుగు
2015రాణా విక్రమగౌరీకన్నడ
సకలకళ వల్లవన్అంజలితమిళం
శంకరాభరణందఖు రాణి మున్నీతెలుగుఅతిధి పాత్ర
2016నియంతకాత్యాయినితెలుగు
మాప్లా సింగంశైలజతమిళం
సర్రైనోడుసింతామణితెలుగు"బ్లాక్ బస్టర్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
ఇరైవిపొన్నితమిళం
2017ఎనక్కు వైత ఆదిమైగల్సంధ్యతమిళంఅతిధి పాత్ర
చిత్రాంగదచిత్రాంగదతెలుగు
తారామణిసౌమ్యతమిళంఅతిధి పాత్ర
బెలూన్జాక్వెలిన్తమిళం
2018రోసాపూరేష్మిమలయాళం
కాళీవల్లితమిళం
2019పేరంబువిజయ లక్ష్మి "విజి"తమిళం
లిసాలిసాతమిళం
సింధుబాద్వెన్బాతమిళం
2020నాడోడిగల్ 2సెంగోడితమిళం
నిశ్శబ్ధం /మహా లక్ష్మి "మహా"తెలుగుద్విభాషా చిత్రం
నిశ్శబ్దంతమిళం
పావ కదైగల్జ్యోతి లక్ష్మి/ ఆది లక్ష్మితమిళంనెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ; సెగ్మెంట్: లవ్ పన్నా ఉత్తరం
2021వకీల్ సాబ్జరీనాతెలుగు
2022బైరాగీసంగీత ఉపాధ్యాయుడుకన్నడ
మాచర్ల నియోజకవర్గంఆమెనేతెలుగు"రా రా రెడ్డి ఐయామ్ రెడీ" సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్
2023ఇరట్టమాలినిమలయాళం
2024గీతాంజలి మళ్ళీ వచ్చిందిగీతాంజలి / ఉషాఅంజలి (ద్విపాత్రాభినయం)తెలుగు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిరత్నమాలతెలుగు
గేమ్ ఛేంజర్తెలుగు

వెబ్ సిరీస్

సంవత్సరంపేరుపాత్రభాషగమనికలుమూలాలు
2021నవరసముత్తులక్ష్మితమిళంనెట్‌ఫ్లిక్స్ సిరీస్ విభాగం: తునింత పిన్
2022ఝాన్సీఝాన్సీతెలుగుహాట్‌స్టార్ విడుదల[6]
2024బహిష్కరణతెలుగుజి 5 తెలుగు వెబ్ సిరీస్[7]

వివాదాలు

2013, ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఉంటున్న హోటల్ నుంచి ఉన్నట్టుండి మాయమవడంతో కాస్త అలజడి సృష్టించింది అంజలి. తర్వాత పోలీసుల ముందు ప్రత్యక్షం కావడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. పిన్ని భారతీదేవి, దర్శకుడు కలాంజియం కలిసి తనను హింసిస్తున్నారంటూ మీడియాకు తెలిపింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

పురస్కారాలు

నంది పురస్కారాలు

  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ప్రత్యేక బహుమతి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)[8][9][10][11]

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు

విజయ్ పురస్కారాలు

  • 2008: ఉత్తమ నూతన నటీమణి - కట్రదు తమిళ్ [12]
  • 2011: ఉత్తమ నటీమణి - అంగాడితెరు

ఇతర పురస్కారాలు

  • 2011: ఉత్తమ నటిగా విగడన్ పురస్కారం- అంగాడితెరు
  • 2011: ఉత్తమ నటిగా తమిళ సినిమా ప్రెస్ పురస్కారం- గాడితెరు

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ