1934 మద్రాసు ప్రెసిడెన్సీ శాసనమండలి ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
1934 మద్రాసు ప్రెసిడెన్సీ శాసనమండలి ఎన్నికలు

← 19301934 నవంబరు1937 →

98 స్థానాలకు
మెజారిటీ కోసం 50 సీట్లు అవసరం
 First partySecond party
 
Leaderసత్యమూర్తిబొబ్బిలి రాజా
Partyస్వరాజ్ పార్టీజస్టిస్ పార్టీ
Seats won2928
Seat changeIncrease 29Decrease 7
Percentage29.59%28.57%
SwingIncrease 29.59%Decrease 7.14%

ఎన్నికలకు ముందు ఫస్ట్ మినిస్టర్

బొబ్బిలి రాజా
జస్టిస్ పార్టీ

Elected ఫస్ట్ మినిస్టర్

బొబ్బిలి రాజా
జస్టిస్ పార్టీ

భారత ప్రభుత్వ చట్టం, 1919 ద్వారా ద్వంద్వస్వామ్య పాలన[1] వ్యవస్థను స్థాపించిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీకి జరిగిన ఐదవ శాసన మండలి ఎన్నికలలో పాలక జస్టిస్ పార్టీ ఓడిపోయింది. ప్రతిపక్ష స్వరాజ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ద్వంద్వస్వామ్యాన్ని వ్యతిరేకించిన స్వరాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది. అప్పటి వరకూ ఉన్న ఫస్ట్ మినిస్టర్ (ప్రధాన మంత్రి) బొబ్బిలి రాజా, తన అధికారాన్ని నిలబెట్టుకొని మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.

నేపథ్యం

1933 నాటికి, రాజ్యాంగ సంస్కరణలు చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ద్వంద్వస్వామ్యాన్ని రద్దు చేస్తారనే అంచనాలు వేస్తున్నారు. 1933 నవంబరు 5 న ముగియాల్సిన నాల్గవ కౌన్సిల్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించారు. ఎందుకంటే ద్వంద్వస్వామ్య పాలన రద్దు చేయటానికి ముందు కొత్త కౌన్సిల్ దాని పూర్తి కాలాన్ని పూర్తి చేయదని భావించారు. కానీ, ఏడాది గడిచినా ఆశించిన సంస్కరణలు కార్యరూపం దాల్చకపోవడంతో కొత్త కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం పోరాడుతున్న జమీందారీ, జమీందారీయేతర వర్గాల మధ్య జస్టిస్ పార్టీ చీలిపోయింది. జమీందారీ వర్గం చివరికి గెలిచింది. దాని నాయకుడు, బొబ్బిలి రాజా, 1932 నవంబరులో P. మునుస్వామి నాయుడు స్థానంలో ఫస్ట్ మిన్మిస్టర్ (ప్రధాన మంత్రి) అయ్యాడు. మహా మాంద్యం మధ్య అతని భూస్వామి అనుకూల ఆర్థిక విధానాలు ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. భారత జాతీయ కాంగ్రెస్, దాని ఎన్నికల విభాగం, స్వరాజ్ పార్టీలు ద్వంద్వస్వామ్యాన్ని వ్యతిరేకించినప్పటికీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి. 1930-31లో ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించి కాంగ్రెస్ బాగా పుంజుకుంది. శాసనోల్లంఘన ఉద్యమం, భూమి శిస్తు తగ్గింపు ఆందోళనలు, యూనియన్ సంస్థలు బొబ్బిలి రాజా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను సమీకరించడానికి కాంగ్రెస్‌కు సహాయపడ్డాయి. దీనికి విరుద్ధంగా, వర్గపోరాటాలతో కునారిల్లుతున్న జస్టిస్ పార్టీ, తన బ్రాహ్మణ వ్యతిరేకతను పలుచన చేసి, బ్రాహ్మణులను సభ్యులుగా అనుమతించవలసి వచ్చింది.[2][3][4]

నియోజకవర్గాలు

మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోని <i id="mwJg">ఎక్స్-అఫిషియో</i> సభ్యులతో పాటు మొత్తం 132 మంది సభ్యులు ఉన్నారు. 132 మందిలో, 98 మంది ప్రెసిడెన్సీ లోని 61 నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యారు. నియోజకవర్గాల్లో మూడు రకాలున్నాయి - 1) మహమ్మదీయేతర పట్టణ, మహమ్మదీయేతర గ్రామీణ, బ్రాహ్మణేతర పట్టణ, మహమ్మదీయ పట్టణ, మహమ్మదీయ గ్రామీణ, భారత క్రిస్టియన్, యూరోపియన్, ఆంగ్లో-ఇండియన్ 2) భూస్వాములు, విశ్వవిద్యాలయాలు, ప్లాంటర్లు, వర్తక సంఘాలు (సౌత్ ఇండియా ఛాంబరు ఆఫ్ కామర్స్ & నట్టుకోట్టై నగరతార్ అసోసియేషన్) వంటి ప్రత్యేక నియోజకవర్గాలు, 3) ప్రాదేశిక నియోజకవర్గాలు. 28 నియోజకవర్గాలు బ్రాహ్మణేతరులకు రిజర్వ్ చేయబడ్డాయి. 34 మంది స్థానాలకు సభ్యులను నామినేట్ చేస్తారు. వీరిలో గరిష్ఠంగా 19 మంది ప్రభుత్వ అధికారులు, 5 గురు మహిళలు, 5 గురు పరైయర్, పల్లర్, వళ్లువర్, మాల, మాదిగ, సక్కిలియార్, తొట్టియార్, చెరుమాన్, హోలెయ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒకరు "వెనుకబడిన వర్గాల వారు". కార్యనిర్వాహక మండలి సభ్యులతో కలిపి, శాసనసభ మొత్తం బలం 134. ఆస్తి అర్హతల ఆధారంగా వోటుహక్కును పరిమితం గానే ఉంటుంది.[5][6][7]

ఫలితాలు

ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఓడిపోయింది. స్వరాజ్య పార్టీ 29 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ప్రభుత్వ ఏర్పాటు

స్వరాజ్య పార్టీ రాజ్యం పట్ల వ్యతిరేకత కారణంగా అధికారాన్ని స్వీకరించడానికి నిరాకరించింది. బొబ్బిలి రాజా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. జస్టిస్ పార్టీ నేతలు ఆర్కే షణ్ముఖం చెట్టి, ఆర్కాట్ రామసామి ముదలియార్ ల అభ్యర్థిత్వానికి పార్టీ చీఫ్ విప్ ఎంఏ ముత్తయ్య చెట్టియార్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో వారిద్దరు తమ స్థానాలను కోల్పోయారు. దానికి ప్రతీకారంగా బొబ్బిలి రాజా, అతన్ని పార్టీ విప్‌ పదవి నుంచి తొలగించాడు. అందుకు ప్రతిగా చెట్టియార్, మైనారిటీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాడు. ఆయనను బుజ్జగించేందుకు బొబ్బిలి రాజా, విద్యాశాఖ మంత్రిగా ఎస్. కుమారస్వామి రెడ్డియార్ స్థానంలో చెట్టియార్‌ను నియమించాడు. ఇతర వర్గాలను సంతృప్తి పరచడానికి, కొత్తగా అతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను సృష్టించాడు. మహ్మద్ ఉస్మాన్, ఆ తరువాత AT పన్నీర్ సెల్వంలను దానికి మంత్రులుగా నియమించాడు.[3][4][8]

మూలాలు

మార్గదర్శకపు మెనూ