వైశాఖి

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
వైశాఖి
వైశాఖి
ఖల్సా జన్మస్థానం. ఆనందపూర్ సాహిబ్. పంజాబ్. భారతదేశం.
యితర పేర్లుబైశాఖి, వైశాఖి, ఖల్సా సిర్జాణా దివస్
జరుపుకొనేవారుఖల్సా సిర్జాణా దివస్-సిక్కులు. పంట పండుగ/పంజాబీ కొత్త సంవత్సరం- రెండు మతాలు
రకంపంజాబీ పండుగ
ప్రాముఖ్యతపంట కాలం మొదలయ్యే రోజు, పంజాబీ ఉగాది, కొత్త సంవత్సరం, ఖల్సా పుట్టినరోజు
ఉత్సవాలుఊరేగింపులు, నగర సంకీర్తనలు. తిరునాళ్ళు, బారసాలలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి (అమృత సంచార వేడుక)
వేడుకలుప్రార్థనలు, ఊరేగింపులు, నిషాన్ సాహిబ్ జండా ఎగరవెయ్యడం, తిరునాళ్ళు.

వైశాఖి, లేదా బైశాఖి సిక్కులకు పెద్ద పండుగ. 1699 లో గురు గోబింద్ సింగ్ ఇదే రోజున ఖల్సా స్థాపించాడు. దానికి గుర్తుగా ఈ పండుగను జరుపు కుంటారు. హిందువులకు కూడా ఇది పండుగ దినమే. వైశాఖమాసంలో మొదటిరోజున ఈ పండుగ వస్తుంది. సూర్య మాన పంచాంగం ప్రకారం ఇది సంవత్సరంలో మొదటి రోజు. పంట ఇంటికి వచ్చే రోజుగా దీన్ని హిందువులు, సిక్కులు జరుపుకుంటారు. రోమన్ కాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా ఏప్రిల్ 13 / 14 తేదీలలో వస్తుంది.

ఏరోజు ఎలా

వైశాఖి పండుగ సాధారణంగా ఏప్రిల్ 13 తేదీన వస్తుంది.[1]

ఇది ముఖ్యంగా సిక్కు సమాజానికి చాలా ప్రధానమైన పండుగ. అదేరోజు ఖల్సా స్థాపించబడడం వలన దీనికి ఖల్సా సిర్జాన దినం (Khalsa Sirjana Divas) అని కూడా పిలుస్తారు.[2] నానక్‌షాహీ క్యాలెండర్లో, రెండో నెల వైశాఖ్ మొదటి రోజున ఈ పండుగ వస్తుంది. ఈ కాలెండరు ప్రకారం, ఖల్సా సిర్జానా దినం ఏప్రిల్ 14 న వస్తుంది.[3][4]

మరి కొన్ని సందర్భాల్లో వైశాఖి ఏప్రిల్ 14 న వస్తుంది. ఉపఖండంలోని చాలా ప్రాంతాల్లో మేష సంక్రాంతిని కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు. హిందువులకు ఇది ముఖ్యమైన రోజు. చాంద్ర మానం ప్రకారం కొత్త సంవత్సరం జరుపుకునే ప్రాంతాల వారికి కూడా మేష సంక్రాంతి ముఖ్యమైన రోజే.[5]

ఇదే పండగరోజు మిగిలిన ప్రాంతాలలో కూడా జరుపుకొంటారు. బెంగాల్లో పోహెలా బోయ్‌షాఖ్ అనే పేరుతో కొత్త సంవత్సర వేడుక చేసుకుంటారు. అస్సాంలో బోహాగ్ బిహు అని, తమిళనాడులో పుత్తండు అనే పేరుతో కొత్త సంవత్సరాన్నీ జరుపుకుంటారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

"https://www.search.com.vn/wiki/?lang=te&title=వైశాఖి&oldid=3811145" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ