అష్టలక్ష్ములు

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
అష్ట లక్ష్ములు, మధ్యలో లక్ష్మీనారాయణులు

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.

ఈ అష్టలక్ష్ములు

  1. ఆదిలక్ష్మి: "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.[1][2]
  2. ధాన్యలక్ష్మి: ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. [3]
  3. ధైర్యలక్ష్మి: "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రాలు ధరించింది. చక్రం, శంఖం, ధనుర్బాణములు, త్రిశూలం, పుస్తకం (?) ధరించిఉంటుంది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.[4][5]
  4. గజలక్ష్మి: రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, రెండు చేతులలో రెండు పద్మాలు కలిగిఉంటుంది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.[6] [7]
  5. సంతానలక్ష్మి: ఆరు చేతులుతో, రెండు కలశాలు, ఖడ్గం, డాలు ధరించిఉంటుంది. వడిలో బిడ్డ ఉంటుంది. ఒకచేత అభయముద్ర కలిగి, మరొక చేతిలో బిడ్డను పట్టుకుని ఉంటుంది.బిడ్డ చేతిలో పద్మం ఉంటుంది.[8][9]
  6. విజయలక్ష్మి: ఎనిమిది చేతులుతో, ఎర్రని వస్త్రాలు ధరించి,శంఖం, చక్రం, ఖడ్గం, డాలు, పాశం ధరించిన అవతారంతో ఉంటుంది. రెండు చేతుల వరదాభయ ముద్రలుతో ఉంటుంది.[10] [11] [12]
  7. విద్యాలక్ష్మి: శారదా దేవి. చదువులతల్లి. చేతి యందు వీణ వుంటుంది.[13]
  8. ధనలక్ష్మి: ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించి, శంఖ చక్రాలు, కలశం, ధనుర్బాణాలు, పద్మం ధరించిన అవతారంతో ఉంటుంది. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.[14]

కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.

ప్రార్థన

రంగాపురం దేవాలయంలో గజలక్ష్మి మూర్తి

ఒక ప్రార్థన:

అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

అష్టలక్ష్మి స్తోత్రం

ఆదిలక్ష్మి

సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే

మునిగణ వందిత మోక్ష-ప్రదాయని మంజుల భాషిణి వేదనుతే

పంకజ-వాసినీ దేవా సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయ హే మధుసూధన కామినీ ఆది లక్ష్మీ సదా పాలయ మామ్ (1)

ధాన్యలక్ష్మి

అయి కలి కల్మష నాసినీ కామినీ వైదిక రూపిణీ వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర-నివాసిని మంత్రనుతే మంగళ దాయినీ

అంబుజ వాసినీ దేవగణాశ్రిత పాదయుతే

జయ జయ హే మధుసూధన కామినీ ధాన్య లక్ష్మీ సదా పాలయ మామ్ (2)

ధైర్యలక్ష్మి

జయ వర వర్ణిని వైష్ణవి భార్ఘవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద

జ్ఞాన వికాసిని శాస్త్రానుతే

భవ భయ హారిణి పాప-విమోచని సాధు జనాశ్రిత పాదయుతే

జయ జయ మా హే మధుసూధన కామినీ ధైర్య లక్ష్మీస్ (పా)

గజలక్ష్మి

జయ జయ దుర్గతి నాసినీ కామినీ సర్వ ఫలప్రద శాస్త్రమయే

రాధా గజ తుర్గ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే

హరి హర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే

జయ జయ హే మధుసూధన కామినీ గజ లక్ష్మీ రూపేణ పాలయ మామ్ (4)

సంతానలక్ష్మి

అయిఖగ వాహిని మోహినీ చక్రిణి రాగ-వివర్ధిని జ్ఞానమయే

గుణ గాన వారధి లోక-హితైషిణి స్వరసప్త భూషిత గణనుతే

సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే

జయ జయ హే మధుసూధన కామినీ సంతాన లక్ష్మీ త్వమ్ పాలయ మామ్ (5)

విజయలక్ష్మి

జయ కమలాసినీ సద్గతి దాయిని జ్ఞాన-వికాసిని గానమయే

అనుదిన మార్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే

కనకధార స్తుతి వైభవ వందిత శంకర-దేశిక మన్యపాదే

జయ జయ హే మధుసూధన కామినీ విజయ లక్ష్మీ సదా పాలయ మామ్ (6)

విద్యాలక్ష్మి

ప్రనాథ సురేశ్వరి భారతీ భార్ఘవి శోక-వినాసినీ రత్నమయే

మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయినీ కలిమల

హారిణి కమిత ఫలప్రద హస్తయుతే

జయ జయ హే మధుసూధన కామినీ విద్యా లక్ష్మీ సదా పాలయ మామ్ (7)

ధనలక్ష్మి:-

ధీమి-ధిమి ధిమ్ధిమి ధిమ్ధిమి-ధింధిమి దుమ్ధుభి నాద సుపూర్ణమయే

ఘుమ-ఘుమ ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమ శంఖ-నినాద సువాద్యనుతే

వేద పురాణీతిహాస సుపూజిత వైదికమార్గ

హామినీ కామినీ మధురమార్గ ప్రదర్శయయుతే జయం (8)

"అష్టలక్ష్మీ స్తోత్రం" అనేది ఒక ప్రసిద్ధ ప్రార్థన. "జయ జయహే మధుసూదన కామిని .. " అని ప్రతి శ్లోకం చివరి పాదంలోను వచ్చే ఈ శ్లోకం పలు సందర్భాలలో పాడుతారు. ఇంకా అనేక తెలుగు, సంస్కృత ప్రార్థనా గీతాలున్నాయి.

ఇవికూడా చూడండి

మందిరాలు

మూలాలు

వెలుపలి లంకెలు

మార్గదర్శకపు మెనూ